Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Andhra Pradesh అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులు ఉక్కు పాదం

అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులు ఉక్కు పాదం

by Satya
అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులు ఉక్కు పాదం

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అనుమతులు లేని అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులు ఉక్కు పాదం మోపారు. పట్టణ శివారులోని బంధం పల్లి చెరువు వద్ద అనుమతులు లేకుండా నిర్మించిన నిర్మాణాలతోపాటు అక్రమంగా వెలసిన లేఔట్ లేని వెంచర్ల హద్దురాళ్లను తొలగించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలమేరకు పెద్దపల్లి ఆర్డీఓ, ల్యాండ్ సర్వేర్, జిల్లా ఇరిగేషన్ అధికారులతో పాటు మున్సిపల్ శాఖ అధికారులు అనుమతిలేని కట్టడాల వివరాలు అందజేశారు. వాటి ఆధారంగా కొన్ని ఇళ్లతో పాటు.. వెంచర్ల హద్దురాళ్లను జేసీబీలతో తొలగించి నిర్మాణాలను కూల్చివేశారు. బంధంపల్లి చెరువును ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ గా గుర్తించి అందులో ఉన్న రెండు రేకుల షెడ్లు, అక్రమ వెంచర్ ను గుర్తించి అక్రమ వెంచర్ ప్రహరీ గోడను జేసీబీతో తొలిగించారు. త్వరలోనే పెద్దపల్లి, పరిసర గ్రామాల్లోని చెరువుల్లో ఉన్న అక్రమ కట్టడాలను కూల్చేయబోతున్నట్లు ఆర్డీవో గంగయ్య తెలిపారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.
    హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సేవలను సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా.. రోశయ్య మాత్రం తన ప్రత్యేకతను…
  • ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..
    ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌లో హీరో సూరి మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌లో హీరో సుహాస్ ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్…
  • నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.
    ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
  • మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.
    బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్‌–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…
  • ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.
    ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్‌కు వస్తున్న జిన్‌పింగ్‌ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్‌పింగ్‌తో పాటు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: