Crime
ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురైన నాగరాజు (28) అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఆదివారం ఉదయం వాల్మీకిపురం లో చోటుచేసుకుంది. మండలంలోని హత్యాపురం గ్రామానికి చెందిన నాగరాజు స్థానిక లైన్మెన్ వద్ద అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. ఆదివారం ఉదయం పట్టణ పొలిమేర లోని శివాలయం వద్ద ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురయ్యాడు. అతని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వరరావు పేట గ్రామానికి చెందిన గడ్డం సత్తయ్య అనే వ్యక్తి ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి పెంకుటిల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో సుమారు నాలుగు లక్షల 50 వేల రూపాయల నగదు, పది తులాల బంగారు నగలు, బట్టలతోపాటు నిత్యావసర వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాద సమయంలో గడ్డం సత్తయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయ పనులకు వెళ్ళాడు. ఇరుగుపొరుగువారు సమాచారం ఇవ్వడంతో ఇంటికి వచ్చి చూసేసరికి ఇల్లు పూర్తిగా దగ్ధమైపోయింది. కాయ కష్టం చేసి వడ్లు అమ్మి ఇంట్లో దాచిపెట్టిన నగదు ఇలా పూర్తిగా కాలిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర మనస్థాపానికి గురి అయ్యారు. ప్రభుత్వము తమను ఆదుకోవాలని వేడుకున్నారు.
గిద్దలూరు మండలం దిగువ మెట్ట అటవీ ప్రాంతంలోని బెల్లం పాక ఏరియాలో కణితిని వేటాడి చంపిన కేసులో ఇద్దరు నిందితులను శనివారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు గుండ్లకమ్మ రేంజ్ ఆఫీసర్ హెచ్. జీవన్ కుమార్ తెలిపారు. దిగువ మెట్ట అటవీ ప్రాంతంలో కణితిని వేటాడి మాంసం తీసుకుని వస్తున్నారని సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు శుక్రవారం వేకువ జామున హౌస్ బ్రిడ్జి సమీపంలో కాపు కాశారు. ఆ సమయంలో మోటార్ బైక్ పై ఇద్దరు వ్యక్తులు మాంసం తీసుకుని వస్తుండగా వారిని పట్టుకుని విచారించారు. వారు ఇద్దరే కాకుండా మరో ముగ్గురు వేటాడినట్లు నిందితులు తెలిపారు. నిందితులు తెలిపిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి వెళ్లి గాలింపు చేపట్టగా అక్కడ ఉన్న ఒక నాటు తుపాకీనీ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ కేసులో దిగువ మెట్టకు చెందిన మీనగా యశ్వంత్, గండు లక్ష్మి లను అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. ఈ దాడిలో దిగువ మెట్ట డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ డి. వంశీకృష్ణ, ఎఫ్ బి ఓ లుడి.చేజర్లయ్య, ఉమాదేవి లు పాల్గొన్నారు.
ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రియుడు మోసం చేశాడంటూ నిరసనకు దిగిన యువతి…. వివరాల్లోకి వెళితే ముస్తాబాద్ మండలానికి చెందిన కొత్తపల్లి దినేష్ అనే యువకుడు సేవాలాల్ తండాకి చెందిన లకావత్ మంజులతో గత ఎనమిది నెలలుగా సహా జీవనం చేసాడు. ఇప్పుడు పెళ్లి చేసుకోమని దినేష్ ని అడగడంతో నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని తన రూమ్ లో నుండి మంజులని బలవంతంగా గేంటేసాడు. దీనితో తప్పనిసరి పరిస్థితిలో రోడ్డెక్కిన యువతి. అయితే ఈ యువతికి గతంలోనే వేరే వ్యక్తితో వివాహం అయ్యింది. మాయ మాటలు చెప్పి యువతిని లోబర్చుకున్న దినేష్ అవసరం తిరగానే వదిలించుకోవాలి అని ప్రయత్నిస్తున్నట్లు మంజుల ఆరోపిస్తుంది.
ములుగు జిల్లా కేంద్రంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరిని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ములుగు మండలం చింతలపల్లికి చెందిన మామిడిపెల్లి భిక్షపతి, ఎనగందుల నరేశ్ గా గుర్తించారు. ములుగు బస్టాండ్ వద్ద ద్విచక్ర వాహనం పై యూ టర్న్ తీసుకుంటుండగా ఏటూరు నాగారం వైపు వెళ్తున్న ఇసుక లారి బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భిక్షపతి అక్కడికక్కడే మృతి చెందగా, నరేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన నరేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీయంకి తరలించారు.
కడియం మండలం మురమండలో జరిగిన ట్రాక్టర్ చోరీ కేసులో నలుగురు ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుండి కొంతమేర చోరీ సొత్తును స్వాధీన పరచుకున్నట్లు కడియం సిఐ తిలక్, ఎస్సై మహమ్మద్ హస్పక్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పోలీస్ స్టేషన్లో వారు వివరాలను వెల్లడిస్తూ గత నెల 4వ తేదీన మురమండ గ్రామంలో గన్ని రామారావు తన కౌలు పొలం వద్ద ఉంచిన ట్రాక్టర్ ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించిపోయారని, ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, దీనిపై తన సిబ్బందితో ప్రత్యేక నిఘ ఏర్పాటు చేయగా, ఈనెల 22వ తేదీన మురమండలో అనుమానస్పదంగా సంచరిస్తున్న పోతశెట్టి విజయ రెడ్డి, పోతంశెట్టి సూర్య భాస్కర్ రెడ్డి, పోతంశెట్టి సాయి రామ రెడ్డి, పోసి శేఖర్ లను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా ట్రాక్టర్‌ను తామే దొంగిలించినట్లు నేరం ఒప్పుకున్నారని తెలిపారు. అలాగే ఈ నేరంతో పాటు ఆగస్టు 31వ తేదీన కుతుకులూరు గ్రామానికి చెందిన మరొక ట్రాక్టర్‌ను, పెనుమట్ర మండలం జుట్టుగ గ్రామంలో ట్రక్కుతో ఉన్న మరో ట్రాక్టర్‌ను దొంగిలించినట్లు ముద్దాయి ఒప్పుకున్నట్లు తెలిపారు. అలాగే గత నెలలో లొల్ల, కేశవరం, చిన ద్వారపూడి గ్రామాల్లో గల పొలాల కల్లాల వద్ద ఉంచిన 50 ధాన్యం బస్తాలను దొంగిలించి వాటిని ఓ రైస్ మిల్లులో అమ్మినట్లు, అలాగే అదే నెలలో అనపర్తి మండలం అత్తమూరులో రోడ్డు ప్రక్కన ఉంచిన మూడు ట్రాక్టర్ ఐరన్ వీల్స్ ను దొంగిలించినట్లు ముద్దాయిలు తెలిపారని, దొంగలించిన వీటిలో రెండు ట్రాక్టర్ ట్రక్కులను 40 వేలు, 46 వేలకు పాత ఇనుప సామాను వ్యాపారికి విక్రయించినట్లు ముద్దాయిలు తెలిపారని, వాటిలో రెండు ట్రాక్టర్లను, ఐరన్ వీల్స్ ను, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనపరచుకుని నలుగురు ముద్దాయిలపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఈ కేసును చాకచక్యంగా దర్యాప్తు చేసిన సిఐ తిలక్, ఎస్ఐ మహమ్మద్ హస్పక్, కడియం పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కొత్తపేట గ్రామానికి చెందిన ముప్పాళ్ళ మరయదాసు (38) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు కృష్ణా నదిలో కాలుజరిపడిపోవడంతో మృతి చెందాడు. పశువులు కాయటానికి వెళ్లి కృష్ణానది దాటుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారిపడి మృత్యువాతపడ్డారు. స్థానికుల అందించిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న కంచికచర్ల పోలీసులు గాలింపు చర్యలు, ముమ్మరం చసి మృతదేహం వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు, ట్రాక్టర్ ఢీకొని నలుగురు మృతి చెందారు. గార్లదిన్నె మండలం కల్లూరు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. బియ్యం లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ ను ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు డ్రైవర్, మరో వ్యక్తికి గాయాలు అయ్యాయి. వారిలో నరేష్ పరిస్థితి విషమంగా ఉండగా అనంతపురం ఆస్పత్రికి తరలించారు. మృతులను గుత్తి మండలం మామిడూరుకు చెందిన చిన్న తిప్పయ్య(45), శ్రీరాములు(45), నాగార్జున (30), శ్రీనివాసులు(30) గా పోలీసులు గుర్తించారు.
ర్యాగింగ్ కు పాల్పడుతున్నారన్న కారణంతో 81 మంది విద్యార్థినుల పై సస్పెన్షన్ వేటు. సస్పెన్సన్ కు గురైన వారిలో పీజీ , కామర్స్, ఎకనామిక్స్ , జువాలజీ సెకండ్ ఇయర్ విద్యార్థినులు. జూనియర్లను కొంతకాలంగా ర్యాగింగ్ చేస్తూ ఇబ్బంది పెడుతున్న సీనియర్ విద్యార్థినిలు. వర్సిటీ అధికారులకు ఫిర్యాదు. విచారణ జరిపిన అనంతరం ర్యాగింగ్ నిజమేనని నిర్థారించి 81 మంది విద్యార్థులను సస్పెండ్ చేసిన వర్సిటీ అధికారులు. వారం రోజుల పాటు సస్పెన్షన్ వేటు.