ప్రకాశం జిల్లా దరిశి పోలీసు స్టేషన్ లో అర్ధరాత్రి సమయంలో షేక్ బాజీ అనే యువకుడు వంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన పై దరిశి డీఎస్పీ అశోక్ వర్ధన్ రెడ్డి వివరాలు వెల్లడించారు కొద్దిరోజుల క్రితం మోటార్ సైకిల్ దొంగతనంలో గస్తీ కాస్తున్న పోలీసులకు ఓ మోటార్ సైకిల్ దొరకడంతో దానిని స్టేషన్లో ఉంచామని షేక్ బాజీ గత అర్ధరాత్రి సమయంలో మద్యం సేవించి స్టేషన్ కు వచ్చి మోటార్ సైకిల్ తన తమ్ముడిదని ఇవ్వాలని కోరగా రేపు ఉదయం పూట రావాలి అని సిబ్బంది తెలిపారు. అనంతరం అక్కడ నుంచి వెళ్లిన షేక్ బాజీ ఒంటిపై పెట్రోల్ పోసుకొని స్టేషన్ లోకి వచ్చి తానే నిప్పంటించుకున్నాడు. అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేసి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఒంగోలు రింకు తరలించి అక్కడి నుంచి గుంటూరు తరలించారు షేక్ బాజీ పలుమార్లు ఇదే తరహాగా స్టేషన్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడని దరిశి డీఎస్పీ వెల్లడించాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Crime
వారం సంతదినం కావడంతో కూరగాయలు, సరుకుల కోసం వచ్చిన గ్రామీణులు తిరుగు ప్రయాణంలో ఆటోలో వెళుతుండగా డీసీఎం వాహనం అతివేగంగా ఢీకొంది. ఇందులో 4 మంది అక్కడికక్కడే దుర్మరణం కాగా బైక్ పై వెళ్తున్న మరొకరికి తీవ్ర గాయాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు స్థానికులు తెలిపారు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని చౌరస్తాలో చోటు చేసుకుంది. సంతదినం కావడంతో అక్కడ చౌరస్తాలో పోలీసు సిబ్బంది కూడా పర్యవేక్షణలో లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు భావిస్తున్నారు. మృతులంతా మండలంలోని మోతి ఘనాపూర్ గ్రామానికి చెందిన వారని స్థానికులు తెలుపుతున్నారు. మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సంఘటనలో చిన్న పిల్లలు సైతం ప్రమాదానికి గురై మృత్యువాత పడడంతో ఈ హృదయ విదారక దృశ్యాలు చూసి స్థానికులు బోరున విలపిస్తున్నారు. డీసీఎం వాహనం హైదరాబాద్ నుండి జడ్చర్ల వైపు వెళుతుండగా చౌరస్తాపై ఆటోను అత్యంత వేగంగా ఢీ కొన్నట్టు స్థానిక ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అదేవిధంగా బైక్ పై మరో వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు కూడా చెబుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఆగ్రహించిన స్థానికులు డీసీఎం అద్దాలు పగల కొట్టి ఆందోళన చేపట్టారు.
సంగారెడ్డి జిల్లా.. పటాన్ చేరు మండలం రుద్రారంలోని గీతం యూనివర్సిటీ లో ఐదవ అంతస్తు నుండి కింద పడి రేణు శ్రీ (18) అనే బిటెక్ విద్యార్థిని మృతి చెందింది. యూనివర్సిటీలో జాయిన్ అయ్యి మూడు నెలల్లోనే విద్యార్థిని ఆత్మ హత్య చేసుకోడానికి కారణాలు తెలియల్సివుంది. మాధాపూర్ లో నివాసం వుంటున్న తల్లిదండ్రులు, విషయం తెలుసుకొని ఆసుపత్రికి చేరుకుని కన్నీళ్ళమయం అయ్యారు. మృతదేహాన్ని పటాన్ చేరు ఏరియా ఆసుపత్రికి పోస్ట్ మార్టం కోసం తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన పిర్యాదు పై పోలీసులు కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం నర్సింగ పేట ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న 7వ తరగతి విద్యార్థిని మృతి చెందింది. అర్ధ రాత్రి సమయంలో కడుపులో నొప్పి వస్తుంది అని హుటాహుటిన హాస్టల్ నుండి కూనవరం ప్రభుత్వ ఆసుపత్రికి స్కూల్ సిబ్బంది తరలించారు. కూనవరం ఆసుపత్రి వైద్యులు వెంటనే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించమని చెప్పారు. వెంటనే ఆ అమ్మాయిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో 7వ తరగతి చదువుతున్న మడకం సంధ్య మృతి చెందింది. నా కూతురి మృతికి పాఠశాల సిబ్బందే కారణమంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆశ్రమ పాఠశాల ముందు మృతదేహంతో తల్లిదండ్రులు, బంధువులు ధర్నా నిర్వహిస్తున్నారు.
అతివేగం యువకుని ప్రాణాలను బలిగొంది. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఎస్సై మాహేశ్వర్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సంకెపల్లి గూడ గ్రామానికి చెందిన మల్లే రాఘవేందర్ గౌడ్(21) గురువారం రాత్రి 11 గంటల సమయంలో నాగరగూడా నుండి స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై వస్తున్నాడు. మార్గమధ్యంలో గ్రామ సమీపంలోని భారత్ గ్యాస్ గోదాం వద్ద బైక్ అతివేగం గా నడపటం వల్లన అదుపుతప్పి డివైడర్ ను ఢీకొంది. ప్రమాదంలో ఛాతీ భాగంపై బలమైన గాయాలు తగలడం వల్లన ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే షాద్నగర్ లోని ఏబీపీ హాస్పిటల్ కి తరలించగా అక్కడ వారు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోవాల్సిందిగా కోరారు. షాద్నగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందినట్లు ప్రభుత్వ డాక్టర్లు తెలిపారు. యువకుడు చనిపోవడానికి కారణం ఛాతీ పైన బలంగా డివైడర్ తగలడం తో చనిపోయినట్లు తెలుస్తోంది. తండ్రి శ్రీశైలం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలో తప్పిన పెనుప్రమాదం.. సత్తుపల్లి డిపోకు చెందిన ఆర్టీసి బస్సు, కూలీల ఆటో ఎదురెదురుగా ఢీ కున్నాయి. ఆటో లో ప్రయాణిస్తున్న పది మందికి తీవ్ర గాయాలు కావటంతో అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా చాట్రాయి మండలం నుండి కూలీ కోసం తుంబూరు వస్తున్న 25 మంది కూలీలతో ప్రయాణిస్తున్న ఆటో, ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీ కొనటంతో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటో లో 25 మంది కూలీలు, ఆర్టీసీ బస్సులో సత్తుపల్లి కాలేజ్ కు వేళ్ళే విధ్యార్ధులు ఉన్నారు. కూలీలకు గాయాలతో బయటపడటంతో పెనుప్రమాదం తప్పింది.
Read Also..
ఎల్బీనగర్, రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు మృతి. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌరెల్లి రోడ్డు వద్ద పాపన్న గూడ చౌరస్తాలో టిప్పర్ లారీ బైక్ ఢీ కొని కుత్బుల్లాపూర్ కి చెందిన తండ్రి కొడుకులు మృతి. నాగోల్ పీఎస్ పరిధి కుత్బుల్లాపూర్ కి చెందిన కుతాడి కుమార్ (40) , 7వ తరగతి చదువుతున్న కొడుకు కుతాడి ప్రదీప్ (13) టిప్పర్ ఢీకొని తండ్రి కొడుకులు ఇద్దరు మృతి. పరారీ లో టిప్పర్ డ్రైవర్. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న నాగోల్ పోలీసులు.
ఎన్టీఆర్ జిల్లా, జగ్గయ్యపేట మండలం, జాతీయ రహదారి 65 మీద గరికపాడు చెక్ పోస్ట్ వద్ద 69 లక్షల 98వేలు నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు. పోలీసులు సాధారణ తనిఖీల్లో భాగంగా వాహనాలను తనిఖీ చేస్తుండగా మిర్యాలగూడ వైపు నుండి బస్ లో విజయవాడ వైపుకు వెళ్తున్న గుడ్లవల్లేరుకు చెందిన ఇద్దరు వ్యక్తులను తనిఖీ చేయగా వారి వద్ద నుండి భారీ మొత్తంలో నగదు స్వాధీనం. ఎటువంటి ఆధారాలు లేని నగదుగా గుర్తించి కేసు నమోదు చేసిన చిల్లకల్లు పి.ఎస్ సబ్-ఇన్స్పెక్టర్ కృష్ణబాబు.
అనంతపురం జిల్లా గుత్తి మండలంలో కీచక యోగా టీచర్ ను గురువారం గుత్తి పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పి నర్సింగప్ప వెల్లడించారు. డిఎస్పీ మాట్లాడుతూ…. గుత్తి మండలం తొండపాడు గ్రామంలోని జడ్పీహెచ్ స్కూల్ నందు ఔట్ సోర్సింగ్ పై యోగా టీచర్ గా పని చేస్తున్న అనిల్ కుమార్ రెడ్డి అదే స్కూల్లో చదివే ఓ మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి నమ్మించి బాలిక ఇంటిలోని బంగారు నగలు తెప్పించుకుని పెళ్లి చేసుకుంటానని చెప్పి వెంట తీసుకొని పోయి శారీరకంగా అనుభవించి తిరిగి గుత్తికి తీసుకొచ్చి వదిలేసి తనకు బంగారం ఇచ్చినట్లు గాని, శారీరకంగా కలిసినట్లు గాని, ప్రేమ విషయం గానీ, ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. ఇతనిపై గతంలో 2019వ సంవత్సరంలో ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో కూడా రేప్ కేసులో నిందితుడు నిందితుడిగా ఉంటూ ఆ కేసులో కోర్టు వాయిదాలకు హాజరవుతున్నాడు. అయితే గత నెల 25 నుంచి బాలిక కనపడకపోవడంతో తల్లిదండ్రులు గుత్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టి అనుమానంతో పాఠశాలలో పనిచేసే యోగా టీచర్ అనిల్ కుమార్ రెడ్డిని విచారణ చేయగా ఈ భాగోతం బయటపడింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు యోగా టీచర్ అనిల్ కుమార్ రెడ్డిపై IPC 366, 344, 376,406,మరియు ఫోక్సో ఆక్ట్ 5,6 సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు. అతని వద్ద నుంచి ఒక సెల్ ఫోను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు. అనంతరం ముద్దాయిని కోర్టుకు హాజరు పరిచి రిమాండ్ కు తరలించడం జరిగిందన్నారు.
భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో దారుణం జరిగింది. గ్రామస్తుల కథనం మేరకు కంచరకుంట్ల రాజు (40) అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం మతిస్థిమితం కోల్పోయి కొంచెం పిచ్చి పిచ్చిగా ప్రవర్తించే వాడు. గురువారం అర్ధరాత్రి ఒంటిగంట సమీపాన మతి స్థిమితం కోల్పోయి కన్నతల్లిని గొడ్డలితో విచక్షణా రహితంగా నరికి చంపాడు. దీంతో పక్కింట్లో ఉండే మహిళ అడ్డుపడ గా మహిళ తల పై గొడ్డలితో నరకడంతో చుట్టుపక్కల వారు కొన ఊపిరితో ఉన్న మహిళను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. నిందితుడు రాజు స్థానికుల నుండి తప్పించుకొని గొడ్డలితో ఊరందరిని చంపేస్తా అంటూ పారిపోయి ఒంటరిగా ఉన్న వారి పై దాడి చేయడానికి ప్రయత్నిస్తూ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగి రాజు కోసం గ్రామంలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఒంటరిగా ఎవరు బయటకు రావద్దని గ్రామస్తులను పోలీసులు హెచ్చరించారు. దీంతో తిరుమలగిరి గ్రామం ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై, విషాదఛాయలు అలుముకున్నాయి.