హనుమకొండ జిల్లా నడికూడ మండలం కౌకొండ గ్రామానికి చెందిన మేకల యుగంధర్ అను వ్యక్తిని గొడ్డలితో నరికి చంపిన దుండగులు.. గతంలో కొన్ని పాత కక్షలను మనుసులో ఉంచుకుని హత్యకు పాల్పడినట్లు గ్రామస్థులు వెల్లడించారు. హత్య జరిగిన సంఘటన స్థలానికి చేరుకున్న దామెర SHO మల్లేశ్ హత్యకు పాత కక్షలె కారణమని ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు.
Crime
అనంతపురం జిల్లాలో ఓ ప్రైవేట్ విద్యాసంస్థలో దారుణం చోటుచేసుకుంది. అనంతపురం పట్టణ శివారులో ఉన్న సంసిద్ ఇంటర్నేషనల్ పాఠశాలలో విజయ శంకర్ అనే వార్డెన్ విద్యార్థులను చితకబాదాడు. విద్యార్థుల మర్మాంగాలపై దాడి చేసి గాయపరిచాడు. సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు వార్డెన్ గదిని తనిఖీ చేయగా.. గుట్టలు గుట్టలుగా మద్యం సీసాలు, పొగాకు ఉత్పత్తులు, గంజాయి లాంటి మత్తు పదార్థాలు బయట పడ్డాయి. వెంటనే చర్యలు తీసుకుంటామని డీఈవో మాట మార్చారు. దీంతో విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిదిలో రోజ్ గోల్ బ్యూటి పార్లర్ పేరుతో భారీ మోసం. పలు ఏరియాల్లో ప్రాంచైజ్ ల పేరుతో ఒక్కోవ్యక్తినుండి 4లక్షల వసూలు.. ప్రగతినగర్ కి చెందిన సుష్మ(35)అనే భాదితురైలి పిర్యాదు మేరకు రోజ్ గోల్ బ్యూటి పార్లర్ ఓనర్స్ ప్రేమకుమారీ(30) అలీయాస్(సమీనా), భర్త ఇస్మాయిల్(40) పై కేసు నమోదు.. మరో 10మంది భాదితులు పోలీస్ స్టేషన్ కి ఇదే కేసులో వచ్చినట్టు సమాచారం.. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిదిలో 35 నుండి 40లక్షలు వసూలు చేసినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు వెల్లడించారు.
సికింద్రాబాద్.. తాజా.. ఉత్తర మండల పరిధిలో ఇద్దరు ఫుట్ పాత్ పై నివసించే యాచకులపై కత్తులతో దాడులు చేసారు. రెండు వేర్వేరు ఘటనలు జరగగా ఓ యాచకుడు దారుణ హత్య కు గురయ్యాడు. మరొక వ్యక్తికి తలకు, మెడ పై తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మోండా మార్కెట్ పి ఎస్ పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో ఫుట్ పాత్ పై పడుకున్న వ్యక్తి పై ముగ్గురు గుర్తుతెలియని దుండగులు విచక్షణ రహితంగా కత్తులతో దాడి చేసారు. మెడను నరికి, తలపై భాగంలో కత్తులతో దుండగులు దాడి చేసారు. మారేడ్ పల్లి పి ఎస్ పరిధి గణేష్ ఆలయ సమీప ఫుట్ పాత్ పై పడుకొని ఉన్న మరో యాచకుడుపై అదే ముగ్గురు గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేసారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ యాచకుడుని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అరగంట వ్యవధిలోనే ఇద్దరు యాచకులపై దాడి.. ఒకరు మృతి.. మరొకరి పరిస్థితి విషమం .. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ముగ్గురు నిందితుల ముఠా కోసం గాలింపు చర్యలు పోలీసులు చేపట్టారు.
అనంతపురం జిల్లా కుందుర్పి మండలం తెనగల్లు గ్రామంలో ఈరోజు సుమారు 12 గంటల ప్రాంతంలో ఇంట్లో షార్ట్ సర్క్యూట్ తో లీక్ అవుతున్నటువంటి గ్యాస్ తో ఇంట్లో ఉన్న రెండు సిలిండర్లు పేలి రెండు ఇల్లులు నేలమట్టం అయ్యాయి. సుమారు 6 మందికి గాయాలు అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు ఫైర్ ఇంజన్ కు ఫోన్ చేయగా సకాలంలో ఫైర్ ఇంజన్ వచ్చి మంటలు ఆపడం జరిగింది. రెండిళ్ల నేలమట్టం కావడంతో ఆస్తి నష్టం జరిగినట్టు బాధితులు చెపుతున్నారు. ఈ సందర్భంగా గాయపడిన వారిని కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించడమైనది. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురంనకు రిఫర్ చేయడం జరిగింది. గ్రామంలో ఈ సంఘటన జరగడంతో ఒక్కసారిగా విషాదఛాయలు అలముకున్నాయి.
కడప జిల్లా ప్రొద్దుటూరులో ఓ బట్టల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా కొఱ్ఱపాడు రోడ్డులోని ఆకృతి షాపింగ్ మాల్ లో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మూడంతస్తుల భవనంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. దాదాపు రెండున్నర గంటలకు పైగా ఫైర్ అధికారులు సిబ్బంది శ్రమించి షాపింగ్ మాల్ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజన్లను మంటలు ఆర్పేందుకు తీసుకొచ్చారు. అయితే లోపల ఎంతవరకు నష్టం జరిగింది, ఎక్కడ షార్ట్ షాట్ క్యూట్ జరిగిందన్న విషయం పై అధికారులు ఆరా తీస్తున్నారు. పూర్తిస్థాయి మంటలు అదుపులోకి తెచ్చి, పొగ ఆగితే తప్ప, నష్టం ఏమిటో తెలిసే పరిస్థితి లేదు. అయితే మంటలు ఆర్పేందుకు వచ్చిన ఫైర్ సిబ్బంది ఒకరు పొగ దాటికి స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే ఆ సిబ్బందిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తర్వాత అగ్నిమాపక అధికారులు సహాయ చర్యల్ని కొనసాగిస్తున్నారు. పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చి పొగ తగ్గితే తప్ప లోపలికి వెళ్లి చూడలేని పరిస్థితి ఉందని పైర్ అధికారులు, చెబుతున్నారు. కోట్ల రూపాయలు విలువైన బట్టలు మంటలలో కాలిపోయాయి, ఆకృతి యాజమాన్యం కన్నీరు మున్నీరు అవుతోంది.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. పట్టణంలోని కృష్ణమానస కాలనీ సమీపంలో గల అద్దంకి-నార్కెట్ పల్లి రహదారిపై ఆదివారం రాత్రి అదుపుతప్పి బోల్తా పడిన కారును గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు సంఘటనాస్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు మిర్యాలగూడ పట్టణ సమీపంలోని నందిపాడు గ్రామానికి చెందిన జ్యోతి (30), మహేష్ (35), మచ్చేందర్ (38), ఇషిక (8), లియాన్స్(2)లు ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.ఈ నెల 26న కారులో ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ సమీపంలోని మోపిదేవి దైవ దర్శనానికి వెళ్లిన వారు ఆదివారం రాత్రి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కర్ణాటక రాష్ట్రం కు చెందిన జ్యోతిక (23) అనే యువతి ని తిరుపతికి చెందిన ధనరాజ్ తో ఏడాది కిందట వివాహం జరిగింది. పెళ్లయినప్పటి నుండి కట్నం పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారు. ధనరాజ్ కుటుంబ సభ్యుల వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. జ్యోతిక కుటుంబీకులు మాత్రం తమ బిడ్డను హత్య చేసినట్లు ఆరోపిస్తున్నారు. తమ బిడ్డ మృతికి కారణమైన వారిపై చర్యలు చేపట్టాలంటూ డిమాండ్ చేస్తూ, ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. బాధితులతో సీఐ మహేశ్వర్ రెడ్డి మాట్లాడి తగిన న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు. జ్యోతిక కుటుంబం ఫిర్యాదు మేరకు ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనకాపల్లి.. నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో ఘోర విషాదం. సెప్టిక్ ట్యాంక్ గొయ్య తవ్వుతుండగా ప్రమాదవశాత్తు ఇసుక మేటల్లో రంగాల జగదీష్ (28) ఇరుక్కుపోయాడు. గ్రామస్తులు జేసీబీ సహయంతో ఇసుక మేటలు తవ్వున్నారు. రెండు గంటలగా సహయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు ఘటనా స్థలాని చేరుకున్నారు. జగదీష్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
కోటబొమ్మాలి ఇండియన్ బ్యాంక్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భీమిలి నియోజకవర్గంలో జరుగుతున్న వైఎస్ఆర్సిపి సిద్ధం సభకు వెళ్తుండగా ఆపశృతి చోటుచేసుకుంది. కోటబొమ్మాలి మండలం కొసాల పురం గ్రామానికి చెందిన ఉప్పాడ లక్ష్మణరావు(48) ప్రైవేట్ బస్సు కండక్టర్గా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా పనిచేస్తున్న బస్సు నుండి కాలుజారి అదే బస్సు చక్రాల కింద పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.