కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమను నిరాకరించిందన్న కారణంతో ఓ ప్రేమోన్మాది యువతి గొంతు కోసేందుకు ప్రయత్నించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బొద్దుల సాయి అనే యువకుడు కొత్తపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నానంటూ గత కొంతకాలంగా వెంటపడుతున్నాడు. ఈ క్రమంలో ఇవాళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిందితుడు యువతిపై కత్తితో దాడి చేశాడు. ఆమె మెడపై తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలు కేకలు వేయడంతో గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అప్పటికే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. యువతిని వెంటనే కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న ఏసీపీ కరుణాకర్ రావు ఆమె చికిత్స తీసుకుంటున్న ఆస్పత్రికి వచ్చి స్టేట్మెంట్ రికార్డు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
Crime
జాతీయ రహదారి చంద్రశేఖరపురం వద్ద రోడ్డు ప్రమాదo లో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కారు. లారీని వెనుక వైపు నుంచి వేగంగా ఢీకొన్న ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కారు. కార్ నెంబర్ ఏపీ 39 EB2468. ప్రమాదంలో ఎమ్మెల్సీ పిఏ వెంకటేశ్వర్లు మృతి. ప్రమాదంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కి డ్రైవర్ కు తీవ్ర గాయాలు. మరో వాహనంలో అపోలో ఆస్పత్రికి తరలించిన స్థానికులు.
భర్త చనిపోయాడని కనికరిచించల్సింది పోయి మరిది, అత్త దారుణంగా చావా బాధారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన పోలీసులను ఆశ్రయించిన ఫలితం లేకపోవడంతో చివరకి మీడియాను ఆశ్రయించింది. బాధితురాలు ఫతేనగర్లోని పార్థివ బస్తీలో గత కొంత కాలం క్రితం భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉన్న మహిళ (వదిన) అని చూడకుండా మరిది (విశాల్) శారీరకంగా లోబరుచుకుందామని పలుమార్లు ప్రయత్నించినప్పటికీ వదిన ససేమీర అనడంతో కక్ష పెంచుకొని తమ తల్లి అయిన అత్తతో తరచూ గొడవ చేయించేవాడు. కొత్త సంవత్సరం మద్యం సేవించి అత్త మరిది ఇద్దరు కలిసి కోడలిని చావబాదారు. అది చూసిన ఇరుగు పొరుగువారు పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి ఫిర్యాదు చేయించిన ఫలితం లేకపోవడంతో మీడియాను ఆశ్రయించిన బస్తి వాసులు అందరూ ఏకం అయి ఒంటరిగా మిగిలిన మహిళకు న్యాయం చేయాలని కోరారు.
సత్తుపల్లి పట్టణం కాకర్లపల్లి రోడ్ లో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ కొట్టుకున్నాయి. ప్రమాదంలో ఇద్దరు బైకిస్ట్ లు గాయపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి గ్రామానికి చెందిన నాగళ్ళ దుర్గాప్రసాద్ అనే వ్యక్తి బైక్ పై సత్తుపల్లి వైపు వస్తుండగా రుద్రాక్ష పల్లి గ్రామానికి చెందిన పంతంగి నాగేశ్వరరావు సత్తుపల్లి వైపు నుండి స్వగ్రామానికి వెళుతుండగా పట్టణ శివార్లలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో నాగళ్ళ దుర్గాప్రసాద్ తీవ్రంగా గాయపడటంతో సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం హుటాహుటిన ఖమ్మం తరలించారు.
కాకినాడ రేచర్ల పేట రైల్వే ట్రాక్ సమీపంలో ఐరన్ స్క్రాప్ దుకాణంలో వైర్ల నుండి కాపర్ తీస్తున్న క్రమంలో ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున ఎగిసి పడ్డాయి. అది గమనించిన అక్కడున్న స్థానికులు స్థానిక పోలీస్ స్టేషన్ కు, అగ్నిమాపక సిబ్బందికు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని అక్కడున్న స్థానిక యువత మరియు పోలీస్ సిబ్బంది వారి సహాయంతో మూడు ఫైర్ ఇంజన్ వాటర్ ఉపయోగించినా కూడా మంటలు అదుపులోకి రాని పరిస్థితి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ ఆస్తి నష్టం తెలియాల్సి ఉంది. నివాసాలు ఉంటున్న ఇళ్ల మధ్యలో ఇటువంటి స్క్రాబ్ దుకాణాలు పెట్టి వారు వ్యాపార లావాదేవీల కోసం వైర్లు కాల్చడం వల్లే ఇటువంటి ఘటనకు పాల్పడ్డాయని అక్కడున్న స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి దుకాణాలు నివాసాల మధ్యలో పెట్టి మా ప్రాణాలతో చెలగాటం ఆడకుండా ఇప్పటికైనా అధికారులు ఇటువంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని అక్కడున్న స్థానికలు కోరుతున్నారు.
అన్నమయ్య జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 9 చోరీ కేసుల్లో 7మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు రూ.21,87,500 విలువ చేసే 437.76 గ్రాముల బంగారం, 417 గ్రాముల వెండి, ఒక కారు స్వాధీనం చేసుకొన్నట్లు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కృష్ణారావు ఇపిఎస్ వివరాలు వెల్లడించారు. ఎస్పి కృష్ణ రావు తెలిపిన వివరాల మేరకు గుర్రం కొండ, పెద్దమండెం, తంబళ్ళ పల్లె, కలకడ, లక్కిరెడ్డి పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలు జరిగినట్లు కేసులు నమోదు చేయడం జరిగింది. దొంగతనాలకు పాల్పడే వారిని పట్టుకునేందుకు రాయచోటి డివిజన్ డి ఎస్పి మహబూబ్ బాష పర్యవేక్షణలో వాయిల్పాడు సి ఐ సురేష్ కుమార్, గుర్రంకొండ యస్ ఐ దిలీప్ కుమార్ లు రెండు టీంలుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానంతో చోరీలు జరిగిన ప్రదేశాలలో సి సి కెమెరా పుటేజ్ ద్వారా ఫోటోలు సేకరించారు. ఇదే తరహాలో గతంలో రాయచోటి లో కుడా దొంగతనాలు జరిగినట్లు కుడా వారు తెలియజేశారు. సి సి పుటేజి ల ద్వారా సేకరించిన ఫోటోల ఆధారంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో ఇటువంటి దొంగతనాలకు పాల్పడిన వారిని గుర్తించి విచారించామన్నారు. ఆ విచారణలో అన్నమయ్య జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లలో కేసు నమోదైన తమిళనాడు రాష్ట్రానికి చెందిన కార్తికేయన్, మురగేంద్రన్, మోహన్ రాజ్, శక్తివేల్, మురళి, దినకరన్, పి తిరుపతి, వెంకటేష్ లను అరెస్ట్ చేశామన్నారు. వారు దొంగతనాలు చేసేందుకు వాడిన పనిముట్లు, రెండు పల్సర్ బైక్ లు, ఆరు సెల్ ఫోన్ లను సిజ్ చేయడం జరిగిందన్నారు. దొంగతనాలకు పాల్పడిన వారిని అరెస్ట్ చేయడమే కాకుండా వారు కొల్లగొట్టిన వెండి, బంగారు నగలను రికవరీ చేసి విధి నిర్వహణలో ఉత్తమమైన విధులను నిర్వర్తించి పోలీసుల పట్ల ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసాన్ని పెంపొందించేలా చేసిన పోలీసు సిబ్బందిని ఎస్పీ కృష్ణారావు ఐపీఎస్ ప్రశంసించి వారికీ రివార్డులు అందజేశారు.
అతి కిరాతకంగా వృద్ధ మహిళను కత్తితో పొడిచి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నెల్లూరు జిల్లా కందుకూరు మున్సిపాలిటీ పరిధిలోని చుట్టుగుంట గ్రామానికి చెందిన మందలపు శేషమ్మ (70) మహిళను ఆమె ఇంట్లో అతి కిరాతకంగా హత్య చేశారు. శేషమ్మ భర్త చాలా కాలం క్రితం మరణించగా ఆమె ఒంటరిగా ఇంటివద్ద ఉంటున్నది. శేషమ్మకు ఒక కుమారుడు, ఒక కుమార్తె, ఇద్దరికీ పెళ్లిళ్లు కాగా కొడుకు కెనడాలో, కుమార్తె హైదరాబాద్ లో ఉంటున్నారు. జనవరి 1 వతేది అందరితో మాట్లాడిన శేషమ్మ 2వతేది ఉదయం నుండి ఎవరికీ కనిపించలేదు. బంధువులు ఫోన్ చేసిన సమాధానం లేదు. దీంతో శేషమ్మ తమ్ముడు పక్కింటి వారికి ఫోన్ చేసి సమాచారం అడుగగా, వారు ఇంటి వద్దకు వెళ్లగా బయట తాళం వేసి ఉండటం, లోపలి నుండి దుర్వాసన వస్తుండటంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తాళాలు పగలగొట్టి చూడగా బెడ్ రూములో రక్తపు మడుగులో చనిపోయి దుర్వాసన వస్తున్న మృతదేహం పడి ఉంది. కత్తితో గొంతు భాగంలో పొడిచి చంపినట్లు పోలీసులు గుర్తించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించారు. కందుకూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టుమ్ కోసం కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు.
విశాఖ జిల్లా పెందుర్తిలో వెలుగులోకి పోలీస్ దాష్టికాలు. స్ట్రీట్ ఫుడ్ అమ్ముకునే మహిళపై లాఠీ తో కసాయితత్వం చాటుకున్న ASI మురారి. ASI మురారి పేరు చేబితేనే బయబ్రాంతులకు గురౌతున్న చిరువ్యాపారులు ఐ యాం పోలీస్ తాట తీస్తా అంటూ చిరువ్యాపారులపై బండబూతులు. ASI వేధింపులతో తీవ్ర మనస్థాపానికి గురైన బాధిత మహిళ. గాయాల బాధను తాళలేక పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత మహిళ, మహిళతో పాటు పలువురిపై విచక్షణ రహితంగా లాఠీచార్జి చేసిన ASI మురారి. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు ఆందోళన.
పుదుచ్చేరి యానాం నుండి అనధికారికంగా ప్రత్యేకంగా తయారుచేసిన ట్యాంకర్ ద్వారా డీజిల్ తరలించి ఆంధ్ర ప్రాంతంలో అమ్మకాలు సాగిస్తున్న ముఠా ను ముమ్మిడివరం పోలీసులు పట్టుకున్నారు. యానాం కు ఆంద్రా ప్రాంతానికి లీటర్ డీజిల్ కు రూ.12 రూపాయలు వరకూ వ్యత్యాసం ఉండటంతో ఈ అక్రమరవాణా చేసి అమ్మకాలు సాగిస్తున్నట్లు సమాచారం. యానాం నుండి ఆత్రేయపురం తరలిస్తున్నట్లుగా అందిన సమాచారం తో ట్రయినీ డిఎస్పీ విష్ణు స్వరూప్ ఆధ్వర్యంలో పోలీసులు ట్యాంకర్ డ్రైవర్ తో పాటు అందులో ఉన్న మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సివిల్ సప్లయి అధికారులను రప్పించి వారి సహకారంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ట్యాంకర్ లో సుమారు 3వేల లీటర్ల డీజిల్ ఉన్నట్లు సమాచారం.
మల్లంపేట ,ఇందిరమ్మ కాలనీలో ఉంటున్న ఇంతియాజ్ మహమ్మద్, రూబీనా బానో(30) భార్యాభర్తలు. ముగ్గురు పిల్లలు కుమార్తె ఆల్సిత, కుమారులు సూఫీయాన్, అనాష్ ఈ నెల 2న భర్త ఇంటికి వచ్చి చూడగా భార్య పిల్లలు కనబడుట లేదని ఫిర్యాదు. తాను ఉదయం 10 గంటలకు పనిమీద మియాపూర్ కు వెళ్లి సాయంత్రం 5 గంటలకు భార్యకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది, సాయంత్రం 7 గంటలకు ఇంటికి వచ్చిన అతనికి భార్యా పిల్లలు ఇంట్లో కనిపించకపోవడంతో ఆందోళన చెంది పోలీసులను ఆశ్రయించిన భర్త. ఈ రోజు దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన భర్త ఇంతియాజ్ మహ్మద్. ఫిర్యాదు స్వీకరించిన దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.