కొత్తగా హైదరాబాద్ వచ్చిన వాళ్లందరూ చూడాలనుకునే ప్రముఖ పుణ్యక్షేత్రం చిలుకూరు బాలాజీ టెంపుల్. తెలంగాణ తిరుమలగా ప్రత్యేక గుర్తింపు ఉన్న ఈ ఆలయాన్ని దర్శించుకుని మనసులో స్వామివారిని కోరికలు కోరుకుంటే కచ్చితంగా నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అందుకే ప్రతి రోజూ వేలాది మంది చిలుకూరు దర్శనానికి వస్తుంటారు. ఒక్క హైదరాబాద్ మాత్రమే కాదు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. సెలవు రోజులైతే ఇసుకేస్తే రాలనంత జనం కనిపిస్తారు. అయితే ఎందుకు ఇంత మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు? ఈ ఆలయం చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలయం చరిత్ర:
చిలుకూరి బాలాజీ ఆలయానికి 500 ఏళ్ల చరిత్ర ఉంది. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి పరమభక్తుడైన గున్నాల మాధవరెడ్డి చిలుకూరులో ఉండేవారు. ఆయన ప్రతి సంవత్సరం ఎంత కష్టమైనా కానీ కాలినడకన తిరుపతి వెళ్లి స్వామివారిని దర్శించుకునేవారు. వయసు పైబడినాగానీ కాలినడకన వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం మాత్రం ఆపలేదు. అలా ఒకసారి మాధవరెడ్డి తిరుమలకు కాలినడకన వెళ్తుండగా మార్గం మధ్యలో అలసిపోయి సొమ్మసిల్లి పడిపోయారు. ఆ మగత నిద్రలో వచ్చిన కలలో మాధవరెడ్డికి స్వామివారు ప్రత్యక్షమయ్యారు. మాధవా ఇకపై నువ్వు నా దర్శనం కోసం ఇంతదూరం ప్రయాసపడి కాలినడకన రావాల్సిన అవసరం లేదు. నేను చిలుకూరిలోని ఒక పుట్టలో కొలువై ఉన్నా. వెలికి తీసి గుడి నిర్మించమని చెప్పి మాయమయ్యాడట. నిద్ర నుంచి మేలుకున్న మాధవరెడ్డి చిలుకూరు చేరుకుని ఇదే విషయాన్ని గ్రామస్థులకు చెప్పాడు. దీంతో అందరూ కలిసి పుట్ట వద్దకు వచ్చి గునపాలతో పెకిలించారు. అయితే పుట్టలో ఉన్న బాలాజీ విగ్రహం ఎదభాగంలో గునపం తగిలి రక్తం వచ్చింది. అలా దొరికిన బాలాజీకి గ్రామస్తులు అక్కడే ఆలయాన్ని నిర్మించి పూజలు చేయడం ప్రారంభించారు. ఆలయంలో కొలువైన బాలాజీ విగ్రహం ఎదభాగంలో గునపం గుచ్చుకున్న ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తాయి. అయితే చిలుకూరి బాలాజీ దేవాలయంలో 1963లో రాజ్యలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించారు.
Devotional
పూర్వం పరశురాముడు తన తండ్రి ఆజ్ఞమేరకు తల్లినే సంహరిస్తాడు. అయితే తీవ్ర బాధతో కుంగిపోతున్న పరశురాముడు తిరిగి తన తండ్రి ఇచ్చిన వరంతో తల్లిని బ్రతికించుకుంటాడు. కానీ తల్లిని చంపినందుకు తీవ్ర అవమానభారంతో బాధపడుతూ ప్రాయశ్చితం చేయడంకోసం ఋషులు దగ్గరకు వెళతాడు. అతగాడు ఋషులు ఇచ్చిన సలహాను అనుసరించి శివుణ్ని ఆరాధించడానికి బయలుదేరుతాడు. అలా ప్రయాణిస్తున్న తన మార్గంలోనే ఒక అడవి మధ్యలో ఈ శివలింగాన్ని దర్శించాడు. అలా దర్శించుకున్న అతను ఈ ప్రాంతంలోనే ఒక సరోవరాన్ని నిర్మించుకుని దాని ఒడ్డునే తపస్సు చేయడం ప్రారంభించాడు. ఆ సరోవరంలో రోజుకు ఒక్క పుష్పం మాత్రమే పూసేది. దానిని తీసుకుని శంకరునికి పూజాసమయంలో పరశురాముడు సమర్పించేవాడు. ఆ పుష్పాన్ని అడవి జంతువులనుంచి కాపాడుకోవడానికి చిత్రసేనుడనే ఒక యక్షుడిని కాపలాగా నియమించాడు. దానికి బదులుగా ప్రతిరోజు ఒక జంతువును, కొంత పానీయాన్ని ఇవ్వడానికి పరశురాముడు ఆ యక్షునితో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఆలయ వివరాలు :
చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి మండలంలో ఒక చారిత్రాత్మకంగా ప్రాముఖ్యం చెందిన ఒక ఏర్పేడు గ్రామం వుంది. ఈ గ్రామంలో పూర్వం ఆంధ్రశాతవాహనుల కాలంనాటి పురాతన శివాలయం వుంది. పురాతన శాసనాల ప్రకారం ఈ ఆలయం క్రీ.శ. 2వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. క్రీ.శ. 1973లో జరిపిన తవ్వకాలలో బయటపడిన ఈ ఆలయాన్ని జాతీయసంపదగా గుర్తించారు. ఈ దేవాలయాన్ని కొంతకాలం వరకు చంద్రగిరి రాజులు ఉచ్ఛస్థితిలో నిలిపారు. ఆ తరువాతి కాలంలో ముస్లిం పాలకులు ఆ చంద్రగిరిరాజుల సంస్థానంతోపాటు ఈ దేవాలయాన్ని కూడా చాలావరకు ధ్వంసం చేశారు. అయితే మూలవిరాట్ స్వామికి మాత్రం ఎటువంటి హాని కలుగలేదు. ఈ ఆలయ గర్భాలయంలో ప్రతిష్టించబడిన శివలింగం లింగరూపంలో కాకుండా మానవరూపంలో మహావీరుడైన వేటగాని రూపంలో శివుడు కొలువై వున్నాడు. లింగం సుమారుగా ఐదు అడుగుల పొడవు, ఒక అడుగు వెడల్పు వుంటుంది. ఈ ఆలయం పశ్చామాభిముఖంగా వుంటుంది. తవ్వకాల్లో లభించిన కొన్ని ఆధారాల ప్రకారం 12వ శతాబ్దలో విక్రమచోళుడి కాలంలో ఈ ఆలయం పునర్మించబడిందని తెలుస్తోంది. చోళుల తర్వాత పల్లవులు కొంతకాలం వరకు ఈ ఆలయానికి నిర్వహణ కార్యక్రమాలు చేపట్టారు. అయితే ఈ ఆలయంలోని లింగాలను ఎవరు, ఎప్పుడు, ఎలా నిర్మించారోనన్న ఆధారాలు, సమాచారం తెలియరాలేదు. ఈ ఆలయంలో వున్న లింగాకారం మరే ఆలయంలో లేనివిధంగా పురుషాంగాన్ని పోలి వుంటుంది. దానిమీద రాక్షసుడి భుజాలపై నిలబడిన శివమూర్తి వుంటుంది. చోళ శాసనాల్లో ఈ ప్రాంతాన్ని తిరువిప్పరమ్ బేడు, పల్లవుల కాలంలో గుడిపల్లంగా పిలవబడింది. కాలక్రమంలో రానురాను అది గుడిమల్లంగా మారి.. ఆలయం చుట్టూ ఒక చిన్న గ్రామం ఏర్పడిపోయింది.
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి తరలివచ్చే భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భక్తులకు మరిన్ని మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదికను రూపొందించేందుకు సమాయత్తం అవుతోంది. కొన్ని సౌకర్యాల విషయంలో భక్తుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అధ్యయనం చేయించాలంటూ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వద్దకు ప్రతిపాదనలు అందాయి. త్వరలో మంత్రి ఆలయాన్ని సందర్శించాలని నిర్ణయించినట్లు సమాచారం. అనంతరం అధ్యయనానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సదుపాయాలపై భక్తుల నుంచి స్పందన ను ఏవిధంగా తీసుకుందామన్న అంశంపై అధికారులు మేదోమథనం చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో అక్కడక్కడా కియోస్క్‌లను ఏర్పాటు చేయడమా? ఆన్లైన్ ద్వారా స్పందనను నమోదు చేయడమా? అన్న అంశాలపై త్వరలో స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. ఆన్లైన్ ద్వారా భక్తుల స్పందనను తెలుసుకునే విధానం ఇప్పటివరకు లేదు. ఈ విధానాన్ని అమలుచేస్తే ఎలా ఉంటుందన్న అంశంపై అధికారులు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.
ఆసియా ఖండంలో అంత్యంత ఎత్తైన అద్భుతమైన శివాలయం. నిర్మాణానికే 39 ఏళ్లు పట్టిందట. ఈ మందిరం శిల్పకళా నైపుణ్యం ముందు తాజ్ మహల్ కూడా పనికిరాదంటారంతా ఆ విశేషాలు చూద్దాం. హిమాచల్ ప్రదేశ్ సోలాన్ జిల్లా జటోలి టౌన్ లో ఉన్న శివాలయం ఇది. దాదాపు నలభైఏళ్ల కష్టం ఈ అద్భుతమైన దేవాలయం. హిమాచల్ ప్రదేశ్ పర్యాటక ప్రదేశాల్లో ఇది అత్యంత ఆకర్షించే శివాలయం. శివుడికి జటల నుంచి వచ్చి పేరే జటోలి. ఈ ఆలయం గురించి వినిపిస్తున్న కథనాలు పురాణాల ప్రకారం శివుడు ఇక్కడకు వచ్చి కొంతకాలం ఉన్నాడట. ఆ తర్వాత స్వామి కృష్ణానంద్ ఇక్కడకు వచ్చి తపస్సు చేశారనీ ప్రతీతి. బాబా పరమహంస మార్గదర్శకత్వంతో జటోలి శివాలయ నిర్మాణం ప్రారంభమైనట్లు చెబుతారు. ఆలయ నిర్మాణంలో ఎన్నో అద్భుతాలు ఆలయ గోపురం దాదాపు 111 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే సుమారు 100 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ద్రవిడ శైలిలో మూడు వరుస పిరమిడ్లతో నిర్మించారు. మొదటి పిరమిడ్‌లో , రెండవ పిరమిడ్ లో శేష్ గాన్ శిల్పం, వినాయకుడి విగ్రహం ఉంటుంది. ఆలయం లోపల, ప్రాంగణంలో వివిధ దేవతల విగ్రహాలు ఏర్పాటు చేశారు. లోపల స్పటిక మణి శివలింగను స్థాపించడంతో పాటు శివ, పార్వతి విగ్రహాలు కూడా ప్రతిష్టించారు. ఆలయం ఎగువ బాగంలో 11 అడుగుల ఎత్తైన బంగారు మండపాలు నిర్మించారు. ఈ దేవాలయం ఈశాన్య భాగంలో ‘జల్ కుండ్’ అని పిలిచే వాటర్ ట్యాంక్ ఉంది, ఇది పవిత్రమైన గంగా నదిగా భక్తులు భావిస్తారు. ఈ ట్యాంక్ లో నీరు చర్మ రుగ్మతలను పోగొట్టడానికి చికిత్స చేసే కొన్ని ఔషద లక్షణాలను కలిగి ఉండటం విశేషం. అప్పట్లో ఇక్కడ ప్రజలు నీటి సమస్యతో జీవిస్తుండేవారు. అదే సమయంలో స్వామి కృష్ణానంద శివుడిని ప్రార్థించి వర్షం కురిసేలా చేశారని అప్పటి నుంచీ ఈ ప్రదేశంలో నీటి కొరతనేది లేదని చెబుతారు. ఇక్కడ ఉండే గుహలో శివుడు తపస్పు చేశాడని పురాణలు చెబుతున్నాయి. మహాశివరాత్రి ఉత్సవాలు ఈ పురాతన ఆలయంలో ఏటా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు స్థానికులు మాత్రమే కాదు, చుట్టు ప్రక్కల ప్రదేశాల నుంచి కూడా భారీగా భక్తులు తరలి వస్తుంటారు.
ఆలయ వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో శాస్త్రోక్తముగా శ్రీ స్వామివారికి 108 బంగారు సంపెంగలతో శోభాయ మానంగా స్వర్ణపుష్పార్చన జరిపించినట్లు ఈవో శ్రీనివాసమూర్తి తెలియజేశారు. ఉదయం స్వామివారికి స్వర్ణపుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వర్ణపుష్పార్చన అత్యంత వైభవంగా, సింహాచల పుణ్య క్షేత్రములో దేవస్థాన వేదపండితుల వేదమంత్రాల, నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణపుష్పార్చన వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువ జామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రాతఃకాల పూజలు సాంప్రదాయ బద్దంగా నిర్వహించారు. శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ గోవింద రాజు స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కల్యాణ మండపములో వేదికపై అధీష్టింపజేసి వేద మంత్రాలు నాధ స్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి వారి స్వర్ణపుష్పార్చన, సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామి వారి ఆర్జిత సేవలలో పాల్గొని తరించారు.
భారత దేశంలో తొండం లేని వినాయకుడి ఆలయం ఆరావళి పర్వతం మీద ఉంది. 18వ శతాబ్దంలో రాజస్థాన్‌లోని జైపూర్ స్థాపన కోసం సవాయి జై సింగ్ గుజరాత్ నుంచి పండితులను ఇక్కడికి పిలిపించి ఆలయాన్ని స్థాపించారు. వినాయకుడి ఆశీర్వాదం జైపూర్పై ఉండేలా గణేశుడి విగ్రహాన్ని ఉత్తర దిశలో ప్రతిష్టించారు. ఈ ఆలయం ‘గర్ గణేష్’ పేరుతో ప్రసిద్ధి చెందింది. 500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవాలంటే 365 మెట్లు ఎక్కాలి.
జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. మేడారం జాతర సమీపిస్తున్న నేపథ్యంలో… దీనికి తోడు శనివారం కావటంతో రాష్ర్ట నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావటంతో వేకువజాము నుండి ఆలయం కిక్కిరిసిపోయింది. క్యూలైన్లు నిండి వెలుపల వరకు బారులు తీరారు. స్వామి వారి దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. వందలాది వాహనాలతో ఘాటు రోడ్డు, ఆలయ పరిసరాలు నిండిపోయాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా పోలీసులు వన్ వే ఏర్పాటు చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం శ్రీ ఆదికేశవ ఎంబర్ మన్నారు ఆలయ అర్చకులకు, ట్రస్ట్ పాలకులకు మధ్య వివాదం చోటు చేసుకుంది. దేవస్థానంలో అర్చకత్వం చేసే ఒక అర్చకుడు ఆలస్యంగా విధులకు హాజరు అయ్యాడు. దీంతో దేవస్థానం చైర్మన్ ఆయనకు నోటీసులు ఇచ్చి బయటకు పంపివేశారు. దీంతో పూజారులు ఆగ్రహించి ఆలయ ప్రధాన ద్వారాలకు తాళాలు వేసి దేవాలయం బయట బైఠాయించి వేదమంత్రాలతో ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని చైర్మన్, పూజరులతో మాట్లాడటంతో ఆందోళనను విరమించారు.
ఇక్కడ కొలువై వున్న బృహదీస్వర స్వామి, పెదనాయికి అమ్మవారి దర్శనం పెద్ద వరంగా భావిస్తారు భక్తులు. ఈ ఆలయంలో శిల్ప కళ అద్బుతం. దీనిని చోళ రాజు రాజ రాజ చోళుడు నిర్మించాడు. బృహదీశ్వర ప్రాచీన హిందూ దేవాలయం. ఇది తమిళనాడు లోని తంజావూరు లో కలదు. ఇది శైవాలయం (శివాలయం). దీనిని 11వ శతాబ్దంలో చోళులు నిర్మించారు. ఈ దేవాలయం యునెస్కో చే ప్రపంచ వారసత్వ ప్రదేశం గా గుర్తింపబడినది. భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయంగా పరిగణింపబడుచున్నది ఇది చాల పెద్ద ఆలయం. పదమూడు అంతస్తులున్న ఈ ఆలయ శిఖరం 216 అడుగుల ఎత్తున్నది. పైన 80 టన్నుల బరువున్న నల్లరాతి తో శిఖారాగ్రాన్ని నిర్మించారు. ఇంత బరువున్న ఆ పెద్ద రాయిని అంత ఎత్తుకు ఎలా తీసుకెళ్లారనేది ఎవ్వరికి అర్థం కాని విషయం. ఒక అంచనా ప్రకారం ఇక్కడికి నాలుగు మైళ్ల దూరం నుండి ఏట వాలుగా ఒక రాతి వంతెన కట్టి దాని పైనుండి ఏనుగులతో అతి బరువైన ఆ రాతిని ఈ శిఖరంపైకి తరలించారని తెలుస్తున్నది. రాజ రాజ చోళుడు క్రీ.శ. 985 నుండి 1012 వరకు రాజ్యం చేశాడు. చరిత్రను బట్టి ఈ ఆలయాన్ని రాజు తన 19 వ ఏటనే ప్రారంబింఛాడని తెలుస్తున్నది. గర్బ గుడి లోని శివ లింగం 13 అడుగుల ఏక శిలా నిర్మితం. ఈ ఆలయ ప్రాకారాలు చాల విశాలమైనవి. ప్రాకారం పొడవు 793 అడుగులు కాగా వెడల్పు 393 అడుగులు.
తంజావూరులోని బృహదీశ్వరాలయ గోపురం :
రాజ రాజ చోళుని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళ పురంలో మరో బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం చిన్నదైనా అందులోని శిల్ప కళా రీతులు, వంటి వాటిలో రెండింటి మధ్యలో పెద్ద తేడా లేదు. ఇతడు తండ్రి కంటే ఘనుడు. తన సామ్రాజ్యాన్ని గంగా నది వరకు విస్తరించాడని, అందుకే ఆ ప్రాంతానికి గంగైకొండ చోళ పురం అని పేరు పెట్టినట్లు చారిత్రకాధారం. ఈ ఆలయం తంజావూరులోని బృహదీశ్వరాలయం కంటే విశాలమైనది. కాని తన తండ్రి మీద గౌరవంతో ఆలయ శిఖరాన్ని కొంచెం చిన్నదిగా నిర్మించాడు. ఆలయంలోని శిల్ప కళా రూపాలు చోళుల శిల్ప కళా రీతికి దర్పణాలు. ఆలయం ముందున్న పెద్ద నంది విగ్రహం, గర్బ గుడిలోని 13.5 అడుగుల ఎత్తు 60 అడుగులు విస్థీర్ణం లో వున్న శివలింగం, ఆలయానికే ప్రత్యేక ఆకర్షణ. అంతే గాక ఆలయ గోపురంపై రాజేంద్ర చోళుడు శివ పార్వతుల ఆద్వర్యంలో పట్టాభిషిక్తుడవుతున్నట్లున్న శిల్పం, భూదేవి సహిత విష్ణుమూర్తి శిల్పం, పార్వతీ సమేత శివుని శిల్పం, మార్కండేయుని చరిత్రను తెలిపే శిల్పాలు, ఇలా అనేక శిల్ప కళా రీతులు ఆలయ శోభను ఇనుమడిస్తున్నాయి. రాజేంద్రచోళుని అంతఃపురం ఈ అలయానికి ఒక కిలోమీటరు దూరంలోనె వున్నది. ఒకప్పుడు ఇంతటి సువిశాల సామ్రాజ్యానికి కేంద్ర బిందువైన ఈ ప్రదేశం ఇప్పుడు ఒక కుగ్రామం మాత్రమే. ఈ నగరం ఎలా అంతరించిందో చరిత్రకు కూడ అంతు పట్టదు. ఈ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఇప్పటికి త్రవ్వకాలలో అనేక శిల్పాలు బయట పడుతూ ఆనాటి వైభవాన్ని ఈ నాటికి చాటు తున్నాయి. ఈ దేవాలయానికి అనుకరణగ మరోచోళరాజు తమిళనాడు లోని జయకొండచోళపురం సమీపంలో ఇంకో దేవాలయం కట్టించాడు. ఆ రెండో గుడి తంజావూరు గుడికన్న పెద్దదైనా ప్రస్తుతం ఆదరణ లేక దీనావస్తలో ఉన్నది.