కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అయి పేలుడు సంభవించింది. గ్రామ ఉపసర్పంచ్ మామిడి మల్లిబాబు నివాసంలో వంట చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 14 ఏళ్ల శ్రావణి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. చిన్నబాబు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడగా, మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పేలుడు భారీగా జరగడంతో ఇంట్లోని సామగ్రి ధ్వంసం కాగా, ఇల్లు పూర్తిగా దెబ్బతింది. పిఠాపురం సీఐ శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Crime
బాపట్ల జిల్లాలో అర్ధరాత్రి దోంగలు అలజడి చేసారు. కంకటపాలెం గ్రామం పోలేరమ్మ దేవస్థానంలో రాత్రి అమ్మవారి నగలు, హుండీ అపహరణకు గురయ్యాయి. గుడిలోని ఏ సామాగ్రిని వదలకుండా మొత్తం దోచుకున్నారు దొంగలు. సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ పనిచేయడం లేదని తెలుసుకొని ఈ దారుణానికి ఒడిగట్టారన్నారు పోలీసులు. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మొదటి బైపాస్ రోడ్డు (ఎన్ఐసీ ఆఫీస్) వద్ద సోమవారం కారు బోల్తా కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికీ స్వల్ప గాయాలు అయ్యాయి. లారీ కారును ఓవర్ టేక్ చేయడంతో కారు బోల్తా కొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. గాయపడ్డ వారు గంగాధరకు చెందిన వారిగా గుర్తించారు. ప్రాణాపాయం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటన స్థలానికి పట్టణ సీఐ కరుణాకర్ చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
జయశంకర్ భూపాలపల్లి జెన్కోలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. ఫకీర్ గడ్డ గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ బుర్ర కొమురయ్య చనిపోయాడు. మరణించిన కొన్ని గంటలకు అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. మరణించిన విషయాన్ని ఆలస్యంగా చెప్పడంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ జెన్కో గేటు ముందు బంధువులు నిరసన తెలుపుతున్నారు.
సన్ బర్న్ కు అనుమతి లేకుండా టిక్కెట్ లు విక్రయిస్తుండటంపై మాదాపూర్ అడిషనల్ డిసిపి నంద్యాల నరసింహారెడ్డి మండిపడ్డారు. అనుమతి తీసుకోని వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పోలీసుల అనుమతి ఉంటేనే ఈవెంట్ నిర్వహించుకోవాలని స్పష్టం చేశారు. ఈవెంట్స్ లో డ్రగ్స్ ను తీసుకువచ్చినా, అనుమతించినా చర్యలు తీసుకుంటామన్నారు. ఈవెంట్ లో మహిళలకు ప్రత్యేక రక్షణ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా సిసి కెమెరాలు కూడా అమర్చుకోవాలని అడిషినల్ డిసిపి సూచించారు. సన్ బర్న్ నిర్వాహకుల గత చరిత్రను కూడా పరిశీలిస్తున్నామన్నారు. నూతన సంవత్సర వేడుకలకు ఇప్పటివరకు 22 మంది అనుమతి కోసం దరఖాస్తు చేశారని. పబ్బులలో అనుమతికి మించి ప్రవేశం లేదని నరసింహారెడ్డి స్పష్టం చేశారు.
జగిత్యాల జిల్లాలో సాయిరాం నగర్ లో పక్క పక్కనే వున్న నాలుగు ఇళ్లలో దొంగతనాలు జరిగాయి. ఇళ్లకు వేసి ఉన్న తాళాలు పగలగొట్టి మరి దుండగులు చోరీకి పాల్పడారు. అందులో ఓ దుకాణం ఉండటం కూడ ఉంది. ఇళ్లలో ఎవరు లేని సమయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారని ఇంటి యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. దీని పై క్లూస్ టీం తో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
నల్గొండ జిల్లా.. నిడమనూరు మండలం వెంపాడ్ స్టేజి వద్ద NH 186 పై ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి చెందారు. పోగమంచు కారణంగా ప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి నడుచుకుంటూ వెళ్తున్న రమావత్ కేశవ్ (19) ని బైక్ తో ఢీ కొట్టిన నాగరాజు (28) ప్రమాదంలో ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. రమావత్ కేశవులును చూడటానికి వస్తున్న కుటుంబ సభ్యుల టాటా ఏస్ ను పార్వతీపురం దగ్గర ట్యాంకర్ ఢీ కొట్టింది. టాటా ఏస్ లో ప్రయాణిస్తున్న ఏడుగురులో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మరోనలుగురి పరిస్థితి విషమం. మృతులు రమావత్ కేశవులు(19), రమావత్ గణ్య(40), నాగరాజు(28), రమావత్ పాండు (40), రమావత్ బుజ్జి(38) మృతులు నీమానాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని మల్లెవాని కుంట తండాకు చెందినవారు. మృతదేహాలు మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Read Also..
బాపట్ల జిల్లా కంకటపాలెం గ్రామంలోని పోలేరమ్మ తల్లి దేవస్థానంలో ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు తాళాలు పగలగొట్టి చోరీ చేశారు. దేవస్థానంలోని హుండీ తో పాటు అమ్మవారి బంగారు, వెండి ఆభరణాలు దొంగతనానికి గురి అయినట్లు ఆలయ పూజారి బాపట్ల శేషగిరిరావు తెలిపారు.
సోమవారం వేకువజామున ఆలయం తెరవడానికి వచ్చిన పూజారి కి తాళాలు పగలగొట్టి ఉండటం తో గ్రామ పెద్దలకు సమాచారం ఇచ్చారు. గ్రామ పెద్దలతో కలిసి పూజారి ఆలయం లోపలికి ప్రవేశించి దొంగతనానికి గురి అయిన వాటిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆలయంలో అమ్మవారి చీరెలు అమ్మగా వచ్చిన 15000 రూపాయలు కూడా హుండీలోనే వేశామని పూజారి చెబుతున్నారు. అమ్మవారి బంగారు కాసుల పేరుతో పాటు కళ్ళు, చెవులు మిగిలిన ఆభరణాలు, ఛటారితో సహా అపహరణ కు గురయ్యాయన్నారు. షుమారు పది లక్షల రూపాయలకు పైగా ఆభరణాల విలువ ఉంటుంది అంటున్నారు. ఆలయంలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలు పనిచేయకపోవడంతో దొంగలను గుర్తించడం పోలీసులకు సవాలుగా ఉంది.
గుడివాడ ఎన్టీఆర్ కాలనీలో మహిళా దారుణ హత్యకు గురైంది. సూర్యనారాయణ అనే వ్యక్తి భార్య రామలక్ష్మిను కత్తితో విచక్షణ రహితంగా పొడిచి చంపాడు. సూర్యనారాయణ ను అడ్డుకోబోయిన రామలక్ష్మి తండ్రి వెంకన్నను గాయపరచడంతో, ఎన్టీఆర్ కాలనీలో కలకలం చోటుచేసుకుంది. గణపవరం చెందిన సూర్యనారాయణతో, రామలక్ష్మికు ఐదేళ్ల క్రితం వివాహమైంది. భర్తతో విభేదాలు కారణంగా నాలుగేళ్ల కుమారుడుతో కలిసి ఎన్టీఆర్ కాలనీలోని పుట్టింట్లో రామలక్ష్మి ఉంటుంది. పెద్ద మనుషుల సమక్షంలో వివాదాన్ని సరిచేసుకుందామని ఆదివారం గుడివాడ రావాల్సిందిగా రామలక్ష్మి కుటుంబ సభ్యులు సూర్యనారాయణకు కబురు పెట్టారు. ఈ క్రమంలో ఇంట్లో పనులు చేసుకుంటున్నా రామలక్ష్మిను, భర్త సూర్యనారాయణ విచక్షణ రహితంగా పొడిచి చంపి పరారయ్యాడు. అల్లుడి చేతిలో రామలక్ష్మి తండ్రి వెంకన్న గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసిన గుడివాడ వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వరంగల్ జిల్లాలో ఆర్టీసీ బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది. రన్నింగ్ లో ఉన్న బస్సు వెనక టైర్లు ఊడిపోయవడంతో బస్సు ఓ పక్కకు ఒరిగి కొంత దూరం వెళ్లింది. ఎదురుగా ఏమీ రాకపోవడం, స్పీడ్ తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో కొంతమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. హుజూరాబాద్నుంచి పల్లెవెలుగు బస్సు హనుమకొండ వెళ్తుండగా ఎల్కతుర్తి శివార్లలో ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. బస్సు వెనక టైర్లు రెండూ ఊడిపోయి పొల్లాలో పడిపోయాయి. అప్రమత్తమైన బస్సు డ్రైవర్ బస్సును నెమ్మదిగా రోడ్డు పక్కన ఆపారు. బస్సు ఓ పక్కకు ఒరగడంతో ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడటంతో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి.
Read Also..
Read Also..