అప్పుల బాధ తాళలేక ఓ వ్యక్తి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మదనపల్లిలో మంగళవారం జరిగింది. ఒకటవ పట్టణ పోలీసుల కథనం మేరకు స్థానిక కమ్మ వీధికి చెందిన దావూద్(38) పట్టణంలో చిరు వ్యాపారాలు చేస్తాడు. ఈ క్రమంలో కుటుంబ అవసరాలకు వడ్డీ వ్యాపారుల చెంత కొంత అప్పులు చేసి వాటిని తీర్చలేక పోయాడు. వడ్డీ వ్యాపారుల ఒత్తిడితో తీవ్ర మనస్తాపం చెందిన బాధితుడు జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉన్న నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి బాధితున్ని జిల్లా ఆసుపత్రికి తరలించగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఘటనపై ఒకటవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Crime
ఏర్పేడు మండలంలోని చింతలపాలెం చెక్ పోస్ట్ వద్ద AP03BMO727 నెంబర్ గల కారు అతివేగంగా వచ్చి చెక్ పోస్ట్ ను తప్పించబోయి పక్కనే ఉన్న జనాలపైకి దూసుకుని వెళ్ళింది. అక్కడే ఉన్న చింతలపాలెంకు చెందిన మురళి మరియు హరి అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అప్పటికి కారు ఆగకుండా పక్కనే ఉన్న వేపచెట్టుని గుద్దడంతో చెట్టు విరిగిపోయి ఓ దుకాణాన్ని తోసి వేసింది. పక్కనే ఉన్న వ్యక్తులు సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్ హుటాహుటిన క్షతగాత్రులను ఏరియా ఆసుపత్రికి తరలించింది.
కృష్ణాజిల్లా ఎస్పీ జాషువా ఆదేశాలతో అక్రమ మద్యం విక్రయాలు అరికడుతున్నట్లు చల్లపల్లి సీఐ సీహెచ్ నాగప్రసాద్ తెలిపారు. చల్లపల్లి పోలీస్ స్టేషనులో సీఐ మాట్లాడుతూ ఎస్ఐ సీహెచ్ చినబాబుకు అందిన పక్కా సమాచారం ఆధారంగా తమ చల్లపల్లి మండలం మాజేరులోమంగళవారం రాత్రి తనిఖీలు చేసినట్లు తెలిపారు. మచిలీపట్టణం మండలం అరిసేపల్లి శివారు హుసేన్ పాలెం గ్రామానికి చెందిన యార్లగడ్డ సురేష్ అనే వ్యక్తి చల్లపల్లి మండలం మాజేరు గ్రామానికి చెందిన జన్యావుల వెంకట సుబ్బారావుకు 118 అక్రమ మద్యం సీసాలను మారుతీ సుజుకి కారులో తెచ్చి సరఫరా చేస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. వీరిద్దరూ ఒక్కో సీసాపై రూ.50 అదనపు ధరకు విక్రయిస్తూ చెరో సగం లాభం పంచుకుంటున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. వారి వద్ధ నుంచి 118 సీసాలు అక్రమ మద్యం స్వాధీనం చేసుకుని, ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మద్యం సరఫరాకు వినియోగిస్తున్న కారు సీజ్ చేసినట్లు తెలిపారు.
వారం రోజుల క్రితం అమెరికాలోని టెక్సస్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పొన్నాడ నాగేశ్వర రావు, ఆయన సతీమణి సీతా మహాలక్ష్మి భౌతిక కాయాలు అమలాపురం కె.అగ్రహారం లో వారి స్వగృహానికి చేరుకున్నాయి. అనంతరం ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఇంటికి తీసుకుని వెళ్లారు. ఎమ్మెల్యే సతీష్ ఇంటి వద్దకు మంత్రి పినిపే విశ్వరూప్, జిల్లా నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.
బైరెడ్డిపల్లి మండలం కడపనత్తం గ్రామానికి చెందిన హోటల్ యజమాని నాగభూషణం కుమారుడు గోపి(17) రెండు రోజులుగా కనబడడం లేదు. మంగళవారం ఉదయం కడపనత్తం చెరువులో శవమై తేలాడు. సమాచారం అందుకున్న కుటుంబీకులు విలవిస్తూ గోపి మృతదేహాన్ని గుర్తించి ఇంటికి తీసుకువెళ్లారు. గోపికి మతిస్థిమితం సరిగా లేదని సమాచారం. పూర్తి వివరాలు బైరెడ్డిపల్లి పోలీసులు దర్యాప్తులో తేలాల్సి ఉంది.
Read Also..
నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న ఓ యువతి, ఓ యువకుడిని ప్రేమించింది. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం యువకుడు ఆమెను మాట్లాడుకుందామని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఓ హోటల్ గదిలోకి తీసుకుని వెళ్ళాడు. అక్కడ వీరిద్దరూ శారీరకంగా కలిసిన తర్వాత, యువకుడు అతని ఫ్రెండ్ కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో యువకుని స్నేహితుడు అక్కడికి చేరుకొని, యువతిని బెదిరించి బలవంతంగా అత్యాచారం చేశాడు. తాను ప్రేమించిన ప్రియుడే, అతని స్నేహితుడితో అత్యాచారం చేయించడంతో తీవ్ర మనస్థాపనకు గురైన ఆ యువతి ఆర్కే బీచ్ కి చేరుకొని విలపించడం ప్రారంభించింది. అదే బీచ్ లో సందర్శకులకు ఫోటోలు తీసే ఓ ఫోటోగ్రాఫర్, ఆమెను గమనించి ఓదార్చినట్టు నటించి నేనున్నానంటూ నమ్మించి స్నేహితుల గదికి తీసుకువెళ్లాడు. మొత్తం తొమ్మిది మంది కలిపి యువతిపై గ్యాంగ్ రేప్ చేయడంతో యువతి బెదిరిపోయి వేరే ఊరికి వెళ్ళిపోవడం జరిగింది. యువతి తల్లిదండ్రులు భయపడి ఇంటికి రాకపోవడంతో యువతీ ఫోర్ టౌన్ పోలీసులకి మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడంతో యువతని పోలీసులు చేదించి పట్టుకోవడం జరిగింది. దాని తర్వాత ఈ విషయాలన్నీ పోలీసులకు తెలియడంతో దీనికి కారణమైన వాళ్లందర్నీ అరెస్ట్ చేయడం జరిగింది.
తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో నూతన సంవత్సర సమయంలో వృద్ధ దంపతులకు గర్బ శోకం మిగిలింది. గుమ్మల్లదొడ్డి జంక్షన్ రోడ్ ప్రమాదం లో అచ్చుతాపురం గ్రామానికి చెందిన గోక ఏసురాజు (30), అనే యువకుడు దుర్మరణం పాలైనాడు. జాతీయ రహదారిపై ఇటీవల ప్రమాదాల నివారణ కోసం ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ డ్రమ్ములను బలంగా ఢీ కొట్టాడు. నూతన సంవత్సర వేడుకలు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొత్త సంవత్సరం పూట కొడుకుని పోగొట్టుకున్న వృద్ధ దంపతులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Read Also..
తాడపత్రి పట్టణంలోని నూతన సంవత్సర వేడుకలలో శివాలయం వీధిలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద జింక వెంకటరమణ నివాసం ఉండేవాడు. అతను బండల పాలిష్ ఫ్యాక్టరీలలో పనిచేస్తూ జీవనం సాగించేవాడు. రమేష్ అనే వ్యక్తితో అవసరం నిమిత్తం కోసం డబ్బులు అప్పుగా తీసుకొని తిరిగి మరల చెల్లించలేదని రమేష్ వెంకటరమణ ఇంటి వద్దకు వెళ్లి అడగగా ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో రమేష్ వెంకటరమణ ను కత్తితో పొట్టపై దాడి చేశాడు. పొట్టపై వెంకటరమణ కు దాడి చేయగా పోట్టలో నుంచి పేగులు బయటికి రావడంతో వెంటనే హటావుటిగా స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన తాడపత్రి వైద్యులు వెంటనే మెరుగైన వైద్యం కోసం అనంతపురాని తరలించారు.
తిరుపతి జిల్లా కె వి బి పురం మండలం మిద్ది కండ్రిక సమీపంలో కారు అదుపుతప్పి చెరువులో బోల్తాపడడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. కె వి బి పురం ఆరె జలపాతానికి ఈ రోజు ఉదయం 5 మంది స్నేహితులు చెన్నై నుంచి వచ్చి ఆరె జలపాతానికి వెళ్లి సరదాగా గడిపిన అనంతరం చెన్నైకి తిరుగు ప్రయాణమైన స్నేహితులు మిద్దికండ్రిగ గ్రామ సమీపంలో ఉన్న చెరువులో కారు బోల్తాపడడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మిగిలిన ముగ్గురు ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకున్నట్లు తెలిపారు.
అన్నమయ్య జిల్లాలో జ్యూస్ అనుకుని పొరపాటున ఇద్దరు చిన్నారులు విషం తాగేసిన సంఘటన శనివారం రాత్రి గుర్రంకొండ మండలంలో వెలుగు చూసింది. విషం తాగిన చిన్నారుల్లో ఒకరి పరిస్థితి విషమంగా మారింది. పిల్లల తల్లిదండ్రుల కథనం మేరకు.. తంబళ్లపల్లి నియోజకవర్గం, బీరంగి కొత్తకోట మండలం, చెరువు ముందరపల్లెకు చెందిన దంపతులు గంగరాజు, లక్ష్మిదేవిల కుమార్తె ప్రియదర్శిని(05), గుర్రంకొండ మండలంలోని బంధువులు నగేష్, రవణమ్మ ల ఇంటికి వెళ్లారు. నగేష్ పొలం వద్ద ఉండగా వారిని పలకరించడానికి గంగరాజు, లక్ష్మీదేవిలు తన కుమార్తె ప్రియదర్శిని, నగేష్ కుమార్తె జ్ఞానిక (03) ఇంటి వద్ద వదలిపెట్టి పొలం వద్దకు వెళ్లారు. ఇంట్లో ఆడుకుంటున్న పిల్లలు పొరపాటున జ్యూస్ అనుకుని పురుగు మందు తాగేశారు. తీవ్ర అస్వస్థతకు గురైన పిల్లలను పొలం నుంచి సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు గుర్తించి అపస్మారక స్థితిలో ఉండగా వెంటనే 108 వాహనంలో మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు వారికి మెరుగైన వైద్యం అందించిన ప్రియదర్శిని పరిస్థితి మరింత విషమించిందని డాక్టర్లు ఆ ఇద్దరి చిన్నారులను తిరుపతి రుయాకు రెఫర్ చేయడంతో 108 సిబ్బంది వారిని తిరుపతి రుయాకు తరలించారు.