భార్యతో కలిసి కన్న తల్లిని హత్య చేసిన దుర్మార్గుడు. బంధువులకు అనుమానం రావడంతో బయటపడిన విషయం. ఆస్తి అమ్మడానికి అడ్డు వస్తుందని కన్నతల్లినే భార్యతో కలిసి మట్టు పెట్టాడు ఓ కిరాతకుడు. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ వెంకట్ రెడ్డి నగర్ లో ఆలస్యంగా వెలుగు చూసింది.
వెంకట్ రెడ్డి నగర్ ప్రాంతానికి చెందిన కసావేణి సుగుణమ్మ భర్త కొన్నాళ్ల క్రితం చనిపోయాడు ఆమెకు కుమారుడు అనిల్ ,కోడలు తిరుమల ఉన్నారు
వీరి ఇద్దరు పిల్లలు హాస్టల్లో చదువుకుంటున్నారు, భర్త చనిపోయిన తర్వాత ఇంటిని సుగుణమ్మ తన పేరు మీదకు మార్చుకుంది కొడుకు జులాయి గా తిరగడంతో అప్పులు పెరిగాయి, అప్పులు తీర్చేందుకు ఇల్లు అమ్మాలని కొడుకు, కోడలు కొంతకాలంగా సుగుణమ్మ పై ఒత్తిడి చేస్తున్నారు అయితే సుగుణమ్మ ససేమీరా అనడంతో కోడలుతిరుమల పుట్టింటికి వెళ్ళింది ఇల్లు అమ్మాలంటే ఎలాగైనా తల్లి అడ్డు తొలగించుకోవాలని అనిల్ నిర్ణయించుకున్నాడు ఈ నెల నాలుగవ తేదీ అర్ధరాత్రి తిరుమల మరో వ్యక్తి శివతో కలిసి వెంకటరెడ్డి నగర్ వచ్చింది అదే రాత్రి సుగుణమ్మ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు, అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రలో ఉన్న సుగుణమ్మ ముఖంపై దిండు అదిమి గొంతు చుట్టి హత్య చేశారు అమ్మ నిద్రలోనే చనిపోయిందని అనిల్ బంధువులతో బుకాయించారు. మృతదేహంపై గాయాలు ఉండడంతో బయటపడ్డ అసలు నిజం. మరణ వార్త విని సుగుణమ్మ తల్లి దాసరి ఐలమ్మ సహా బంధువులు వరంగల్ ప్రాంతం నుంచి భారీగా తరలివచ్చారు 5వ తేదీన అంత్యక్రియలకు సన్న హాలు చేశారు సుగుణమ్మ మృతదేహానికి స్నానం చేయిస్తుండగా మెడమీద గాయాలు కనిపించాయి దీంతో అనుమానం వచ్చి బంధువులు అనీలు నిలదీయగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు దీంతో పోలీసులు కొడుకు, కోడలిని అదుపులోకి తీసుకొని విచారించడంతో విషయం బయటపడింది. ఆస్తి కోసం అమ్మను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుని భార్య ఆమెతో వచ్చిన శివతో కలిసి హత్య చేసినట్లు అనిల్ పోలీసులకు తెలిపాడు దీంతో ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.
Crime
నెల్లూరు జిల్లా, గుడ్లూరు (మం) మాచర్ల వద్ద జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం. లారీని ఢీ కొట్టిన TSRTC బస్సు ఒకరు మృతి, 7గురి పరిస్థితి విషమం. మృతి చెందిన వ్యక్తి బస్ డ్రైవర్ వినోద్ గా గుర్తింపు. మిర్యాలగూడ నుండి తిరుపతి వెళ్తున్న TSRTC బస్సు. క్షతగాత్రులను కావలి ఏరియా వైద్యశాల లో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలింపు. ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్న పోలీసులు.
పుద్దిచ్చేరి యానాం దరియాలతిప్ప వద్ద మత్స్యకార బోట్లు దగ్ధమయ్యాయి ఒక వ్యక్తి సజీవ దహనమయ్యాడు. బైరవపాలెంకు చెందిన మత్స్యకార బోట్ కు దరియాలతిప్ప వద్ద వెల్డింగ్ పనులు చేస్తుండగా నిప్పు రవ్వలు ఎగిసిపడి ప్రమాదం జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో కామాడి గంగాద్రి అనే బోట్ యజమాని సజీవదహనం అయ్యాడు. మరో ఇద్దరు సురక్షింతగా బయట పడ్డారు. బోట్ రిపేర్ కావడంతో దరియాలతిప్ప వద్ద రిపేర్ చేసుకోవడానికి వచ్చినట్లు యానాం పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు అగ్నిమాపక సిబ్బంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also..
Read Also..
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ లో ఘోర ప్రమాదం జరిగింది. బాలానగర్ కూడలి వద్ద వేగంగా వస్తున్న డీసీఎం ఆటో, బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మృతులు మోతీ ఘనాపూర్ వాసులుగా గుర్తించారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఓ చిన్నారి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి శుక్రవారం సంత బాలానగర్ సెంటర్ లో నిర్వహిస్తారు. దీని కోసం చుట్టుపక్కల గ్రామాలు, తండాల నుంచి ప్రజలు వస్తుంటారు. అయితే సంతకు వచ్చిన కొందరు సరుకులు కొనుగోలు చేసి ఆటోలో తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి వస్తున్న డీసీఎం ఆటో, బైకును ఢీకొట్టింది. అయితే అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
పూణేకు చెందిన ఓ గ్యాంగ్‌స్టర్ సొంత గ్యాంగ్ చేతిలో కాల్చివేతకు గురయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 8 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి మూడుపిస్తోళ్లు, మూడు మ్యాగజైన్లు, ఐదు రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిన్న మధ్యాహ్నం 1.30 సమయంలో సుతార్దారా ప్రాంతంలో గ్యాంగ్‌స్టర్ మొహొల్ (40)పై నలుగురు దుండగులు పాయింట్ రేంజ్లో కాల్పులు జరిపారు. ఒక బుల్లెట్ అతడి చాతీని చీల్చేయగా, మరో రెండు అతడి కుడిభుజంలోకి చొచ్చుకెళ్లాయి. కోత్రుద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మొహొల్ చికిత్స పొందుతూ మరణించినట్టు పోలీసులు తెలిపారు. మొహొల్పై పలు హత్య, దోపిడీ కేసులు ఉన్నాయి. ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన అనుమానిత ఉగ్రవాది మొహమ్మద్ ఖతీల్ సిద్ధిఖీని యరవాడ జైలులో హత్యచేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ నిర్దోషిగా బయటపడ్డాడు. కాగా,మొహుల్ హత్యకు భూ తగాదాల తో పాటు డబ్బులు సంబంధించిన గొడవే కారణమని పోలీసులు తెలిపారు. ఇది గ్యాంగ్‌వార్ కాదని, సొంత గ్యాంగ్ చేతిలోనే మొహొల్ హత్యకు గురయ్యాడని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు.
పల్నాడు జిల్లా.. సత్తెనపల్లి గొల్లమూడివారి వీధిలో వివాహిత డాబా మీద నుండి దూకి ఆత్మహత్యకి పాల్పడింది. మృతురాలు సంతోషి లక్ష్మి (40) నిన్న రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్యకు కారణం కుటుంబ కలహాలని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలో విషాదం నెలకొంది. గుర్తుతెలియని వాహనం ఢీకొని జహీర్ అనే వ్యక్తి మృతి చెందాడు. జహీర్ గ్రామంలోని సొసైటీలో క్రాప్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. పని నిమిత్తం కందుకూరు వెళ్లి బైక్ పై రాత్రి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి అక్కడికక్కడే చనిపోయాడు. రాత్రి 10 గంటల తర్వాత కూడా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు జహీర్ కు ఫోన్ చేసిన స్పందించలేదు. వేంసూరు మండలం కందుకూరు గ్రామ శివారు రోడ్డు ప్రమాదానికి గురై జహీర్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో జహీర్ కుటుంబంలో, తుంబురు గ్రామంలో విషాదం నెలకొంది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో రోడ్డుపై వడ్లు ఆరబోసి ఉండటం తో వాటిని తప్పించే క్రమం లో ఎదురుగా వచ్చిన వాహనం జహీర్ ప్రయాణిస్తున్న బైక్ ను ఢీ కొట్టి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వేంసూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Also..
అమరావతి, గుంటూరు – విజయవాడ వారధిపై హిట్ అండ్ రన్. స్కూటీ పై వెళ్తున్న మహిళలను ఢీ కొట్టిన గుర్తు తెలియని వాహనం. గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ప్రమాదంలో ఇద్దరు మహిళలు స్పాట్ డెడ్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కృష్ణ లంక పోలీసులు. గుంటూరు జిల్లా నంబూరుకు చెందిన మహిళలుగా గుర్తింపు. మృత దేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన పోలీసులు. గుంటూరు నుండి విజయవాడ వస్తుండగా ప్రమాదం. ఢీ కొట్టిన వాహనం కోసం సీసి కెమెరాలను జల్లెడ పడుతున్న పోలీసులు.
కృష్ణాజిల్లా మచిలీపట్నం, స్థానిక రాజుపేటలో శుక్రవారం పట్టపగలు భారీ చోరీ జరిగింది. రూ.5 లక్షలతో పాటు 100 కాసుల బంగారం అపహరణకు గురైంది. ఇనగుదురుపేట పోలీసు స్టేషన్ పరిధిలో రాజుపేటకు చెందిన ధాన్యం, బియ్యం వ్యాపారి పద్మనాభుని చిననాగేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం ఇంటికి తాళాలు వేసి విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు, తిరిగి రాత్రి ఇంటికి వచ్చి చూడగా, ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. ఇంట్లోని బీరువా పగులగొట్టినట్టు ఉండటంతో చిననాగేశ్వరరావు పోలీసులకు సమాచారం ఇచ్చారు. శుభకార్యం ఉండటంతో బ్యాంక్ లాకరులో ఉన్న నగలను ఇటీవలే ఇంటికి తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. ఘటనా స్థలాన్ని ఇనగుదురుపేట సీఐ ఉమామహేశ్వరరావు, పోలీస్ సిబ్బంది పరిశీలించారు. ఎంతమేర నగలు, నగదు దొంగతనం జరిగిందనే అంశంపై వివరాలు సేకరిస్తున్నామని, వేలిముద్రలు సేకరిస్తున్నామని సీఐ తెలిపారు.
Read Also..
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో విషాదకర ఘటన జరిగింది. ప్యాసింజర్ రైలులో మంటలు చెలరేగి ఐదుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. జెస్సోర్ నుంచి రాజధాని ఢాకాకు చేరుకున్న బెనాపోల్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. కనీసం నాలుగు కోచ్‌లకు మంటలు వ్యాపించాయని అగ్నిమాపక అధికారి రకీబుల్ హసన్ వెల్లడించారు. ఐదురుగురు చనిపోయారని, వారి మృతదేహాలను గుర్తించామని పోలీసు కమాండర్ అల్ మోయిన్ మీడియాకు తెలిపారు. ఢాకా లోని ప్రధాన రైల్వే టెర్మినల్ గోపీ బాగ్ వద్ద రైలులో మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వందలాది మంది పరిగెత్తుకొచ్చి మంటల్లో కాలిపోతున్న ట్రైన్ నుంచి చాలా మంది ప్రయాణికులను బయటకు లాగారని వెల్లడించారు. మంటలు చాలా త్వరగా వ్యాపించాయని వివరించారు. కాగా ఈ రైలులో కొందరు భారతీయులు కూడా ఉన్నట్టు స్థానిక మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. జాతీయ ఎన్నికలను బహిష్కరించాలంటూ ప్రతిపక్షాలు నిరసనలు తెలుపుతున్న సమయంలో జరిగిన ఈ ఘటనలో కుట్రకోణంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా నిప్పు పెట్టి ఉంటారా అనే కోణంలో సందేహిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదాన్ని విధ్వంస దాడిగా భావిస్తున్నామని పోలీసు చీఫ్ అన్వర్ హొస్సేన్ అన్నారు. గత నెలలో కూడా బంగ్లాదేశ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. రైలులో మంటలు చెలరేగి నలుగురు వ్యక్తులు చనిపోయారు. ఈ ఘటనకు ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) కారణమని పోలీసులు, ప్రభుత్వ నేతలు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను బీఎన్బీ తీవ్రంగా వ్యతిరేకించింది. కాగా బంగ్లాదేశ్‌లో ఆదివారం జాతీయ ఎన్నికలు జరగనున్నాయి. అయితే బీఎన్పీ సహా ఇతర పార్టీలు ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటించాయి. ప్రధాన మంత్రి షేక్ హసీనా రాజీనామా చేయాలని విపక్షాలు చాలా కాలంగా నిరసనలు తెలుపుతున్నాయి. ఈ క్రమంలో గతేడాది చివరిలో వేలాది మంది ప్రతిపక్షాల కార్యకర్తలను ప్రభుత్వం అరెస్ట్ చేయించింది.