దేవల కుప్పం వద్ద ఉన్న యానాది వాడకు చెందిన పలువురు తమ గొర్రెలను మేత కోసం మంగళ వారం అడవికి తీసుకెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఇంటికి చేరుకున్నాక కొన్ని గొర్రెలు కనిపించలేదు. ఈ క్రమంలో గొర్రెలను వెతకడానికి ముగ్గురు గ్రామస్తులు గంగాధరం, సిద్దప్ప, ఈశ్వరయ్యలు కలిసి అడవి మార్గంలో వెళ్లారు. వెళుతున్న దారిలో కొందరు అడవి జంతువుల కోసం విద్యుత్ వైర్లు లాగారు. ఇది గమనించని యానాదులు చీకటిలో విద్యుత్ ఘాతానికి గురయ్యారు. గంగాధర (20)సంఘటన స్థలంలో మృతి చెందాడు. మూడు నెలల క్రితం ఇతనికి వివాహమైనది. అలాగే అతనిని కాపాడే ప్రయత్నంలో సిద్ధప్ప (30) తీవ్ర గాయాలతో పడిపోయాడు. ఇతనిని సదుం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మరో బాలుడు ఈశ్వరయ్య విద్యుత్ ఘాతం నుంచి తప్పించుకుని బయటపడ్డాడు. గ్రామానికి చెరుకున్న ఈశ్వరయ్య వివరాలను వారి కుటుంబ సభ్యులకి తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహంతో పాటు గాయాల పాలైన సిద్ధప్పను మొదట పెద్ద ఉప్పర పల్లి వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సిద్ధప్పను సదుం వైద్యశాలకు తరలించారు. సంఘటనా స్థలానికి సోమల ఎస్సై వెంకటనరసింహులు చేరుకుని విచారణ చేపట్టారు.
Crime
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం అమరారం గ్రామంలో ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి కొత్తూరు గ్రామం నుండి భార్యా భర్తలైన గోగ్గేల రవీందర్, గొగ్గేల సూర్యకాంతం (23 ) ముగ్గురు పిల్లలతో కలిసి బైక్ పై వెల్లుతుండగా మార్గమధ్యలో తేనేటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. ముగ్గురు పిల్లలు, ఆమె భర్త రవీందర్ సైతం తేనెటీగల దాడిలో గాయపడ్డారు. బైక్ పై నుండి కింద పడడంతో తేనెటీగలు విపరీతంగా కుట్టడంతో గోగ్గల సూర్యకాంతం (23) అనే మహిళ పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యలు పల్స్ రికార్డు కాలేదని, బాడీ మొత్తం విపరీతంగా వాపు కనిపించడంతో మెరుగైన వైద్యం కోసం మణుగూరు 100 పడకల ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మహిళా మృతి చెందింది.
అనకాపల్లి జిల్లా.. గవరపాలెంలో పార్క్ సెంటర్ వద్ద కేబుల్ ఆపరేటర్ ఈ నెల 26న ఓ మహిళ గొంతు నులిమి హత్యాయత్నంకు పాల్పడి గొలుసు ఎత్తుకెళ్లాడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన కొడుకు, కొడుకు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. పోలీసులు దర్యాప్తులో నిందితుడు కేబుల్ ఆపరేటర్ గా గుర్తించి, నిందితుడు కోసం గాలిస్తున్నారు. ఈ సందర్భంగా డిఎస్పి సుబ్బరాజు మాట్లాడుతూ.. గవరపాలెం పార్క్ సెంటర్ వద్ద తమ నివాసం లో ఒంటరిగా ఉంటున్న కర్రీ లక్ష్మీనారాయణమ్మ ఈ నెల 26న రాత్రి 7.30 గంటల సమయంలో తల్లి లక్ష్మీనారాయణమ్మని చూడడానికి వచ్చిన కూతురు, సోపాలో అపస్మార్క స్థితిలో ఉన్న లక్ష్మీనారాయణమ్మను చూసి కంగారుపడి కుమార్తె వెంటనే ఆరోగ్యం బాగోలేదని స్థానిక బెనర్జి హాస్పిటల్ లో జాయిన్ చేసారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వైజాగ్ కేర్ హాస్పిటల్ కు తరలించారు. ఈ విషయం హైదరాబాదులో ఉన్న కొడుకు కర్రి కిషోర్ కి తెలియడం తో హుటా హుటిన బయలుదేరారు. ఆస్పత్రికి వెళ్లి తమ తల్లిని చూసిన కొడుకు అయితే తల్లి చేతికి బంగారు గాజులు ఉన్నాయి కానీ మెడలో గొలుసు లేదని గుర్తించిన కొడుకు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి క్లూస్ టీం ద్వారా అలాగే అన్ని రకాలుగా దర్యాప్తు చేయగా దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. దర్యాప్తులో నిందితుడు కేబుల్ ఆపరేటర్ గా గుర్తించమన్న పోలీసులు నిందితుడు కోసం గలిస్తున్నాం అని తెలియజేశారు.
యానాం.. స్థానిక శ్రీకృష్ణదేవరాయ ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న సాయి అనే ఏడేళ్ల బాలుడు జిఎంసి బాలయోగి క్రీడా మైదానంలోని స్విమ్మింగ్ పూల్ లో పడి విద్యార్థి మృతి చెందాడు. బాలుడు మృతదేహాన్ని యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యానాం ప్రభుత్వ ఆసుపత్రికి యానాం పరిపాలన అధికారి మునుస్వామి, విద్యాశాఖధికారి పంపన లక్ష్మణ ప్రవీణ్ వచ్చి బాలుడు మృతదేహాన్ని పరిశీలించారు. బాలుడి కుటుంబీకులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. యానాం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శవ పరీక్ష గదిలో ఉంచిన మృతదేహానికి చీమలు పట్టడంపై.. బాధితురాలి బంధువులు ఆందోళనకు దిగిన సంఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ బాదితులు రోడ్డు పై బైటాయించి నిరసనకు దిగారు. ఈనెల 29వ తేదీ జమ్మలమడుగు లోని బీసీ కాలనీ లో పదహారేళ్ల బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంతవరకు శవ పరీక్ష నిర్వహించలేదు. పనిచేయని ఫ్రీజర్ లో మృతదేహాన్ని పెట్టడంతో చీమలు పట్టాయి. మంగళవారం బంధువులు వచ్చి మృత దేహాన్ని చూసి ఆవేదనతో ఆసుపత్రి సిబ్బందిని నిలదీశారు. ఆసుపత్రి సిబ్బంది నుంచి నిర్లక్ష్యంగా సమాధానం రావడంతో ఆసుపత్రి ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. పట్టణ ఎస్ఐ సుబ్బారావు సంఘటన స్థలానికి చేరుకుని మృతురాలి బంధువులతో మాట్లాడారు. ఫ్రీజర్ పనిచేయలేదని తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రఫీక్ భాష ను వివరణ కోరగా.. ఫ్రీజర్ తెరిచినప్పుడు లైట్లు వెలగడంతో అది పనిచేస్తుందని అనుకుని శవాన్ని అందులో ఉంచారని చెప్పారు. బాధితులు తనకు ఫిర్యాదు చేశారని.. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
జీడిమెట్ల షాపూర్ నగర్ లో గల బాలానగర్ డీసీపీ ఆఫీస్ ఆవరణలో ఓ బస్సులో మంటలు చెలరేగాయి. ఉన్నట్లుఉండి మంటలు కారణంగా బస్సు పూర్తిగా ద్వంసం అయ్యింది. పక్కనే ఉన్న మరో 2 బస్సులు పాక్షికంగా అగ్నిప్రమాదానికి గురైనట్లుగా అధికారులు చెబుతున్నారు. స్థానికుల సమాచారంతో జీడిమెట్ల ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి 3బస్సుల మంటలను అదుపుచేశారు. ఈ ఘటనలో ఆస్తి నష్టం మాత్రమే సంబవించడం తో స్థానికులు, పార్కింగ్ ఏరియా లో పార్క్ చేసిన వాహనదారులు ఊపిరిపీల్చుకున్నారు.
రావులపాలెం జాతీయ రహదారి డిగ్రీ కాలేజీ ఎదురుగా లారీ రిపేర్ కు రావడం తో లారీ నిలిచిపోగా దానిని డ్రైవర్, క్లీనర్ లారీ కింద ఉండి బాగు చేసుకుంటున్నారు. ఈలోగా రాజమండ్రి వైపు నుండి రావులపాలెం వైపు వస్తున్నా టిప్పర్ లారీ ఆగి ఉన్న లారీ ని ఢీకొట్టడం తో లారీ కింద ఉండి బాగుచేసుకుంటున్న డ్రైవర్, క్లీనర్ లు పైకి లారీ దూసుకెళ్లడం తో ఆక్కడకక్కడే ఇద్దరు మృతి చెందారు. అలాగే టిప్పర్ లారీ కేబిన్ ఆగి ఉన్న లారీ వెనుక భాగం లో ఇరుక్కు పోవడం తో ఇందులో ఉన్న డ్రైవర్, క్లీనర్ లు మధ్య లో ఇరుక్కుపోయారు. విషయం తెలుసుకున్న పోలీస్ లు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 108 అంబులెన్సు సిబ్బంది, హైవే రెస్క్యూ టీం అక్కడికి చేరుకోని సహాయక చర్యలు చేపట్టారు.
కరీంనగర్ జిల్లాలోని కస్తూర్భా కాలేజీలో దారుణం చోటుచేసుకుంది. కొత్తపల్లి మండలం శాంతినగర్ కస్తూర్బా కాలేజీలో, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి అక్షిత ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడింది. దింతో కాలేజీ ప్రిన్సిపాల్ హుటాహుటిన ప్రభుత్వ హాస్పిటల్ తరలించగా అమె అప్పటికే మరణించింది. విషయం తెలుసుకున్నఅక్షిత తల్లిదండ్రులు హాస్పిటల్ కు చేరుకొని ఆందోళన చేపటారు. కాలేజీలో తమ కూతురికి సంరక్షణ కరువడంతోనే ఆత్మహత్య కు పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అక్షిత మృత దేహని మార్చురికి తరలించారు.
హైదరాబాద్.. చౌటుప్పల్ మండలం తంగేడుపల్లి గ్రామానికి చెందిన సిలివెలు శేఖర్(47) అనే వ్యక్తి కి ముక్కు సమస్యతో ఎల్బీనగర్ చింతలకుంట అమృత హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. ముక్కుకు శస్త్ర చికిత్స ఫెయిల్ కావడంతో సీరియస్ గా ఉందని చెప్పి వేరే హాస్పిటల్ కు తీసుకెళ్లాలని ఆసుపత్రి యాజమాన్యం సూచించారు. మలక్ పేట్ యశోద హాస్పటల్ కు తీసుకెళ్ళగా చనిపోయిన బాడీ నీ తీసుకొచ్చారని చెప్పిన యశోద వైద్యులు వెల్లడించారు. డాక్టర్ల నిర్లక్ష్యంతో మృతి చెందిన శేఖర్ మృత దేహం తో ఆసుపత్రి వద్ద చనిపోయిన బాడీని ఇంచారని మృతుడి తమ్ముడు యాదయ్య, బంధువులు హాస్పటల్ ముందు ఆందోళనకు దిగారు.
భద్రాద్రికొత్తగూడెం జిల్లా, చండ్రుగొండ మండల పరిధిలో ఎలుగుబంటి వరుస దాడులతో మండల ప్రజలు బయోందోలునకు గురవుతున్నారు. నిన్న నల్లబొతు రామారావు అనే వ్యక్తిపై ఎలుగుబంటి దాడిచేసిన సంఘటనలో తీవ్ర గాయాలయ్యాయి.. 24 గంటలు గడవకముందే గ్రామ శివారు అంబేద్కర్ కాలనీ ప్రాంతంలో మరో వ్యక్తిని ఎలుగుబంటి తీవ్రంగా గాయపరిచింది. కంచర్ల తిరుపతిరావు అంబేద్కర్ కాలనీ లో తన ఇంటి నుండి బయటకు వస్తుండగా ఎలుగు బంటి ఒకేసారి కంచర్ల తిరుపతిరావుపై దాడి చేసింది. తిరుపతిరావు అరుపులతో చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఎలుగు బంటి ని ఊరు బయటికి తరిమారు.. గాయలతో ఉన్న కంచర్ల తిరుపతిరావును వైద్యం కోసం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.