కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి తాగిన మైకంలో కొంతమంది యువకులు లక్ష్మీపేట లో మెహబూబ్ అనే యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దాడిలో తీవ్ర గాయాలైన మహబూబ్ చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధువారం మృతి చెందాడు. అయితే మహబూబ్ దాడికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ శివ సర్కిల్లో పెద్ద ఎత్తున యువకులు చేరుకొని మృతదేహంతో ధర్నా చేపట్టారు. అక్కడికి చేరుకున్న పోలీసులతో యువకులు వాగ్వాదానికి దిగారు. ఈ యువకుడి మరణంతో పట్టణంలో ముందు ముందు ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకుంటాయేమోనని పట్టణ ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
Crime
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండల పరిధిలోని రాజుల కండ్రిగ గ్రామంలో మంగళవారం రాత్రి దొంగలు భారతి, జీ.రాజేంద్ర రాజు ఇంట్లో చొరబడి 56 సవరల బంగారం, 7 లక్షల రూపాయలు నగదు దొంగతనం జరిగిందని తెలిపారు. బాధితులు రాజేంద్ర రాజు, భారతి బుధవారం ఉదయం ఇంట్లో చోరీ జరిగినట్లు నాగలాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు భారతి, రాజేంద్ర రాజు వారి కుమారుడు అనిల్ ను విచారించగా తమిళనాడు తిరువళ్లూరుకు బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చి ఇంటిలో చూడగా 56 సవరల బంగారం, 7 లక్షల రూపాయల నగదు చోరీ అయినట్లు పోలీసులకు తెలిపారు. ఇంటిలో ఎవరూ లేని సమయంలో దుండగులు చోరీకి పాల్పడిన సంఘటన సీసీ కెమెరాలలో నమోదయినట్లు బాధితులు తెలిపారు. దొంగల కోసం ఫింగర్ ప్రింట్, ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ పద్మారావు కాలనీ లో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. రుద్రారంకు చెందిన సాయిబాబాకు ఇస్నాపూర్ పద్మారావు నగర్ లోని శాంతమ్మ కూతురు సత్యవతికి 2021 జనవరిలో వివాహం జరిగింది. భార్యభర్తల మధ్య గొడవలతో భార్య సత్యవతి తన తల్లి శాంతమ్మ వద్దకు వచ్చి ఉంటుంది. భార్య సత్యవతి (22)ని కాపురానికి రానివ్వకుండా అత్త శాంతమ్మ (40) అడ్డు పడుతుందనే ఆగ్రహంతో ఇస్నాపూర్ పద్మారావు కాలనీలో నివాసం ఉంటున్న శాంతమ్మ ఇంటికెళ్లి కత్తితో పొడిచి హత్య చేశాడు. అక్కడే ఉన్న భార్య సత్యవతి అడ్డుపడడంతో ఆమె గొంతు కోసి పరారయ్యాడు. భార్య గొంతు కోయడంతో అపస్మారక స్థితి లోకి వెళ్లిన సత్యవతిని చికిత్స కోసం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించగా శాంతమ్మ మృతదేహాన్ని పటాన్ చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పటాన్ చెరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ పురుషోత్తం వెల్లడించారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం మిట్టమీదీపల్లె గ్రామ సరిహద్దులోని జాతీయ రహదారిపై బైక్ ను కారు ఢీ కొన్న సంఘటన లో తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కుమారుడు ఫణీంద్ర ఆరోగ్యం బాగాలేక పోతే మార్కాపురం ఆసుపత్రిలో చూపించుకోని తిరిగి కంభం కు పోతున్న క్రమంలో మిట్టమీద పల్లె గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న బైక్ను కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటన లో తండ్రి సొరకాయల బుజ్జి (35), కొడుకు ఫణీంద్ర (10) అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు కంభం వాసులు గా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ప్రమాదానికి గల కారణం కారు వేగంగా రావడమని తెలిపారు.
వ్యవసాయ మోటర్లను ఎత్తుకెళుతున్న దొంగలను రైతులు కాపుకాసి పట్టుకున్నారు. జగిత్యాల రూరల్ మండలంలోని లక్మిపూర్ గ్రామంలో గత కొంతకాలంగా వ్యవసాయ బావుల వద్ద నుంచి దాదాపు వంద మోటర్ల వరకు చోరీ అయినట్లు రైతులు పేర్కొన్నారు. తమ బాధ్యతగా పోలీసులకు సమాచారం ఇచ్చి రైతులు దొంగల కోసం కాపు కాశారు. బుధవారం ఉదయం ముగ్గురు దొంగలను పట్టుకున్న రైతులు పోలీసులకు అప్పగించారు. సాగు కాలంలో మోటార్లు చోరీకి గురైన రైతులు ఆందోళన చెందగా చివరకు చోరులు పట్టుబడడంతో ఊపిరి పీల్చుకున్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలోని రుద్రారం గ్రామంలో నిన్న అర్ధరాత్రి చోటు చేసుకున్న ఘటనలో స్థానికంగా నివసించే హజ్జు అనే యువకుని పై అదే గ్రామానికి చెందిన బాలరాజు గంజాయి మత్తులో దాడి చేసి తీవ్రంగా కొట్టడంతో తీవ్రంగా గాయాలు కాగా అతని కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనలు అనునిత్యం రుద్రారం గ్రామంలో జరుగుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. దీనిపై స్థానిక నేతలు, పోలీస్ వ్యవస్థ చర్యలు చేపట్టకపోవడంతో గ్రామంలో గంజాయి సేవించే యువకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
Read Also..
రంగారెడ్డి జిల్లా.. చేవెళ్ల నియోజకవర్గంలో విద్యుత్ షాకుతో ఒగ్గు కళాకారుడు మృతి చెందిన సంఘటన షాబాద్ మండల పరిధిలోనే చందనవల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. షాబాద్ ఎస్సై మహేశ్వరరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం గ్రామానికి చెందిన ఒగ్గు కళాకారుడు శివకుమార్ (29)మృతి చెందాడు. ఇతనికి ఒక బాబు, ఒక పాప ఉన్నట్టు సర్పంచ్ తెలిపారు. ఇతను షాబాద్ మండల పరిధిలోని చందనవెల్లి గ్రామానికి చెందిన కందివనం మహేందర్ గౌడ్ తన ఇంటి వద్ద ఎల్లమ్మ కళ్యాణం నిర్వహించారు. ఒగ్గు కథ కళాకారుడు శివకుమార్ తన బృందంతో మైక్ తో కథ చెప్పేందుకు మౌత్ పీస్ తీసుకోగా దానికి విద్యుత్ షాక్ వచ్చి శివకుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో దారుణం చోటు చేసుకుంది. యాదాద్రి జిల్లా.. బీబీ నగర్ మండలం.. కొండమడుగు గ్రామానికి చెందిన వెంకటేష్ బైక్ మీది నుండి కిందపడడంతో చేతి ఎముక వీరగడంతో మేడిపల్లి లోని శ్రీకర హాస్పిటల్ లో మూడు రోజుల క్రితం అడ్మిట్ అయ్యాడు. ఆపరేషన్ చెయ్యాలని అనస్థీషియా ఇంజెక్స్షన్ ఇవ్వడంతో కోమాలోకి వెళ్ళాడు. వైద్యసేవలు వికటించి వెంకటేష్ గౌడ్ మృతి చెందాడని, తమకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తూ మృతుడి బంధువులు హస్పిటల్ ముందు ఆందోళన చేస్తున్నారు.
Read Also..
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం, 53 మద్యం సీసాలను, 5 లక్షల 50 వేలు నగదును స్వాధీనం చేసుకున్న గన్నవరం పోలీసులు. సాధారణ తనిఖీలలో భాగంగా గన్నవరం మండలం కేసరపల్లి- సవారిగూడెం జంక్షన్ వద్ద వాహనాలు చెకింగ్ లో భాగంగా ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న గన్నవరం పోలీసులు. వారి వద్ద నుండి 53 మద్యం సీసాలను 5 లక్షల 50 వేలు నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గన్నవరం పోలీసులు.
ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లి బ్రదర్ జోసఫ్ తంబి పుణ్యక్షేత్రంలో పురుగుమందు సేవించి తల్లీకూతుళ్ల ఆత్మహత్యాయత్నం. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి కి చెందిన కొప్పుల విజయభారతి (35), కొప్పుల శ్రీనిధి (13)గా గుర్తింపు. స్థానికుల సమాచారంతో చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో గన్నవరం మండలం చిన్న ఆవుటపల్లి పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీ హాస్పిటల్ కి తరలింపు. పురుగుమందు సేవించిన తల్లీకూతుళ్ల ఆరోగ్యం పరిస్థితి విషమం. సమాచారం అందుకున్న ఆత్కూరు పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.