బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. తాజాగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టీ.ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో హస్తం పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పుష్పగుచ్చాన్ని అందించారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. తాజా చేరికతో మొత్తం 8 మంది కాంగ్రెస్‌లో చేరినట్టయింది. కాంగ్రెస్ గూటిలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కాగా మరో ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యానించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
- జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామంలో విషాదం.జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న థార్ కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన వెంటనే గ్రామస్తులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఉన్న ఇద్దరు…
- గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు తప్పిన ప్రమాదం.గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు ప్రమాదం తప్పింది. వారు ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చెలరేగిన ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. దీంతో వెంటనే ఆటగాళ్లు, సహాయక సిబ్బంది బస్సులో నుంచి దిగిపోయారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా తొలుత పొగలు వచ్చాయి. వెంటనే…
- ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూత.భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఓ మధుర స్వరం మూగబోయింది. తన గానామృతంతో కోట్లాది మంది సంగీతాభిమానులను అలరించిన ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూశారు. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సంగీత ప్రస్థానం ఎన్నో అజరామర గీతాలను…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 90417