Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Andhra Pradesh మంగళగిరి 7.30 గంటల నాన్ స్టాప్ పట్టాభిషేకం.

మంగళగిరి 7.30 గంటల నాన్ స్టాప్ పట్టాభిషేకం.

by CVR NEWS

మంగళగిరి నియోజకవర్గంలోని అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు ఉద్దేశించిన మన ఇల్లు – మన లోకేశ్ కార్యక్రమం మంగళగిరిలో ఓ పండుగలా జరిగింది. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా తొలిరోజు 1331 మంది లబ్ధిదారులకు శాశ్వత ఇళ్ల పట్టాలను అందజేశారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం తొమ్మిదిన్నర ప్రారంభమైన పట్టాల పంపిణీ సాయంత్రం 5 గంటల వరకు నిరంతరాయంగా కొనసాగింది. లబ్ధిదారుల ‘పట్టా’భిషేకం అనదగ్గ ఈ కార్యక్రమంలో మంత్రి లోకేశ్ దాదాపు ఏడున్నర గంటల పాటు నిలబడే ఉండడం విశేషం. ప్రతి లబ్ధిదారుడికి ఆయనే స్వయంగా పట్టాలు అందించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు. పట్టా పత్రాలతో పాటు లబ్ధిదారులందరికీ నూతన వస్త్రాలను కూడా మంత్రి లోకేశ్ బహూకరించారు. సుదీర్ఘ సమయం పాటు ఒకేచోట నిలబడి ఓపికగా పట్టాలు పంపిణీ చేయడంపై కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నాయకులు, ప్రజలు ప్రశంసలు తెలిపారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

042266
Total views : 223657

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: