మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్లారెడ్డి గూడా లో శివ (29) అనే యువకుడు ఆత్మహత్య కు పాల్పడ్డాడు. ఈస్ట్ గోదావరి కి చెందిన శివ.. తల్లిదండ్రులతో కలిసి ఎల్లారెడ్డి గూడా లో నివాసం ఉంటున్నారు. పలు లోన్ యాప్స్ లో లోన్ లు తీసుకున్న శివ, తల్లిదండ్రులు లేని సమయంలో గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గాంధీ మార్చురికి శివ మృతదేహం తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
Crime
ఉన్నత వైద్య విద్యను అభ్యసించడానికి అమెరికా వెళ్లిన ఓ యువతి ఆశలు ఆవిరయ్యాయి. కారులో ప్రయాణిస్తూ గ్యాస్ లీక్ అయి మృత్యువాత పడ్డారు. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడుకు చెందిన షేక్ జహీరా నాజ్ ఫిజియోథెరపీ డిగ్రీ పూర్తి చేశారు. ఎంఎస్ చేయడానికి ఈ ఏడాది ఆగస్టులో అమెరికాలోని షికాగోకు వెళ్లారు. అయితే ఆమె బుధవారం కారులో ప్రయాణిస్తుండగా గ్యాస్ లీక్ అయ్యింది. దీంతో కారు డ్రైవర్‌తో పాటు జహీరా నాజ్ స్పృహ తప్పారు. గమనించిన కొందరు వెంటనే వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఉన్నత చదువులు చదవడానికి అమెరికా వెళ్లిన తమ కూతురు అర్ధాంతరంగా ఇలా చనిపోతుందని ఊహించలేకపోయామంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. జహీరా నాజ్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సాయం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
Read Also..
Read Also..
ఏలూరు జిల్లా కైకలూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పి కొల్లేటిలోకి పల్టీ కొట్టింది ఏలూరు డిపోకి చెందిన APS RTC పల్లె వెలుగు బస్సు. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. సుమారు 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం అందింది. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బస్సు అద్దాలు పగలగొట్టి రక్షిస్తున్నారు స్థానికులు.
పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గోదావరి వంతెన పైనుండి భార్యాభర్తలు దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నిన్న సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. భార్యాభర్తలు గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటాన్ని స్థానిక మత్స్యకారులు గమనించి భర్తను రక్షించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, జాలర్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈరోజు ఉదయం భార్య మృతదేహం లభ్యమైంది. ఈనెల 16వ తేదీన ఇరువురికి వివాహమైందని అయితే పెళ్లైన నాలుగు రోజులకే ఈ ఘటన చోటు చేసుకోవడంతో.. ఇరువురి కుటుంబాల్లో విషాదం నెలకొన్నది. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దుగ్గిరాల మండలం వీర్లపాలెంలో రైతు ఆత్మహత్య. గడ్డి మందు తాగి రైతు కిశోర్‌బాబు(48) ఆత్మహత్య. తుపాను వల్ల ఐదెకరాల మినుము పంట నష్టపోయిన కిశోర్. అప్పుల బాధతో నిన్న రైతు కిశోర్‌బాబు ఆత్మహత్యాయత్నం. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందిన కిశోర్. రైతులు, రైతుకూలీల ఆత్మహత్యల ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర (3,927 బలవన్మరణాలు) మొదటి స్థానంలో ఉంది. ఈ జాబితాలతో 628 ఆత్మహత్యలతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో, 499 ఆత్మహత్యలతో తెలంగాణ నాలుగో స్థానంలో ఉన్నాయి.
జల్సాలకు అలవాటు పడి ఈజీమనీనే లక్ష్యంగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు కేటుగాళ్లను పేట్ బాషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. మేడ్చల్ డిసిపి శభరీష్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా, మనోహరబాద్ కి చెందిన మహేష్(23), అమీర్(29), రాజు(27) బాల్య స్నేహితులు. ఈజీమనీకి అలవాటు పడి దొంగతనాలే ప్రవృత్తిగా పేట్ బాషీరాబాద్, జీడిమెట్ల, అల్వాల్, మేడ్చల్, జిన్నారం, శంకరంపేట్ పోలీస్ స్టేషన్ లలో బైక్ దొంగతనాలకు పాల్పడుతూ ఈ రోజు తెల్లవారుజామున ఈ దుండగులు పేట్ బాషీరాబాద్ పోలీసులకు చిక్కారు. వీరిపై ఇప్పటికే 16 కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వారి నుండి 17బైక్ లను సీజ్ చేసి నిందితులను పేట్ బాషీరాబాద్ పోలీసులు, మేడ్చల్ డీసీపీ శభరీష్ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పట్టుకున్న బైక్ ల విలువ 8.5లక్షలు ఉన్నట్టు మేడ్చల్ డిసిపి మీడియాకు తెలిపారు. నిందితులు దొంగిలించి మార్కెట్ లో అమ్మిన బైక్ లను కుడా స్వాధీనం చేసుకుంటామని, దొంగతనాలకు గురైన బైక్ లను కొన్న వారిపై కుడా కేసులు పెడుతామన్నారు.
కె.వి పల్లి మండలం జిల్లెల మంద పంచాయతీ బసన్న గారి పల్లి వాసి చిన్న సిద్దయ్య సన్నాఫ్ లేట్ వెంకటస్వామి వయసు 50 సంవత్సరాలు అనబడే వ్యక్తి కె.వి పల్లి మండలం గుండ్రేవారిపల్లి నుంచి వస్తున్న సమయంలో కారు అతివేగంగా ద్విచక్ర వాహనం ని ఢీకొనడంతో చిన్న సిద్దయ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు వ్యక్తిని ఢీకొట్టిన కారు బావిలో బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. కె.వి పల్లి మండలం పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
పెద్దపెల్లి కేంద్రంలో స్థానిక రంగంపల్లి వద్ద రుచి గ్రాండ్ హోటల్ ఈ రోజు తెల్లవారుజామున సుమారు మూడు గంటల నుంచి నాలుగు గంటల సమయంలో దాసరి ప్రేమ్ కుమార్ అనే వ్యక్తిపై కత్తితో హత్యాయత్నం దాడి జరిగింది. ఈ సంఘటనతో పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో ఒక్కసారి కలకాలం రేపుతుంది ప్రేమ్ కుమార్ గోదావరి ఖని ప్రాంతానికి చెందినవాడిగా తెలుస్తుంది. ఈ సంఘటన తెలిసిన వెంటనే 108 కి సంబంధించిన సమాచారం అందడంతో సంఘటన చేరుకొని అపస్మారక స్థితిలో ఉన్న బాధితులని పోలీసుల సహకారంతో హుటాహుటిన పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో, మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలవాలి తెలియాల్సి ఉందన్ని పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ పాతబస్తీలో దారుణ హత్య జరిగింది. ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామచంద్రనగర్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి తారిక్ అలీ అలియాస్ బాబా ఖాన్ ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. నిన్న అర్ధరాత్రి సమయంలో ఇంటి బయట కూర్చున్న బాబా ఖాన్ పై దాడి చేసి విచక్షణా రహితంగా పలుచోట్ల కత్తులతో పొడిచారు. దీంతో బాబా ఖాన్ కు తీవ్ర రక్తస్రావమై సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆ వ్యక్తిని చూసి స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు.