Crime
చిత్తూరు… యాదమరిలో ఉద్రిక్తత విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి విద్యార్థి బలి, రెండు రోజులు కావస్తున్నా పట్టించుకోని అధికారులు, విద్యార్థి మృతదేహంతో యాదమరి- పరదరామి రోడ్డుపై ధర్నాకు గ్రామస్తులు దిగారు. గ్రామస్తులకు మద్దతుగా ధర్నాలో పూతలపట్టు టిడిపి ఇన్చార్జి మురళీ మోహన్ పాల్గొన్నారు.
భారీగా ట్రాఫిక్ స్తంభించింది. మృతుడు అభి కుటుంబానికి న్యాయం జరిగే వరకు ధర్నా విరమించబోమంటున్న గ్రామస్తులు, భారీగా చేరుకుంటున్న పోలీసులు.
ధర్నా స్థలం వద్దకు చేరుకుంటున్న ఇతర గ్రామాల ప్రజలు, ప్రజా సంఘాలు. 11kv విద్యత్ లైన్ తగిలి ఇంటర్ చదువుతున్న దళిత యువకుడు మృతి
చెందాడు. విద్యుత్ లైన్లు సరిచేయమని ఏడాదిగా విన్నవించుకుంటున్నా పట్టించుకోని విద్యుత్ అధికారులు, ఘటన జరిన వెంటనే వైర్లు మాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు.
తిరుపతి జిల్లాలో కారు – స్కూటీని ఢీ కొనడంతో ఒక వ్యక్తి మరణించాడు. నాయుడుపేట జాతీయ రహదారి మల్లం కూడలి వద్ద కారు – స్కూటీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మాల ప్రాంతానికి చెందిన నాగరాజు మృతి చెందాడు. నాగరాజు స్కూటీపై రోడ్డు దాటుతున్న క్రమంలో నెల్లూరు వైపు నుంచి చెన్నైకి వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీ కొంది. ఈ ప్రమాదంలో నాగరాజు అక్కడికక్కడే మరణించారు. కారు స్కూటీని ఈడ్చుకుంటూ వెళ్లడంతో మంటలు చెలరేగి స్కూటీ పూర్తిగా దగ్ధమైంది.
Read Also..
Read Also..
నంద్యాల జిల్లాలో వృద్ధురాలిని దారుణంగా హత్య చేశారు. నంద్యాల హౌసింగ్ బోర్డు కాలనీలో 50 సంవత్సరాల వృద్ధురాలు గ్లాడిన్ నివాసముంటోంది. ఎప్పటి మాదిరిగానే ఉదయం పనిమనిషి గ్లాడిన్ ఇంటికి వెళ్లి ఎంతసేపు పిలిచినా పలక పోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని తలుపు పగులకొట్టి చూడగా, వృద్ధురాలు తలపై తీవ్రగాయాలతో చనిపోయి కనిపించింది. వెంటనే క్లూస్ టీం సాయంతో విచారణ చేపట్టారు. మృతురాలి ఇద్దరు కుమార్తెలకు వివాహమై హైదరాబాద్ లో ఉంటున్నారు. అనారోగ్యం కారణంగా సంవత్సరం క్రితం వృద్ధురాలి భర్త మరణించారు. నిన్న రాత్రి 8 గంటల వరకు పనిమనిషి గ్లాడిన్ ఇంట్లోనే ఉన్నారు. మరి ఉదయం లోపు గ్లాడిన్ ను ఎవరు హత్యా చేశారనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
NTR జిల్లా జగ్గయ్యపేట నియోజక వర్గం జాతీయ రహదారి 65 మీద హైదరాబాదు నుండి విజయవాడ వైపు ప్రయానిస్తున్న కారు, ముళ్ళపాడు ప్లే ఓవర్ బ్రిడ్జి వద్ద అదుపు తప్పి, హైవే మీద డివైడర్ ఎలక్ట్రికల్ పోల్ కు ఢీకొంది. ప్రమాద ఘటన లో కారు లోని యువతి మృతి చెందింది. కారు ఎలక్ట్రికల్ పోల్ ను ఢీ కొట్టడం తో మంటలు వ్యాపించాయి. క్షతగాత్రులను నందిగామ ఆస్పత్రికి తరలించారు.
హైదరాబాద్ పంజాగుట్టలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎర్రమంజిల్ సమీపంలో ఓ భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భవనం నాలుగో అంతస్తులో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రాణాలతో భయంతో స్థానికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్లతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తోంది.
పల్నాడు జిల్లా నరసరావుపేటలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక రామిరెడ్డిపేటలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన నవవధువు చల్లా శిల్ప(19), నవ వధువు శిల్ప చిత్తూరు జిల్లా, డెక్కలి మండలం వెమ్ములూరు గ్రామం.. భర్త వెంకటేష్ ది నెల్లూరు జిల్లా వెంకటగిరి, వెంకటేష్ కి నరసరావుపేటలో ఉద్యోగ రీత్యా భార్యాభర్తలు ఉంటున్నారు. మృతురాలి బావ శంకరయ్య మాట్లాడుతూ.. శిల్పాకి రెండు నెలల క్రితమే వివాహం జరిగింది అని అన్నారు. పెళ్లైన ఐదు రోజులకే నరసరావుపేటకి వచ్చింది అని, పెళ్లైన కొన్ని రోజులకే నాకు శిల్ప భర్త వెంకటేష్ ఫోన్ చేసి, మీ అమ్మాయి వేరే వ్యక్తితో మాట్లాడుతుందని, ఆమే ప్రవర్తన నాకు నచ్చడం లేదని, మీరు వచ్చి మీ అమ్మాయిని తీసుకెళ్ళండి అని అన్నాడు. నిన్న సాయంత్రం ఐదు గంటలకు శిల్ప భర్త వెంకటేష్ ఫోన్ చేసి, మీ అమ్మాయి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది అని చెప్పారు అన్నారు. ఇంత లొనే ఎం జరిగిందో అర్థం కావడం లేదని, మాకు భర్త వెంకటేష్ మీదే అనుమానం కలుగుతోందని ఆరోపణ చేశారు. పోలీసులు కేసుని సమగ్రంగా దర్యాప్తు చేయాలని కోరారు.
హనుమకొండ, ఎల్కతుర్తి మండలం శాంతి నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఎదురెదురుగా ఢీకున్న కారు ఇసుక లారి. కారులో ప్రయాణిస్తున్న ఏటూరునాగరంకు చెందిన నలుగురు మృతి. ముగ్గురికి తీవ్ర గాయాలు పరిస్థితి విషమం. అన్నదమ్ముల కుటుంబాలు ఏటూరునాగారం నుంచి వేములవాడ దైవదర్శనానికి వెళుతుండగా ప్రమాదం. మృతులు మంతెన కాంతయ్య (72), మంతెన శంకర్(60), మంతెన భారత్ (29), మంతెన చందన(16). గాయపడ్డ మంతెన రేణుక, భార్గవ్, శ్రీదేవి లను చికిత్స కోసం ఎంజీఎం హస్పత్రికి తరలింపు. మృత దేహాలు ఎంజీఎం మార్చురీకి తరలింపు.
తూర్పుగోదావరి జిల్లా, నల్లజర్ల లో భారీ అగ్నిప్రమాదం. పోలీస్ స్టేషన్ కు అతి సమీపంలో ఉన్న పదిహేను ఇళ్లను చుట్టుముట్టిన మంటలు. గ్యాస్ సిలెండర్ లు పేలడంతో సంభవించిన అగ్ని ప్రమాదం. తెల్లవారుజామున 3 గంటలకు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో నిద్రమత్తులో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడి పరుగులు తీసిన వైనం. సంఘటన స్థలానికి చేరుకున్న మూడు ఫైరింఇంజిన్లు. స్థానిక ప్రజలను దగ్గరలో ఉన్న SRK కళాశాలకు తరలింపు. లక్షలాది రూపాయలు ఆస్తి నష్టం. 15 ఏళ్ళు ఒక్కసారిగా మంటలలో దగ్ధం కావడంతో నిరాశ్రయులైన బాధితులు.
ఈనెల 15న చిగురువాడ వైయస్సార్ కాలనీలో గోవింద్ అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రేమికులు..ఇరువురికి అడ్డుగా ఉన్న భర్త గోవిందును పథకం ప్రకారం హత్య ప్రియుడితో కలిసి హత్య చేశారు. అనుమానాస్పదన మృతి గాఆనాడు కేసు నమోదు చేసాం. పోలీసుల విచారణలో సోంపల్లి మానస, పలాసి సింహాద్రి ఇరువురు గొంతు నులిని హత్య చేసినట్లు వెల్లడికావడంతో హత్యా నేరం నమోదు చేశారు. మూడు సంవత్సరాల నుండి ప్రేమికులుగా ఉన్న వీరు ప్రేమను వదులుకోలేక, పెద్దలు కుదిర్చిన పెళ్లి కావడంతో దాదాపు నాలుగు నెలల పాటు కాలయాపన చేసారు. తిరుపతి రూరల్ పరిధిలోని రేణిగుంట – చంద్రగిరి 150 బైపాస్ రోడ్డులో తచ్చాడుతుండగా అరెస్టు చేసాం. ఇరువురి పై హత్యా నేరం కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నాం. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ యశ్వంత్ వెల్లడించారు.
Read Also..