పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్నంలోని కొత్త మార్కెట్ యార్డ్ ఎదురు నేషనల్ హైవే మీద గుంటూరు నుంచి వెళ్తున్న కారు, గణపవరంకు చెందిన వ్యక్తి మార్కెట్ యార్డ్ లో నుంచి కూరగాయలు కొనుక్కొని టీవీఎస్ ద్విచక్ర వాహనం మీద గణపవరం వెళుతుండగా గుంటూరు నుంచి వస్తున్న కారు బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే గణపవరంకు చెందిన వ్యక్తి మృతి చెందాడు. అలాగే పక్కన ఆగి ఉన్న స్కూటీని కూడా ఢీకొంది. స్కూటీ మీద ఉన్న వ్యక్తికి తీవ్రమైన గాయాలు అవటంతో వారి బంధువులు హుటాహుటిన వైద్యశాలకు తరలించారు.
Crime
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందాడు. ఆరాంఘర్ నుంచి మేహిదిపట్నం వైపు బైక్ పైన వెళ్తున్న అక్బర్ మోహిఉద్దిన్ (24) అనే ఓ యువకుని, శివరాంపల్లి పిల్లర్ నెంబర్ 245 వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొనడం తో, యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీనితో ఢీకొన్న వాహనం అక్కడ నుంచి ఫరారయ్యింది. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఒస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని జయరాం లాడ్జి సెంటర్ లో AP 29Z 1409 ఆర్టీసీ బస్సు నుండి ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు జారి కింద పడ్డాడు. తలకి గాయాలవడంతో, గిద్దలూరు పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది దగ్గరుండి అంబులెన్సు ఎక్కించి ఆసుపత్రి కి తరలించారు. సకాలంలో స్పందించిన గిద్దలూరు S I మహేష్ తన సిబ్బందిని పంపించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా క్షత గాత్రుని అంబులెన్సు లో తరలించారు. ఒద్దులావపల్లెకు చెందిన ప్రసాద్ (38) గా గుర్తింపు. స్థానిక తిరుమల రెస్టారెంట్ లో వంట మాస్టర్ గా పని చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
Read Also..
అనంతపురం జిల్లా గుత్తి మండలం జక్కలచెరువు గ్రామ సమీపంలో 63వ జాతీయ రహదారిపై బైకు అదుపుతప్పి బోల్తా పడడంతో గొందిపల్లి గ్రామానికి చెందిన ఓబుల్ రెడ్డి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఇతన్ని స్థానికులు గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు.
ఈ మధ్య కాలంలో జాతీయ రహదారులపై బైక్ రైసింగ్, స్టంట్ చేయడం నేటి యువతకు ఫ్యాషన్ అయిపోయింది. శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండలో బాబయ్య స్వామి ఉరుసు సందర్భంగా కర్ణాటక, తమిళనాడు నుంచి వచ్చిన ఎక్కువ మంది యువకులు వచ్చారు. వీరు జాతీయ రహదారిపై బైక్ రేసింగ్, బైక్ స్టంట్ విన్యాసాలు చేయడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఈ బైక్ రైసింగ్ లు చూసేందుకు ప్రజలు బారులు తీరారు. ఇలాంటి విన్యాసాల పట్ల యువత చెడుదారి పడుతోందని, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి బారిన ఇద్దరు చనిపోయారు. విశాఖపట్నం కెజీహెచ్ లో కరోనాతో ఒక మహిళ మృతి చెందింది. ఈ నెల 24 వ తేదీన కరోనా సోకి, కెజీహెచ్ లో అడ్మిట్ అయిన సోమకళ అనే మహిళ ఈ తెల్లవారుజామున మూడుగంటల సమయానికి చనిపోయినట్లు అధికారులు తెలిపారు. రోజురోజుకూ పెరుగుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులతో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జే కొత్తూరు గ్రామ శివారు దుర్గమ్మ తల్లి ఆలయ సమీపంలో రెండు బైకులు ఢీకొన్నాయి. మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలై వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం మరొకరికి గాయాలయ్యాయి.
స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
మద్యం మత్తులో సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేసిన బ్యారికెట్లను తన కారుతో అతివేగంగా వచ్చి ధ్వంసం చేసిన బీఆర్ఎస్ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు. సంఘటన ఈనెల 23వ తారీకు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో చోటుచేసుకుంది. వాహనం నడుపుతున్న సమయంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడుతో పాటు ముగ్గురు అమ్మాయిలు కూడా ఉన్నారని తెలుస్తోంది. కాగా భారీకెడ్లను ధ్వంసం చేయగానే సంఘటన సమయంలో వున్న పోలిసులు నిదితుడినీ స్టేషన్ కు తీసుకు వచ్చారు. కాగా ఫుల్ గా మద్యం సేవించిన షకీల్ కుమారుడు నీ టెస్ట్ చేసేందుకు ఆ రోజు డ్యూటీ లో వున్న ఇన్స్పెక్టర్ ఒక హోమ్ గార్డ్ నీ ఇచ్చి పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు పంపగా నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో నిందితుడి నీ కావాలనే తప్పించారా లేక తప్పించుకు పోయాడా అని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో విషయం కాస్త డిజిపి దృష్టి కి వెళ్ళడం తో స్టేషన్ కి వచ్చిన ఆయన కేసు దర్యాప్తు చేసేందుకు గాను ఎస్.అర్.నగర్ డివిజన్ ఏసిపి వై.వి.రావు దర్యాప్తు చేస్తున్నారు.