తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుస పర్యటనలతో బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికా, దక్షిణకొరియా దేశాల్లో పర్యటించిన రేవంత్ రెడ్డి ఇటివలే హైదరాబాద్ కు చేరుకున్నారు. తాజాగా ఆయన ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. హస్తినలో ఫాక్స్ కాన్ కంపెనీ ప్రతినిధులతో భేటీ అవుతారు. అనంతరం పార్టీ హైకమాండ్ తో సమావేశమవుతారు. టీపీసీసీ నూతన చీఫ్ ఎంపిక, నామినేటెడ్ పదవుల భర్తీతో పాటు మంత్రివర్గ విస్తరణపై పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలతో చర్చిస్తారు. దీంతోపాటు వరంగల్ లో జరగనున్న రైతు కృతజ్ఞత సభకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు. మంత్రివర్గ విస్తరణ విషయానికి వస్తే. కేబినెట్ లో కొందరి శాఖలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు ఈసారి మైనార్టీలకు స్థానం కల్పించవచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మంత్రివర్గంలో స్థానంపై పలువురు సీనియర్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. తమకు అనుకూలంగా ఉన్న మార్గాల ద్వారా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు.పుతిన్‌కు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఢిల్లీలో స్వాగతం పలికారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన 2022 తర్వాత రష్యా వెలుపల జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు పుతిన్ స్వయంగా హాజరవడం ఇదే తొలిసారి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై…
- పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.పోలాండ్ రాజధాని వార్సాలో జరిగిన ఓ వినూత్న నిరసన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. సెప్టెంబర్ 7న హ్యూమనాయిడ్, క్వాడ్రుపెడ్ రోబోలు వీధుల్లో మార్చ్ నిర్వహించాయి. పోలాండ్ డిజిటల్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట రోబోలు జెండాలు ఊపుతూ, నినాదాలు…
- నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్’.గణేశ్ చతుర్థి వేడుకలకు ముందే మహారాష్ట్రలో పర్యావరణ హిత గణపతి విగ్రహాల తయారీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నవీ ముంబైలో రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్’లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్…
- మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాందేడ్ జిల్లాలో వ్యాన్, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వెళ్తున్న వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు వాహనాలు తీవ్రంగా…
- ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.ఏపీలో వాతావరణశాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విశాఖ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి