వినాయక చవితి పండుగ వేళ తిరుమలలో విషాదం నెలకొంది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఉన్న భక్తురాలు ఝాన్సీ గుండెపోటుతో కుప్పకూలింది. అక్కడే ఉన్న తోటి భక్తులు, ఆమె తండ్రి అయోమయానికి గురయ్యారు. ఇంతలో వైద్య సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న నర్సులు ఆమెకు గుండెపోటు వచ్చినట్లు గుర్తించారు. వెంటనే ఝాన్సీకి సీపీఆర్ మొదలుపెట్టారు. ఈక్రమంలో తోటి భక్తులు, నర్సులు సీపీఆర్ చేసి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించేలోపు ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఝాన్సీ తండ్రి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తన కూతురికి ఇద్దరు కవల పిల్లలున్నారని చెప్పారు. వారి పరిస్థితి ఏంటని ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యారు. అంబులెన్స్ గంట ఆలస్యంగా రావడంతోనే తమ కూతురు చనిపోయిందని తండ్రి బోరున విలపించాడు. అంబులెన్స్ వెంట వెళ్లిన తోటి భక్తులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు. అయితే అంబులెన్స్ గంట లేటుగా రావడం పై మృతురాలి తండ్రి, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- కొత్తగూడెంలో మార్మోగిన ఆదివాసీ పోరుకేక.మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం కేంద్రంగా ఆదివాసీలు తమ గళాన్ని వినిపించారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి (ఏహెచ్‌పీఎస్) తుడుం దెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆదివాసీ పోరుకేక’ భారీ బహిరంగ సభకు రాష్ట్రంలోని వివిధ ఏజెన్సీ ప్రాంతాల నుండి వేలాది మంది ఆదివాసీలు…
- ప్రశ్నించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్ రావు.తెలంగాణలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సభ పెడతానంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని విమర్శించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా, ఎక్కడైనా సభ పెట్టుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు.…
- అమీర్‌పేట్ మైత్రీవనంలో అగ్నిప్రమాదంమైత్రీవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం కారణంగా మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. దీంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ సిబ్బంది మంటలను…
- సచివాలయంలో తెలంగాణ ఉద్యమకారులపై కీలక భేటీ..!తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అసలైన ఉద్యమకారుల గుర్తింపు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు కేకే అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియపై విస్తృతంగా చర్చించారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యమకారులకు అన్యాయం జరిగిందన్న…
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. అమరావతిలో జరుగుతున్న కీలక కేబినెట్ సమావేశానికి హాజరైన పవన్ కళ్యాణ్, అస్వస్థత కారణంగా సమావేశం మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్న ఆయన నేరుగా మంగళగిరిలోని క్యాంప్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 92811