హైదరాబాద్ లో రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ కు చెక్ పెట్టేందుకు జిహెచ్ఎంసి, ట్రాఫిక్ పోలీసులు అనేక కార్యక్రమాలు చేపట్టారు. రోడ్ల పరిస్థితి, ఆయా రోడ్లపై సగటును రాకపోకలు చేస్తున్న వాహనాలను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకుంటున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నప్పటికీ అధికారులు తీసుకుంటున్న చర్యలు నగరవాసులకు ఇబ్బందులు కలిగించడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో బడాబాబులకు మేలు చేసేవిగా ఉంటున్నాయి. జూబ్లీహిల్ప్, బంజారాహిల్స్, ఫిలింనగర్ ల మధ్య ఉన్న కెబిఆర్ పార్క్ కు ఓవైపు చేయదలచిన రోడ్ వెడల్పు కార్యక్రమం పట్ల స్థానికులు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీహిల్ప్ రోడ్ నెంబర్ 92ను వెడల్పు చేసే క్రమంలో ఈ రోడ్ లో ఉన్న జర్నలిస్టు కాలనీ నిర్మాణాలను కూల్చివేసేందుకు నోటీసులు ఇస్తున్నారు. కెబిఆర్ పార్క్ ను ఆనుకుని ఉన్న ఈ రోడ్ ను వెడల్పు చేయడం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అవసరమే అయినప్పటికీ అధికారులు అనుసరిస్తున్న రూట్ మ్యాప్ సరిగా లేదని స్థానికులు వాపోతున్నారు. జూబ్లీహిల్ప్ హౌసింగం సొసైటీ నిబంధనలకు విరుద్ధంగా ఈ రోడ్ లో భారీ బహుళ అంతస్తుల భవనాలను కాపాడేందుకే తమ నిర్మాణాలను కూల్చివేసేందుకు నోటీసులు ఇస్తున్నారని స్థానికులంటున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగి కర్టెన్ రైజర్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ రియాల్టీ షోలో తెలుగు లయన్స్, హిందీ హాక్స్, తమిళ్ టైగర్స్, మావెరిక్స్, కన్నడ పాంతర్స్…ఇలా ఐదు టీమ్స్ పాల్గొననున్నాయి. ఈ…
- చిలకా ప్రొడక్షన్స్ థ్రిల్లర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్..నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సతీష్ కాసెట్టి తన కొత్త థ్రిల్లర్ మూవీ ‘మరీచిక’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. వైవిధ్యమైన , ఆలోచింపజేసే కథలను చూపడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన డైరెక్టర్ మరోసారి తనదైన శైలిలో ఈసారి కూడా…
- తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. SIR ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జూన్ 25 నుంచి జులై 24 వరకు అధికారులు,…
- విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!విశాఖ జిల్లా మాడుగులలో వంట గ్యాస్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. డిజిటల్ భారత్ పేరుతో బుకింగ్ ప్రక్రియను సులభతరం చేశామని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం వినియోగదారులకు గ్యాస్ సరఫరా కావడంలేదు. మాడుగులలో గ్యాస్ బుక్ చేసిన వెంటనే వినియోగదారుల మొబైల్…
- తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్..తమిళనాట చారిత్రాత్మక విజయంతో రికార్డ్ సృష్టించిన సీఎం విజయ్..తనదైన పనితీరుతో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే తన క్రమశిక్షణ, సమయపాలన అధికారుల్లో చర్చనీయాంశంగా మారాయి. ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగిలా సచివాలయంలో విధులకు హాజరవుతుండటంపై హర్షం వ్యక్తం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 79259