యావత్తు ప్రపంచం అయోధ్య రాముడు వైపు చూస్తోంది. ఈ నెల 22న అయోధ్యలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. అంతా రామమయం జగమంతా రామమయం అంటూ నినాదాలు మర్మోగిపోతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి మూడు రోజులపాటు శోభాయాత్రలు, రామాలయాలలో భజనలు, పూజలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసినట్టు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బిజెపి మాజీ అధ్యక్షులు, నరసాపురం పార్లమెంట్ ఇంచార్జ్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం 22వ తేదీన సెలవు ఇవ్వకపోవడం దారుణమని మాలకొండయ్య అంటున్నారు.
Devotional
అయోధ్యకు శ్రీవారి లడ్డూలు తరలి వెళ్తున్నాయి. ఈనెల 22వ తేదీన అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో అయోధ్యకు శ్రీవారి లడ్డూలు తరలి వెళ్తున్నాయి. తిరుమల శ్రీవారికి ఎంతో ప్రీతీకరమైన లడ్డూలను అయోధ్య రామయ్య సన్నిధికి టీటీడీ అధికారులు తరలిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం తిరుమల నుంచి తిరుపతికి లక్ష లడ్డూలు తరలించారు. టీటీడీ జేఈవో వీరబ్రహ్మం మాట్లాడుతూ.. అయోధ్య లో శ్రీరామచంద్రమూర్తి ఆలయ ప్రారంభోత్సవానికి లక్ష లడ్డూలు పంపిణీ చేయాలని పాలకమండలి నిర్ణయం తీసుకుందని తెలిపారు. తిరుపతి విమానాశ్రయం నుంచి ప్రత్యేక కార్గో ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా అయోధ్యకు తరలిస్తున్నట్లు వివరించారు. ఇవాళ ఉదయం ఈ విమానం ప్రారంభమవుతుందని. సాయంత్రంలోగా అయోధ్యకు చేరుతుందని ఆయన స్పష్టం చేశారు.
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం, కనులపండుగగా ఈ నెల 22న స్వామి వారి శాంతి కళ్యాణం. భారీ గా తరలి రానున్న భక్తులు. ఈ నెల 22న అయోధ్య రామప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో,అదే తరహాలో కోడూరు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కనులపండుగగా జరగనున్నాయి. విశ్వహిందూ పరిషత్, పాంచజన్యగీతాపారాయణ సత్సంగమ్ భక్తులు ఆధ్వర్యంలో శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. వందలాది మంది భక్తులు గీతాపారాయణం, సహస్రనామ పారాయణం గీతా పారాయణం అనంతరం కోడూరు గ్రామంలోని వేంచేసియున్న శ్రీ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నుండిశ్రీ సీతారాములశాంతి కళ్యాణ పాంగణం వరకు శ్రీ రామ శోభాయాత్ర జరగనున్నది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు తిలకించడానికి సుధీర ప్రాంతాల నుంచి సుమారు 20వేల మంది పైగా హిందూ భక్తులు పాల్గొంటారని తెలిపారు. అనంతరం భక్తులకు మహా అన్న సమారాధన ఏర్పాటు చేశామని నిర్వాహలు తెలిపారు.
అయోధ్య శ్రీరామచంద్రుడి పాదాల చెంత సిరిసిల్ల నుండి బంగారు చీరను ఉంచనున్నారు. సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ తన చేతులతో స్వయంగా తయారు చేసిన బంగారు చీరెను ఈనెల 26న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అందించనున్నారు. ప్రధాని చేతుల మీదుగా రాముడి పాదాల చెంత చీరెను ఉంచనున్నారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈరోజు సాయంత్రం సిరిసిల్లలోని హరిప్రసాద్ నివాసానికి వెళ్లారు. హరి ప్రసాద్ స్వయాన తయారు చేసిన బంగారు చీరెను పరిశీలించారు. శ్రీరాముడి చిత్రంతో పాటు రామాయణ ఇతివ్రుత్తాన్ని తెలియజేసే చిత్రాలను సైతం ఆ చీరెలో పొందుపర్చడం విశేషం. 8 గ్రాాముల బంగారం, 20 గ్రాముల వెండితో తయారు చేసిన చీర అందరినీ అబ్బురపరిచేలా ఉంది. అద్బుతంగా చీరెను తయారు చేసిన హరిప్రసాద్ ను ఈ సందర్భంగా బండి సంజయ్ అభినందించారు. శాలువాతో సత్కరించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ స్వయాన తన చేతులతో తయారు చేసిన బంగారు చీరె చాలా బాగుందన్నారు. ఈనెల 26న ప్రధానికి చీరెను అందించనున్నారని, ప్రధాని చేతుల మీదుగా శ్రీరాముడి పాదాల చెంతను ఉంచేందుకు సిద్ధమవడం సంతోషంగా ఉందన్నారు. గతంలో అగ్గిపెట్టెలా చీరెను ఉంచిన చరిత్ర సిరిసిల్ల జిల్లాదన్నారు. ఇంతిటి గొప్ప నైపుణ్యాన్ని సొంతం చేసుకున్న చేనేత రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చేనేత కార్మికులను ఆదుకునేందుకు తనవంతు కృషి చేస్తానని హమీ ఇచ్చారు.
నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో 26 మంది ఉద్యోగులకు దేవస్థానం స్థానచలనం కలిగించింది ఇందులో శాశ్వత ఉద్యోగులు, ఒప్పంద ఉద్యోగులు, పొరుగుసేవ ఉద్యోగులు మొత్తంగా 26 మంది ఉద్యోగులను స్థానికంగా బదిలీ చేశారు. శ్రీశైల దేవస్థానం పరిపాలన సౌలభ్యం కోసం ఉద్యోగులను అంతర్గత బదిలీలు చేసినట్లు ఆలయ ఈవో పెద్దిరాజు ఉత్తర్వులలో తెలిపారు. అయితే ఏఈవో స్థాయి నుండి ఒప్పంద ఉద్యోగి వరకు ఈవో పెద్దిరాజు బదిలీలు చేయడం విశేషం అలానే బదిలీ అయిన ఉత్తర్వుల ప్రకారం 24 గంటల్లో ప్రస్తుతం వారు నిర్వహిస్తున్న విధుల నుండి వారికి నూతనంగా కేటాయించిన విధులకు హాజరు కావాలని ఆలయ ఈవో పెద్దిరాజు ఉత్తర్వులలో తెలిపారు. ఈ మేరకు పలువురు ఉద్యోగులు వారి వారికి కేటాయించిన విధులలో రిపోర్ట్ కూడా సిద్దామయ్యారు.
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రధాన ఘట్టం స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. రథోత్సవం పై లక్ష్మీనరసింహస్వామి ఉత్సవ విగ్రహాలను ఉంచి ఊరేగింపు కొనసాగింది. బాజాభజంత్రీలతో, వేదపండితుల మంత్రోచ్ఛారణలతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి నామస్మరణలతో రథోత్సవం ముందుకు సాగింది. ఆలయ ట్రస్టు చైర్మన్ రాజ ఆదిత్య లక్ష్మణ్ రావు, మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు రథోత్సవం ముందు భక్తులు మధ్య నడిచారు. స్వామివారి రథోత్సవం తిలకించడానికి లక్షలాది భక్తులు తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో స్వామివారి రథోత్సవానికి తరలివచ్చారు. లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఆలయం నుండి లక్ష్మీదేవమ్మ గుట్ట శ్రమి వృక్షం దగ్గర రథోత్సవాన్నికి పూజలు నిర్వహించి ప్రధాన ఆలయం దగ్గరికి తిరిగి చేర్చారు. సాంప్రదాయ ప్రకారము చెంచులకు నరసింహ స్వామి అల్లుడు కావడంతో పూజలో చెంచులు, మహిళలు పాల్గొన్నారు. రథోత్సవాన్ని లాగడానికి భక్తులు పోటీపడ్డారు.
అయోధ్యలో ఈ నెల 22వ తేదీ శ్రీ రామచంద్రులవారి విగ్రహప్రతిష్ట, శ్రీరామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా భక్తులకు 25 గ్రాముల బరువు గల ఒక లక్ష చిన్న లడ్డూలను శ్రీవారి ప్రసాదంగా అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. ఇందుకోసం గురువారం తిరుమలలోని శ్రీవారి సేవాసదన్-1లో శ్రీవారి సేవకులు ఒక్కో కవర్లో రెండు చిన్న లడ్డూలు చొప్పున ప్యాకింగ్ చేశారు. ఈ విధంగా మొత్తం 350 బాక్సులను సిద్ధం చేశారు. 350 మంది శ్రీవారి సేవకులు ఈ సేవలో పాల్గొన్నారు. ఈ లడ్డూలను అయోధ్యకు పంపనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో జనరల్ శివప్రసాద్‌తో పాటు ఏఈవో శ్రీనివాసులు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లా, కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో ఘనంగా ప్రారంభమైన గౌరీ దేవి రథోత్సవం. రథోత్సవంలో భారీగా పాల్గొన్న గ్రామ ఆడపడుచులు, మరియు గ్రామస్తులు. శ్రీరంగపట్నం పురవీధులలో కనుల పండుగ సాగిన గౌరీ దేవి అమ్మవారి రథోత్సవం. గౌరీ దేవి అమ్మవారికి నాన్చనం ప్రకారం సారిని అందజేసిన గ్రామ ఆడపడుచులు. గౌరీదేవి రథోత్సవంలో వివిధ వేషధారణలతో ప్రజలను ఆకర్షణ చేసిన వ్యాసధారణలు. అట్లతద్ది నుండి మొదలయ్యే గౌరీదేవి ఉత్సవాలు నేటితో ముగియడంతో భారీ ఊరేగింపుతో గౌరీదేవిని అత్తవారింటికి సాగనంపిన గ్రామ ఆడపడుచులు.
గత 500 ఏళ్ల హిందువుల ఆకాంక్ష ఈ నెల 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభంతో నెరవేరనుందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు… ఆలయాల స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బషీర్ బాగ్ లోని కనకదుర్గమ్మ ఆలయాన్ని శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… స్వాతంత్ర్యం వచ్చిన తరువాత జరుగనున్న అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకను హిందువులందరు విజయవంతం చేయాలని కోరారు. రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో 150 దేశాలలో ఉన్న హిందువులు ప్రత్యేక్షంగా, పరోక్షంగా పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. ఎంతోమంది బలిదానాలు చేసిన తరువాత అయోధ్యలో శ్రీరాముడి విగ్రహం ప్రాణప్రతిష్ఠ జరుగుతుందని… హిందువుల ఆత్మగౌరవానికి సంబంధించిన ఈ ఆధ్యాత్మిక వేడుకలో హిందువులు అందరూ పాల్గొనాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపుడి గ్రామంలో మంగళవారం రాత్రి సీతారాముల వారి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు దేవుళ్లను ఎత్తుకెళ్లిన సంఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ గరుడ వాహనం, ఆంజనేయస్వామి విగ్రహం, శేష వాహనం (గుర్రం), వాహనం యొక్క గొడుగు, బంగారు పూతతో చేసినటువంటి ఇతర వస్తవులను సైతం రాత్రికి రాత్రి దొంగలు ఎత్తుకెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ తెల్లవారుజామున ఆలయానికి వచ్చిన స్వీపర్ మరియు ఆలయ అర్చకులు గమనించి మరిపెడ పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.