సుప్రసిద్ధ నటులు పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), మాదాపూర్ లో యోదా డయాగ్నొస్టిక్స్ (Diagnostics) కొత్త బ్రాంచ్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యోదా అధినేత కంచర్ల సుధాకర్ ను మంత్రి దామోదర్ రాజ నరసింహ ఒక ప్రశ్న అడిగారు. ‘ఈ డయాగ్నొస్టిక్ సెంటర్ చాలా ఆధునికతగా ఉంది కదా, మరి ఇది పేద వారికి ఎంత వరుకు ఉపయోగపడుతుంది అని?’ దానికి సమాధానం గా చిరంజీవి స్టేజి పై ఇలా చెప్పారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
చిరంజీవి మాట్లాడుతూ: కంచర్ల సుధాకర్ నాకు తమ్ముడు లాంటి వాడు, ఆయన గతంలో అమీర్ పేట లో యోదా బ్రాంచ్ ప్రారంభించినప్పుడు నేను అడిగాను, అత్యాధునిక సదుపాయాలతో ఉన్న ఈ యోదా డయాగ్నొస్టిక్ సెంటర్ పేద ప్రజలకు, మా సినిమా కార్మికులకు ఎంత వరుకు ఉపయోగపడుతుంది అని? దానికి కంచర్ల సుధాకర్ ఇలా అన్నారు “అన్నయ్య మన సినిమా వారి అందరికి హెల్త్ కార్డు ఇస్తాను, అవి చూపిస్తే వారికి అతి తక్కువ ధరలకే ఇక్కడ ఉన్న అన్ని టెస్టులు చేయించుకోవచ్చు అని”. ఆ మాటలకి నాకు ఎంతో స్ఫూర్తి కలిగి, నా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ని యోదా డయాగ్నొస్టిక్ తో అనుసంధానం చేసి 14,000 మంది సినీ కార్మికులకు వారి కుటుంబాలకు హెల్త్ కార్డ్స్ ని మంజూరు చేశాము. ఇప్పుడు ఈ మాదాపూర్ బ్రాంచ్ ప్రారంభోత్సవం సందర్భంగా యుట్యూబర్స్, ఇన్ఫ్లుఎన్సర్స్ కి కూడా హెల్త్ కార్డ్స్ మంజూరు చేస్తున్నాం. అని చెప్పి చిరంజీవి స్వయానా ఆయన చేతుల మీదగా హెల్త్ కార్డ్స్ మంజూరు చేశారు. కంచర్ల సుధాకర్ లాంటి వ్యక్తి చాలా అరుదుగా ఉంటారని, ఒక పక్క వ్యాపారం ఇంకో పక్క ఉదాసీనత రెండు చాటుకోవడం చాలా రేర్ కాంబినేషన్ అని కొనియాడారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సేవలను సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా.. రోశయ్య మాత్రం తన ప్రత్యేకతను…
- ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో హీరో సూరి మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో హీరో సుహాస్ ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్…
- నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి