Saturday, September 12, 2026
News Navigation
Saturday, September 12, 2026
News Navigation

Breaking

Saturday, September 12, 2026
Home Andhra PradeshEast Godavari కలకలం రేపుతున్న క్షుద్ర పూజలు..

కలకలం రేపుతున్న క్షుద్ర పూజలు..

by Rama
Kshudra pujalu

కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో క్షుద్ర పూజలు కలకలంరేపాయి. గ్రామంలోని ఓ ఇంటి ముందు ముగ్గువేసి పసుపు, కుంకుమ, ఎండుమిర్చిలతో పూజలు చేశారంటూ వదంతులు వ్యాపించాయి. సమాచారం తెల్సుకున్న పెద్దాపురం ఎస్ఐ సురేష్ గ్రామానికి వెళ్ళి విచారణ చేపట్టారు. గ్రామస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చి వదంతులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే రాత్రులు ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు గ్రామస్తులు భయపడుతున్నారు. రాత్రి వేళల్లో గుర్తు తెలియని వ్యక్తి వింత శబ్దాలు చేస్తూ గ్రామంలో తిరుగుతున్నాడని ప్రచారం జరగడంతో గ్రామంలో పోలీసులు, గ్రామ యువకులు పహారా కాస్తున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: