మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం నాగ్సన్ పల్లి గ్రామ శివారులోని 93 సర్వే నంబర్ లో గల 20 ఎకరాల అటవీ భూమి ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం వల్లే కబ్జాకు గురైందని గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామస్తులు ఆరోపించారు. 30 కోట్ల విలువ గల అటవీ భూమి కబ్జా చేపడుతున్నారని కబ్జా చేపట్టిన స్థలంలోని చెట్లు నరికి అటవీలోని కాలువలో మట్టితో కప్పెడుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో అటవీ భూమి కబ్జాకు గురవుతున్న ఫారెస్ట్ అధికారులు పట్టించుకోక పోగా దురుసుగా మాట్లాడుతున్నారంటూ సర్పంచ్, ఉప సర్పంచ్ ఆరోపిస్తున్నారు. అటవీ భూమికి ఆనుకొని ఉన్న బంజారా లక్ష్మీ పౌల్ట్రీ యజమానులు ఈ కబ్జా చేపడుతున్నారంటూ కబ్జా జరుగుతున్న విషయం తెలిసి కూడా ఫారెస్ట్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఫారెస్ట్ ఉన్నతాధికారి DFO కు ఫిర్యాదు చేసినట్లు గ్రామ సర్పంచ్ తెలిపారు. DFO మాట్లాడుతూ గతంలో జైంట్ సర్వే నిర్వహించామని, 144 ఎకరాల ఫారెస్ట్ భూమిని సర్వే చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని, చెట్లు నరికినందుకుగాను వాల్టా అటవీ చట్టం ప్రకారం కేసులు చేపడతామంటూ కబ్జాకు గురి అయిన హద్దురాలను తొలగియ్యనున్నట్లు సూచించారు ఫారెస్ట్ అధికారి DFO.
Crime
అయినవిల్లి మండలం తొత్తరమూడి పెదపాలెం వద్ద సీఐ ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో భారీగా యానాం అక్రమ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పి.గన్నవరం మండలానికి చెందిన వాసంశెట్టి శ్రీనివాస్ గత కొన్నేళ్ళుగా యానాం మద్యం షాపులో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి గుంటూరుకు చెందిన ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. గత ఆరు నెలల నుంచి యానాం నుండి అక్రమంగా మద్యం తరలించి గుంటూరు పంపేవాడని, సోమవారం తెల్లవారు జామున తొత్తరమూడి పెదపాలెం వద్ద అయినవిల్లి ఎస్ఐ సురేష్ బాబు తన సిబ్బందితో వాహనాల తనిఖీ చేపట్టారు. తనిఖీ లలో వాసంశెట్టి శ్రీనివాస్ అనే వ్యక్తి కారులో అక్రమ మద్యం తరలిస్తుండగా పట్టుకొని అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ.1.35 లక్షలు విలువ చేసే అక్రమ మద్యంను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ప్రశాంత్ కుమార్ మీడియా సమావేశంలో తెలిపారు. యానాంకు చెందిన మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకొని, స్విప్ట్ కారును సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు.
తిమ్మాపూర్ మండలం, ఎల్ఎండి కాలనీలో గల నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఆదివారం దొంగలు పడ్డారు ఎస్సై చేరాలు కథనం మేరకు ఎల్ఎండి కాలనీలో గల నీటిపారుదల శాఖ ప్రభుత్వ కార్యాలయం ఆదివారం కావడంతో సాయంత్రం ఆఫీసుకు ఉన్న బేడాలను పగలగొట్టి సుమారు 5 కంప్యూటర్లతో పాటు వైఫై కనెక్టింగ్ డేటా, వివిధ సామాగ్రిని దొంగలించినట్లు తెలిపారు. సుమారు 2.5 లక్షల విలువ గల సామాగ్రి చోరీకి గురైనట్లు పేర్కొన్నరు. ఈ విషయమై కార్యాలయ సూపరిండెంట్ అంజిరెడ్డి సమాచారం అందించడంతో ఎస్సై చేరాలు కార్యాలయానికి చేరుకొని సిబ్బందితో కలిసి కార్యాలయంలో దొంగిలించిన కంప్యూటర్లు వివిధ సామాగ్రి తో పాటు ఇంకా ఏమి దొంగతనానికి గురయ్యాయని పరిశీలించారు అక్కడే ఉన్న అధికారులను సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా అని ఆరా తీశారు కొంతకాలంగా పనిచేయకపోవడం లేదని చెప్పారు. దొంగతనానికి గురైన కంప్యూటర్లలో ప్రాజెక్టు కు సంబంధించిన డేటా తో పాటు క్యాంపు క్వార్టర్లు అటెండర్లు వివిధ డెవలప్మెంట్ కు సంబంధించిన డేటా కంప్యూటర్ లో భద్రపరుస్తామని ఆ కంప్యూటర్ లు మాత్రమే చోరీకి గురయ్యాయని అలాగే బీరువా ను పగలగొట్టి వివిధ ఫైళ్లు కూడా చోరీ చేసారు అని వెల్లడించారు. వెంటనే క్లూస్ టీం కు సమాచారం అందించడంతో సోమవారం వేలిముద్రలు సేకరించినట్లు తెలిపారు. అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
అల్లూరి జిల్లా, వి.ఆర్.పురం మండలం వీరపవనకుంటా గ్రామంలో దారుణం. అనుమానంతో భార్య పీక కోసి హత్య చేసిన భర్త సోయం చిరంజీవి. గొల్లగూడెం గ్రామంలో అంగన్వాడీ టీచర్ గా విధులు నిర్వహిస్తున్న మృతురాలు సోయం రాధ ( 32 ). అనాధాలుగా మిగిలిన నలుగురు ఆడపిల్లలు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సమాచారంతో హుటాహుటిన ఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
కృష్ణాజిల్లా, అవనిగడ్డ నాగాయలంక మండలం పెద్ద పాలెం గ్రామంలో దారుణం. తన కూతురు వెంట పడుతున్నాడని షేక్ హుస్సేన్ షరీఫ్ అనే వ్యక్తిపై కత్తులతో దాడి చేసిన యువతి యొక్క తండ్రి,, తమ్ముడు. షేక్ హుస్సేన్ షరీఫ్ కు తీవ్ర గాయాలు అవటంతో 108 వాహనంలో అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. హుస్సేన్ షరీఫ్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి కి రిఫర్ చేసిన వైద్యులు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నాగాయలంక పోలీసులు.
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఒంటెడుదిన్నె గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో నివాసం ఉంటున్నా గణపతి అనే వ్యక్తి తనకుమారుడు ఉరుకుందు ను తీసుకోని గ్రామం శివారులో ఉన్న ఓ పాడుబడ్డ బావిలో చేపలు పట్టేందుకు వెళ్లారు. చేపలు పడుతుండగా ఒక్కసారి గణపతికు ఫిట్స్ రావడంతో కాలు జారీ వెంటనే బావిలో పడ్డాడు. ఇది గమంచిన కుమారుడు ఉరుకుందు వెంటనే ఊరులోకి వెళ్లి గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. అయితే అప్పటికే బావిలో పడ్డ గణపతి ఊపిరి ఆడక బావి లోపల ఉన్న పూడూలో ఇరుక్కు పోయాడు. అయితే బావి లోతు ఎక్కువ ఉండి, లోపల పూడూ ఉండటంతో మృతదేహం బయటికి తీసేందుకు వీలు కాలేదు. సమాచారం అందుకున్న ఫైర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గణపతి మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Read Also..
నిర్మాణంలో ఉన్న చర్చి భవనం కుప్పకూలిన ఘటన సంగారెడ్డిలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు సహాయక కార్యక్రమాలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని క్షేమంగా బయటకు తీసేందుకు వారంతా శ్రమిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ లో ఈ ప్రమాదం జరిగింది. నిర్మాణ పనులు జరుగుతుండగా చర్చి స్లాబ్ సడెన్ గా కుప్పకూలింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ నిర్మాణ కూలీలు నలుగురు చనిపోయారు. మరో నలుగురు కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Read Also..
Read Also..
నెల్లూరు జిల్లా, ఉదయగిరి బెల్ట్ దుకాణాలపై పోలీసులు దాడులు. ఉదయగిరి పట్టణంలోని గండిపాలెం మార్గం వైపు ఉన్న పెట్రోల్ బంక్ ఎదురుగా అనుమతి లేకుండా బెల్ట్ దుకాణాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 51 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ఇంద్రసేనా రెడ్డి తెలిపారు. మద్యం విక్రయిస్తున్న ఇద్దరు మహిళలు కూడా అదుపులో తీసుకున్నారు.