పుంగనూరు, బీడీ కాలనీ వద్ద ఆటోను ఢీకొన్న స్కూల్ బస్. ఆటోలో కూలీ పనులకు వెళుతున్న ముగ్గురికి తీవ్ర గాయాలు. క్షతగాత్రులు పెద్దపంజాని(మం)భద్రాచలం కు చెందిన వారిగా గుర్తింపు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికు తరలింపు. స్కూల్ బస్సును పోలీస్ స్టేషన్ కు తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది అని పోలీసులు వెల్లడించారు.
Crime
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి ప్రైవేట్ పిఏగా పనిచేస్తున్న రవి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన రవి నాలుగున్నర ఏళ్ల పాటు తిరుమల దర్శన వ్యవహారాలను నడిపించారు. పిఏ రవి ఇంటి వద్ద ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వన్ టౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సీలేరు లో భారీ గంజాయి పట్టివేత, అల్లూరి జిల్లా జీకె వీధి సీలేరు పోలీసులు వాహనాలు చెకింగ్ లో కోటి 50 లక్షలు విలువ చేసే 725 కేజీలు భారీ గంజాయి పట్టివేత. ఇద్దరు అరెస్టు ముగ్గురు పరారు. అశోక లేలాండ్ గూడ్స్ లారీ మరియు ఒక కారు రెండు సెల్ ఫోన్లు 1300 రూపాయలు నగదు సీజ్. ముద్దాయిలను కోర్టుకు తరలింపు. పరారైన నిందితులను ప్రత్యేక బృందం ద్వారా పట్టుకొని మీడియా ముందు ప్రవేశపెడతాం చింతపల్లి పోలీస్ డివిజన్ అడిషనల్ ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. అల్లూరు జిల్లా ఎస్పీ తుహాన్ సీనవా చింతపల్లి సబ్ డివిజనల్ అడిషనల్ ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్, ఆదేశాల మేరకు వాహనాలు తనిఖీలు భాగంగా గంజాయి ముఠాను పట్టుకున్న పోలీసు,సీలేరు టిఆర్సి క్యాంప్ సమీపంలో వాహనాలు పరిశీలిస్తుండగా అటుగా వస్తున్న లారీ కారును పరిశీలించగా 725 కేజీలు గంజాయి లారీ లో ఉన్నా నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా, మహారాష్ట్రానికి చెందిన వాళ్ళని, ఒడిస్సారాష్ట్రం చిత్రకొండలో గంజాయిని కొనుగోలు చేశారని వివరించారు, గంజాయి ముఠాను అదుపులోకి తీసుకొని లారీ,కారు,2సెల్ ఫోన్లు,1300 నగదును సీజ్ చేసి, నిందితులను రిమాండ్‌కు తరలిస్తామని గంజాయి విలువ కోటి 50 లక్షలు ఉంటుందని తెలిపారు, ఈ కేసును చేదించిన సిఐ అశోక్ కుమార్ ను, సీలేరు ఎస్సై రామకృష్ణను, పోలీస్ సిబ్బందిని అభినందించారు.
అల్లూరి జిల్లా హుకుంపేట లో సాకలిగెడ్డ వద్ద కు చేపలు పట్టడానికి వచ్చిన గిరిజనుడు ప్రమాదవశాత్తు గెడ్డలో పడి గల్లంతయ్యాడు. హుకుంపేట మండలం బారపల్లి గ్రామానికి చెందిన నలుగురు గిరిజనులు చేపలు వేటకు వచ్చారు .దురదృష్టవశాత్తు బోనంగి రవికుమార్ (32) గెడ్డలో చేపలు పడుతుండగా సాయంత్రం 4.30 సమయంలో ఊబిలోకూరుకుపోయి గల్లంతయ్యాడు. వారితోనే చేపలు వేటకు వచ్చిన వంజలి శంకర్, కిలో రామారావు, కీల్లో సంతోష్ , గెడ్డలో గల్లంతైన రవికుమార్ బయటకు రకపోయే సరికి స్థానిక పోలీసులకు సమాచారం వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యి గల్లంతైన గిరిజనుడి ని గజ ఈత గళ్ళ సహాయంతో గాలిస్తున్నారు. హైవే నిర్మాణం లో భాగంగా వంతెన నిర్మాణం అవుతున్న క్రమంలో గెడ్డ మధ్యలో 3 గొట్టాలు వేసి తాత్కాలికంగా చిన్న వంతెన నిర్మించారు. తాత్కాలిక వంతెన వెయ్యడం వాళ్ళ ఇక్కడ గెడ్డలో నీరు నిల్వ వుండటం వల్ల ఊబి గా తయారైందని కొందరుబాధితులు ఆరోపిస్తున్నారు.
మందమర్రిలో విషాదం నెలకొంది. తల్లీకూతుర్లు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. చెన్నై నుంచి వలస వచ్చిన మురుగన్- ధనలక్ష్మి దంపతులు ఇక్కడ పాపడాలు, చెకోడీలు తయారు చేసి విక్రయించడం చేస్తున్నారు. వ్యాపార పని నిమిత్తం మురుగన్ బయటకు వెళ్లిన తర్వాత అర్థరాత్రి సమయంలో ధనలక్ష్మి, కూతురు జీవని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కొడుకు సిద్దు ఆ సమయంలో ఇంట్లోనే ఉన్నప్పటికీ గమనించలేదు. ఉదయం లేచి చూసేసరికి అక్క,తల్లి శవాలుగా కనిపించడంతో షాక్ కి గురయ్యాడు. కొంతసేపటికి తేరుకొని బంధువులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చిచూసేసరికి విషయం వెలుగులోకి వచ్చింది. వ్యాపారం ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చే మురుగన్ రాత్రి నుండి ఇంటికి రాకపోవడం, అతని సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో మురుగన్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
చిత్తూరు, రాత్రి వేళలో ఇంటి దొంగతనాలకు మరియు బ్యాంకు దొంగతనాలకు పాల్పడుతున్న 6 మంది మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసిన పలమనేర్ పోలీసులు. సుమారు 30 లక్షల విలువ గల 520 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు రెండు కార్లు స్వాధీనం. ఈరోజు ఉదయం రాబడిన సమాచారం మేరకు ముద్దాయిలను పలమనేరు – గంగవరం ఫ్లైఓవర్ దగ్గర అరెస్ట్ చేసిన పోలీసులు.ముద్దాయిల పైన మన రాష్ట్రం తో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో కూడా పలు కేసులు కలవు. ఇతర రాష్ట్రాల పోలీసులు వెతుకున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసిన పలమనేర్ సబ్-డివిజన్ పోలీసు సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ వై.రిశాంత్ రెడ్డి, ఐ.పి.ఎస్. పలమనేరు, పుంగనూరు, కుప్పం సర్కిల్ల పరిధిలో జరిగినటువంటి దొంగతనాలకు సంబంధించి డి.ఎస్.పి. ఎన్.సుధాకర్ రెడ్డి పర్యవేక్షణలో జిల్లాలోని పుంగనూరు, సదుం, గంగవరం మరియు రామకుప్పంలో రాత్రి సమయంలో జరిగిన దొంగతనాలను ఛేదించు క్రమంలో పలమనేరు డి.ఎస్పీ పోలీసులను 4 బృందాలుగా ఏర్పర్చి ఇతర రాష్ట్రాలైన కర్ణాటక, కేరళ మరియు తమిళనాడు అంతట వారి గురించి విచారణ జరిపించగా కేవలం ఇళ్ళలోనే కాకుండా బ్యాంకు దోపిడిలు కూడా చేసేవారని నిర్ధారణకు వచ్చారు. ఈరోజు ఉదయం రాబడిన సమాచారం మేరకు పుంగనూరు ఎస్.ఐ. సుకుమార్ మరియు సిబ్బంది పలమనేరు – గంగవరం ఫ్లైఓవర్ దగ్గర మోస్ట్ వాంటెడ్ అయిన ఆరుగురు అంతర్రాష్ట్ర దొంగలైన రమేష్, గోవిందరాజు, శ్రీనివాసులను, గవియప్ప, గణేష్ మరియు అశ్వత్ నారాయణ ను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 30 లక్షలు విలువ గల 520 గ్రాముల బంగారు ఆభరణాలను మరియు 5 లక్షలు విలువ గల రెండు కార్లను స్వాదీనం చేసుకున్నారు. వీరిని విచారించగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాలలో రాత్రి సమయాలలో తాళం వేసిన ఇళ్ళను లక్ష్యంగా ఎంచుకొని తాళాలు పగలుకొట్టి ఇళ్ళల్లోకి ప్రవేశించి దొంగతనాలకు పాల్పడేవారని మరియు ఈ ముఠాకు నాయకుడైన రమేష్ కర్ణాటక, తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాలలో బ్యాంకు దొంగతనాలకు పాల్పడేవాడని విచారణలో తెలియజేసారు. ఈ ముఠా దొంగతనం చేసిన తరువాత బంగారాన్ని రమేష్, శ్రీనివాసులు వారి వారి బందువులకు ఇచ్చి ముత్తుట్ ఫైనాన్సు మరియు ATTICA గోల్డ్ కంపెనీ నందు అమ్మేసి సొమ్ము చేసుకునేవారని విచారణలో తెలియజేసారు .ఇతర రాష్ట్రాలలో కూడా మోస్ట్ వాంటెడ్ అయిన రమేష్ మరియు అతని అనుచరులను ఎంతో చాకచక్యంగా అరెస్ట్ చేసిన పలమనేరు సబ్-డివిజన్ పోలీసులను జిల్లా ఎస్పీ క్యాష్ రివార్డ్ మరియు సర్టిఫికెట్స్ తో అభినందించారు.
ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ సొంత చిన్నాన్న పొన్నాడ నాగేశ్వరరావు చిన్న కుమార్తె పోతాబత్తుల నవీన గంగ, అల్లుడు లోకేష్ లు వారి కుమార్తె కుమారుడుతో టెక్సాస్ లో ఉంటున్నారు. సుమారు ఆరు నెలల క్రితం అమలాపురం వచ్చిన కుమార్తె నవీన గంగతో కలిసి తండ్రి పొన్నాడ నాగేశ్వరరావు, సీతామహాలక్ష్మి దంపతులు టెక్సాస్ వెళ్లారు. టెక్సాస్ హైవేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పొన్నాడ నాగేశ్వరరావు, సతీమణి సీతామహాలక్ష్మి, కుమార్తె పోతాబత్తుల నవీన గంగతో పాటు కుమారుడు, కుమార్తె మృతి చెందారు. ప్రమాదంలో తీవ్ర గాయాలు పాలైన పోన్నాడ నాగేశ్వరరావు అల్లుడు లోకేష్ పరిస్థితి విషమంగా ఉంది, సర్జరీ జరుగుతుంది.
నిన్న కాంచీపురంలో ఒక రైడర్‌ను ఆ ప్రాంతంలో నరికి చంపారు. ఈ హత్యకేసులో ప్రమేయం ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. రఘు, అసన్ అలియాస్ కరుపు అసన్.. వారిద్దరూ కాంచీపురం కొత్త రైల్వే బ్రిడ్జి దగ్గర దాక్కున్న సమయంలో పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులపై దాడి చేశారు. స్పెషల్ అసిస్టెంట్ పోలీస్ ఆఫీసర్ రామలింగం, కానిస్టేబుల్ శశికుమార్‌లపై దుండగులు కొడవళ్లతో దాడి చేశారు. ఆత్మరక్షణ కోసం అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ సుధాకర్ కాల్పులు జరపడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
హైదరాబాదులోని బేగంపేట ప్రజాభవన్ బారికేడ్లను కారు ఢీకొన్న ఘటన మరో మలుపు తిరిగింది. ఈ ఉదంతం వెనకబోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ అలియాస్ రాహుల్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ నెల 23న అర్ధరాత్రి ఓ కారు ప్రజాభవన్ వద్ద ఉన్న బారికేడ్లను ఢీకొట్టిన విషయం తెలిసిందే. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు సాహిల్ అతివేగంతో కారు నడుపుతూ ప్రజాభవన్ వద్ద బారికేడ్లను బలంగా ఢీకొట్టాడు. ఘటన జరిగిన సమయంలో కారులో ముగ్గురు యువతులు కూడా ఉన్నారు. ఈ క్రమంలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది పంజాగుట్ట పోలీసులకు సమాచారమిచ్చి సాహిల్‌తో పాటూ ముగ్గురు యువతులను అప్పగించారు. అయితే, బ్రీత్ ఎనలైజర్ ట్రాఫిక్ పోలీసుల వద్ద ఉండటంతో ఇన్స్పెక్టర్ దుర్గారావు సాహిల్‌ను హోంగార్డుకు అప్పగించి డ్రంకన్ డ్రైవ్ పరీక్షకు పంపించారు. ఈ సమయంలో నిందితుడు తప్పించుకున్నాడు. అనంతరం, సాహిల్ దుబాయ్‌లో ఉన్న తన తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో ఆయన సూచనతో అనుచరులు సాహిల్‌ను తప్పించి వారి పనిమనిషి అబ్దుల్ ఆసిఫ్‌ను పంజాగుట్ట ఠాణాకు తీసుకెళ్లారు. కారు తానే నడిపినట్టు అతడితో చెప్పించడంతో కేసు నమోదైంది. అయితే, ముగ్గురు యువతులను స్టేషన్‌కు రప్పించి వాంగ్మూలం తీసుకున్నప్పుడు కారు నడిపింది సాహిల్ అని వెలుగులోకొచ్చింది. ఈ క్రమంలో పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావును కేసులో నిర్లక్ష్యం వహించినందుకు సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. బారికేడ్లను ఢీకొన్న ఘటనలో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ ప్రధాన నిందితుడని పశ్చిమ మండలం డీసీపీ తెలిపారు. దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు పనిమనిషిని ఠాణాకు పాంపారన్నారు. సాంకేతిక ఆధారాలు సేకరించాక అసలు విషయం బయటపడిందన్నారు.