Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Health ఎసిడిటీతో బాధపడుతున్నారా.. అయితే ఇలా చెయ్యండి!

ఎసిడిటీతో బాధపడుతున్నారా.. అయితే ఇలా చెయ్యండి!

by Satya
Acidity

ఎసిడిటీ చాలా మంది తిన్న ఆహారం జీర్ణంకాక ఇబ్బంది పడుతుంటారు. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఛాతిలో నొప్పి కలిగినట్టుగా ఉంటుంది. నోటి నుంచి దుర్వాసన తదితర లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటివన్నీ ఎసిడిటీ లక్షణాలు. ఈ ఎసిడిటీని తగ్గించుకునేందుకు పాటించాల్సిన చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము. ఉదయాన్నే పరగడుపునే నాలుగైదు పుదీనా ఆకులను నమిలి మింగితే ఎసిడిటీని తగ్గిస్తాయి. భోజనం తర్వాత పుదీనా ఆకుల రసాన్ని నీటిలో కలుపుకుని తాగినా అసిడిటీ నుంచి బయట పడవచ్చు. తులసి ఆకులను భోజనానికి ముందు నములుతుంటే ఎసిడిటీ రాకుండా చూసుకోవచ్చు. భోజనం చేసిన తర్వాత 20 నిమిషాలు ఆగి కొబ్బరి నీళ్లు తాగాలి, దీనివల్ల ఎసిడిటీ తగ్గుతుంది. భోజనానికి ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ నిమ్మరసం కలిపి తాగితే ఎసిడిటీ రాదు. చక్కెర లేకుండా చల్లని పాలు తాగాలి, లేదా చెంచా నెయ్యి కలిపిన పాలను తీసుకోవాలి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: