పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ వద్ద అక్రమంగా బంగారం తరలిస్తున్న పదిమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 6 కేజీల బంగారు ఆభరణాలు 49 వేల నగదును స్వాధీన పరుచుకున్నట్లు భీమవరంలోని టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ రవి ప్రకాష్ వెల్లడించారు. నెల్లూరు జిల్లా గూడూరు నుంచి రాజమండ్రి వెళ్తుండగా మార్గమధ్యలో భీమవరంలో రైలు దిగి రోడ్డు మార్గాన రాజమండ్రి వెళ్తున్న నేపథ్యంలో నిందితులను టౌన్ పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తామని వెల్లడించారు. పట్టుపడ్డ బంగారు ఆభరణాలు విలువ మూడు కోట్ల 84 లక్షల రూపాయలు ఉంటుందని ఎస్పీ తెలిపారు.
Crime
మేడ్చల్ జిల్లా.. పోచారం ఐటి కారిడార్ పోలీస్ స్టేషన్ యంనం పేట వద్ద లారీ అతివేగంతో హర్షిత 20 అనే విద్యార్థి ని డీ కొట్టి కాళ్లపై నుండి దూసుకెళ్లింది. హర్షిత శ్రీనిధి కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతుంది. ఎగ్జామ్ రాసి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కాళ్లు నుజ్జ నుజ్జ కావడంతో శ్రీకర ఆసుపత్రికి తరలించారు. పోలీసులు.. లారీ TS39T3949ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కడప జిల్లా.. పులివెందుల నియోజకవర్గ పరిధిలోని లింగాల మండలం ఇప్పట్ల గ్రామ సమీపంలోని అనాధాశ్రమం వద్ద రోడ్డు పక్కన ఉన్న నీటి బావిలోకి కారు దూసుకెళ్లింది. కారులో మహారాష్ట్రకు చెందిన అరటికాయల వ్యాపారస్తుడు ప్రకాష్ ఠాగూర్, ఢిల్లీకి చెందిన సుశీల్ కేల్వాని లు ఉన్నట్లు సమాచారం.. అనంతపురం జిల్లా నార్పల నుంచి పులివెందులకు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు కారు ను బావిలో నుంచి క్రైన్ ద్వారా బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు.
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన లేట్ రెడ్డప్ప కుమారుడు హేమంత్ మనీ, పురుగుల మందు తాగడంతో గమనించిన కుటుంబీకులు హుటాహుటిన పలమనేరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, అప్పటికే మృతి చెందారని వైద్యులు తెలపడంతో ఆసుపత్రి వద్ద కుటుంబీకులు బోరుమన్నారు, సమాచారం అందుకున్న పోలీసులు విచారిస్తున్నారు వారి దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
నెల్లూరు జిల్లా, సంగం మండలం తలుపురు పాడు గ్రామంలో దారుణ హత్య చోటుచేసుకుంది. ఆన్సర్ భాషా అనే వ్యక్తి బంగారు నగలు కోసం వృద్ధురాలు మస్తాన్ బీని గొంతు నులిమి హత్య చేశాడు. భర్త మస్తాన్ కి మద్యం తాపించి ఈ దారుణాని ఒడిగట్టాడు. తరువాత ఆన్సర్ ఇంట్లోకి వెళ్లి మస్తాన్ బి నిద్రపోతుండగా ముఖం పైన దిండితో నొక్కి అతి దారుణంగా హత్య చేసి ఇందులోని నగలు మొత్తం ఎత్తుకెళ్లిపోయాడు. సాధారణంగా అనుకున్న కుటుంబ సభ్యులు బంధువులు మస్తాన్ బిని దహన సంస్కారాలు చేసేసారు. అయితే భర్త ఫిర్యాదుతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇవాళ అన్సర్ పైన అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆన్సర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వృద్ధురాలిది హత్యగానే నిర్ధారించి విచారణ చేపడుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వీరంపాలెంలో ఈనెల 26వ తేదీన పొలంలో ట్రాన్స్ఫార్మర్ వద్ద ఒక మగశవంను నిప్పు పెట్టి కాలుస్తున్న గుర్తుతెలియని వ్యక్తుల్ని చూసి వారిని వెంబడించిన వెంకటేశ్వర రావును కొట్టి రాజమండ్రి పీడింగొయ్యి పొలాల వద్ద వదలి వెళ్లారని బంధువులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి వెంకటేశ్వరరావును విచారయించగా రెండు నెలలు క్రితం ఎల్ఐసి పాలసీ తీసుకుని ఆక్సిడెంట్ మరణం అయితే 40 లక్షల రూపాయలు వస్తాయని అలోచనతో తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఒక మగ శవాన్ని బొమ్మూరు స్మశానం లో పూడ్చిన శవాన్ని దొంగిలించి కారులో తీసుకుని వచ్చి రంగంపేట మండలం వీరపాలెం గ్రామానికి చెందిన కేతమల్ల గంగరావు పొలంలో ఎలక్ట్రికల్ ట్రాస్ఫార్మర్ దగ్గరకు తీసుకొని వచ్చి నలుగురు కలిసి నిప్పు అంటించినట్టు క్రీయేట్ చేస్తే డబ్బులు వస్తాయని చేశామని పోలీసులు సమక్షంలో నిందితులు తమ చేసిన నేరాన్ని ఒప్పుకున్నట్టుగా DSP కిషోర్ కుమార్ తెలిపారు. వీరి వద్దనుండి 2 సెల్ ఫోన్లు, 1 కార్ స్వాధీనం చేసుకుని అనంతరం నలుగురు ముద్దాయిలని రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపిస్తున్నామని తెలిపారు.
బాపట్ల జిల్లాలోని పురపాలక సంఘ ఉన్నత పాఠశాలలో మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు పాఠశాల వాచ్ మెన్. పాఠశాలలో నూతనంగా నిర్మిస్తున్న భవనం రెండో అంతస్తులో అఘాయిత్యానికి పాల్పడినట్లు తోటి విద్యార్థినులు చెబుతున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి రాజశ్రీ ఫిర్యాదు మేరకు ఫోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు పోలీసులు చేస్తున్నారు.
హైదరాబాద్ హయత్ నగర్ పరిధి భాగ్యలత అయాన్ డిజిటల్ సెంటర్ వద్ద రోడ్డు ప్రమాదం. దిల్ సుఖ్ నగర్ డిపోకి చెందిన RTC బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో ముందున్న 2 ఆటోలు, 6 బైక్లు, 2 కార్లను బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ ఆటోలోని మహిళ తల పగిలి గాయాలయ్యాయి. మరికొందరికి తీవ్రగాయాలవగా వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కాగా బస్సు బ్రేక్ ఫెయిలైందని డ్రైవర్ అరిచాడని స్థానికులు తెలిపారు.
రియాజ్ మాదాపూర్ లో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ లో క్యాబ్ సూపర్ వైసర్ గా పని చేస్తున్నాడు. రెండు నెలల క్రితం రియాజ్ కు ఇర్ఫాన్ కు మధ్య ఉద్యోగం విషయంలో గొడవలు తలెత్తాయి. తన క్యాబ్ లను కంపెనీ విధుల నుంచి తప్పించడంతో పగ పెంచుకున్న ఇర్ఫాన్.. ఈరోజు తెల్లవారు జామున రియాజ్ పై కత్తి తో దాడి చేసాడు. పోలీసులకు స్థానికులు సమాచారం అందజేశారు. గాయపడ్డ వ్యక్తినీ చికిత్స నిమిత్తం మాదాపూర్ మెడికవేర్ హాస్పిటల్ కు తరలించారు.
దేవల కుప్పం వద్ద ఉన్న యానాది వాడకు చెందిన పలువురు తమ గొర్రెలను మేత కోసం మంగళ వారం అడవికి తీసుకెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఇంటికి చేరుకున్నాక కొన్ని గొర్రెలు కనిపించలేదు. ఈ క్రమంలో గొర్రెలను వెతకడానికి ముగ్గురు గ్రామస్తులు గంగాధరం, సిద్దప్ప, ఈశ్వరయ్యలు కలిసి అడవి మార్గంలో వెళ్లారు. వెళుతున్న దారిలో కొందరు అడవి జంతువుల కోసం విద్యుత్ వైర్లు లాగారు. ఇది గమనించని యానాదులు చీకటిలో విద్యుత్ ఘాతానికి గురయ్యారు. గంగాధర (20)సంఘటన స్థలంలో మృతి చెందాడు. మూడు నెలల క్రితం ఇతనికి వివాహమైనది. అలాగే అతనిని కాపాడే ప్రయత్నంలో సిద్ధప్ప (30) తీవ్ర గాయాలతో పడిపోయాడు. ఇతనిని సదుం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మరో బాలుడు ఈశ్వరయ్య విద్యుత్ ఘాతం నుంచి తప్పించుకుని బయటపడ్డాడు. గ్రామానికి చెరుకున్న ఈశ్వరయ్య వివరాలను వారి కుటుంబ సభ్యులకి తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహంతో పాటు గాయాల పాలైన సిద్ధప్పను మొదట పెద్ద ఉప్పర పల్లి వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సిద్ధప్పను సదుం వైద్యశాలకు తరలించారు. సంఘటనా స్థలానికి సోమల ఎస్సై వెంకటనరసింహులు చేరుకుని విచారణ చేపట్టారు.