అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పలివెల మెయిన్ రోడ్ ప్రక్కన బూరగాయల శ్రీనివాస్ అనే వ్యక్తి దారుణ హత్య కు గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే బూరగాయల శ్రీనివాస్ అనే వ్యక్తికి ముగ్గురు సోదరులు అయితే ఒక సోదరుడు దత్తతకు వెళ్లిపోగా ముగ్గురు అన్నదమ్ములు ఒకే గృహంలో నివసిస్తున్నారు. చనిపోయిన వ్యక్తి శ్రీనివాస్ కు వివాహం కాగా భార్య ఇదివరకే వదలిపెట్టి వెళ్ళిపోయింది. అయితే ముగ్గురు అన్నదమ్ములు తల్లి తో పాటు ఉంటున్నారు. వీరికి గతంలో ఇంటి ప్రక్కనే కర్రల మిల్లు ఉండేది ప్రస్తుతం అది శిదిలం అయిపోయింది. సోమశేఖర్ కు శ్రీనివాస్ ఇద్దరి అన్నదమ్ములకు మతిస్థిమితం సరిగా లేదని కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే సోమశేఖర్ అన్న శ్రీనివాస్ ను హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. శనివారం ఉదయం ఈ ఘటన జరిగినట్లు చెప్పారు. కొత్తపేట డిఎస్పీ కే.వి.రమణ, గన్నవరం సిఐ ప్రశాంత్ కుమార్, స్థానిక ఎస్.ఐ జ్వాలా సాగర్ ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు.
Crime
ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ద్విచక్ర వాహనం పై వెళుతున్న దంపతులను వెనుక నుండి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటన లో గుంటూరు జిల్లా చిలకలూరిపేట కి చెందిన మల్లారపు వెంకట్రావు ప్రాణాల తో బయట పడగా.. అతని భార్య వెంకాయమ్మ ఘటనాస్థలం లోనే దుర్మరణం పాలైంది. జీ కొండూరు మండలం చిన్న నందిగామ మామిడి తోటలో కాపలా కి పనిచేస్తున్న వెంకట్రావు భార్యతో కలిసి మైలవరం రైతు బజార్ లో కూరగాయలు కొనడానికి వచ్చి తిరిగి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
గుంటూరు.. సంపత్ నగర్ శివాలయం వద్ద ఆరేళ్ళ బాలుడిపై కుక్కలు దాడి చేసాయి. బాలుడికి తీవ్రంగా గాయాలు అవ్వడంతో.. ఆసుపత్రికి తరలించారు. ఉదయాన్నే కరాటే తరగతులకు వస్తున్న బాలుడు కార్తికేయపై ఐదు కుక్కలు దాడి చేసాయి. బైక్ పై వచ్చిన వాహనదారుడు సకాలంలో స్పందించి దాడిని అడ్డుకున్నాడు. సెలవులు కావటంతో చుట్టాలింటికి వచ్చిన బాలుడు పై దాడి చేయడంతో.. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
Read Also..
60 ఏళ్ల వృద్ధురాలిపై మధ్యం మత్తులో యువకుడు అత్యాచారం చేసిన ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురంలో చోటుచేసుకుంది. రాయవరం రైల్వే స్టేషన్ లోని గోగులదిన్నే రహదారిలో ఒంటరిగా నివాసం ఉంటున్న వృద్దురాలిపై డేవండ్ల కమలనాథ్ అనే యువకుడు మధ్యం మత్తులో ఇంట్లోకి చొరపడ్డాడు. వెంటనే కేకలు వేసిన వృద్ధురాలి నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడి పరారయ్యాడు. విషయాన్ని మహిళ కుటుంబ సభ్యులకు చెప్పి ఆ తర్వాత పోలీసులకు పిర్యాదు చేశారు. మహిళ ఆరోగ్యం మెరుగ్గా లేకపోవడంతో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా.. రాజానగరం.. జి ఎస్ ఎల్ వద్ద నర్సీపట్నం నుండి రాజమండ్రి వెళుతున్న కర్రల లారీ, లారీని ఓవర్ టెక్ చేసే క్రమంలో పొగమంచు ఉండడంతో అదుపుతప్పి కంటైనర్ ను ఢీకొట్టింది. జాతీయ రహదారిపై కర్రలు అడ్డంగా పడిపోవడంతో.. భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు వాహనాలను వన్ వే దారి మళ్లించారు. ప్రమాదంలో లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
Read Also..
అనకాపల్లి జిల్లాలో అప్పుల బాధ తాళలేక ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అనకాపల్లిలో చోటుచేసుకుంది. రాత్రి ఓ అపార్ట్మెంట్లో పురుగుల మందు తాగి భర్త, భార్యతో సహా ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మరో 9 ఏళ్ల పాప కుసుమ ప్రియ ఎన్టీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. చికిత్స పొందుతున్న కుసుమ ప్రియా పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే కొడవలి రామకృష్ణ తన భార్య మాధవి దేవి వారి పిల్లలు వేద వైష్ణవి, జాన్వి లక్ష్మి, కుసుమ ప్రియ తో కలిసి గత కొంతకాలంగా స్థానిక ఫుడ్ పేట, ఫైర్ స్టేషన్ పక్కన లక్ష్మీ పారడైస్ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నట్లుగా అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పట్టణ సీఐ దాడి మోహన్ రావు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. గుంటూరు తెనాలికి చెందిన రామకృష్ణ కుటుంబం రాత్రి అన్నంలో పురుగులు మందు కలుపుకొని మృతి చెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని మంగళగిరిలో ఉంటున్న రామకృష్ణ బంధువులకి సీఐ సమాచారం చేరవేశారు. మృతులు భర్త కొడవలి రామకృష్ణ, భార్య మాధవి దేవి, పిల్లలు వేద వైష్ణవి, జాన్వి లక్ష్మిగా పోలీసులు గుర్తించారు.
విజయనగరం జిల్లా,
స్నేహితులతో కలిసి అరకు విహారయాత్ర ముగించుకొని తిరిగి వస్తుండగా ప్రమాదం బారిన పడ్డ యువకుడు. కొత్తవలస – అరకు ప్రధాన రహదారిలో నిమ్మలపాలెం గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖపట్నం జిల్లా మింది గ్రామానికి చెందిన యువకుడు తేజ (23) మృతి చెందాడు. స్నేహితులతో కలిసి అరకు విహారయాత్రను ముగించుకొని తిరిగి వస్తుండగా నిమ్మలపాలెం గ్రామం వద్ద ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న వ్యానును బలంగా ఢీకొనడం వల్ల సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. అతనితో పాటు ప్రయాణం చేస్తున్న మరొక యువకుడు భాను తీవ్రంగా గాయపడటంతో 108 అంబులెన్స్ లో పోలీసులు హాస్పిటల్ కు తరలించారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
అక్రమంగా గోవధకు తరలిస్తున్న 40 పశువులను మదనపల్లి గో సంరక్షణ సమితి, బిజెపి, ఆర్ఎస్ఎస్, విహెచ్పి నేతలు బుధవారం సాయంత్రం అడ్డుకుని పట్టుకున్నారు. పట్టుబడిన పశువులను పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు. గో సంరక్షణ సమితి పశువులను పట్టుకుని పోలీసులకు అప్పగిస్తున్నా మరోవైపు వదిలిపెట్టేస్తున్నారని పోలీసుల తీరిపై వారు మండిపడ్డారు. పశువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలంటే పోలీసులు తమిళనాడులోని గోవధశాలకు పశువులను అక్రమంగా తరలించే నిందితులపై కఠినమైన కేసులు నమోదు చేసి అరెస్టు అనంతరం, వాహనాలను సీజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.