కుప్పం మున్సిపల్ పరిధిలోని లక్ష్మిపురంలో వెలసిన శ్రీ ప్రసన్న వరదరాజ స్వామి ఆలయంలో ఎమ్మెల్సీ భరత్ సతీమణి దుర్గమ్మ జన్మదినం సందర్భంగా కౌన్సిలర్ మణి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ భరత్ మరియు ఆయన సతీమణి దుర్గమ్మ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జగనన్నతో జనం – భరతన్న తో మనం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి మహిళలకు పసుపు, కుంకుమ మరియు సారెను అందజేశారు. రాబోయే ఎన్నికల్లో భరత్ ను ఎమ్మెల్యేగా గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రేస్కో చైర్మన్ సెంథిల్ కుమార్, కౌన్సిలర్లు మణి, సోము శేఖర్ మరియు వైసీపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Devotional
తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి ఆలయంలోకి రాగానే ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలకు భోగి, మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా పడాలని, రైతులు బాగుండాలని కోరారు. దేవుడిని కూడ ఈ దేశంలో రాజకీయాలు చేస్తున్నారని, హిందూ సంస్కృతి ఉన్న వారు దేశాన్నీ గౌరవిస్తారని, దేవుడిని సైతం కొందరు స్వంతం అని వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 6 శాస్త్రాలు, 18 పురాణాలు, 12 ద్వాదశ లింగాలు, 18 జ్యోతిర్లిలింగాలు, నాలుగు వేదాలు, నలుగురు జగద్గురు లు ఉన్న దేశంలో వాళ్ళ చేతుల మీదుగా రామాలయం ప్రారంభం చేయాల్సి ఉండగా, రాజకీయాల కోసం దేవుడిని ఎన్నికల కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. పవిత్ర భారత దేశంలో రాజకీయాలను కూడ మార్కెటింగ్ చేస్తున్నారని, మేము ప్రశ్నిస్తే మేము హిందువులకు వ్యతిరేకమని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హిందుత్వాన్ని విశ్వసించే వారు ఆలోచన చేయాలని, దేవాలయ నిర్మాణం పూర్తి కాలేదని జగద్గురువులు చెబుతున్నారని, దేవుడు కొందరి వాడు కాదు అందరి వాడని, రాముడు, శివుడు, హన్మంతుడు మాకు లేడా అంటే మా పై రాజకీయం చేస్తున్నారన్నారు. దేశం లో మీ ప్రతిష్ట దిగజారుతున్న మీరు ఇంకా రాజకీయం చేస్తున్నారని, పార్లమెంట్ లో ఆదాని, అంబానీ గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారని విమర్శించారు. శివరాత్రి కంటే ముందు రాజన్న ఆలయ అభివృద్ధి పై వీటిడీ ఏ మీటింగ్ ఏర్పాటు చేస్తామని, ఎవరు ప్రశ్నించక ముందే వేములవాడ ఆలయ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
భారతదేశంలో వెలిసిన అష్టాదశ శక్తిపీఠాలలో ‘ఆలంపూర్ జోగులాంబ’ ఐదవది. ఇది తెలంగాణ రాష్ట్రంలోని ఆలంపూర్ ప్రాంతంలో వుంది. సతీదేవి పై దవడ దంతాలు ఇక్కడ పడ్డాయంటారు. భక్తులకు రక్షణనిచ్చి, సదా వారి గృహాలను కాపాడే దేవతగా, తమ ఇళ్ళ వాస్తుదోషాలను పోగట్టే గృహ చండిగా, దుష్టదృక్కులనుంచీ, దుష్ట శక్తులనుంచీ కాపాడే దేవతగా ఈ అమ్మవారిని కొలుస్తారు. అష్టాదశ శక్తిపీఠాల ఆవిర్భావం వెనుక పరమశివునితో కూడాన పురాణగాథ ప్రాచుర్యమంలో ఉంది. ఆలయ చరిత్ర క్రీస్తు శకం 6వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని చాళుక్యరాజులు నిర్మించారు. అత్యద్భుతమైన గోపురాలు, వాటిపై ఉన్న శిల్పకళ, స్తంభాలు అప్పటి నిర్మాణశైలికి సజీవ సాక్ష్యంగా ఉన్నాయి. 9వ శతాబ్దంలో జగద్గురువు శ్రీ శంకరాచార్యులవారు ఇక్కడ శ్రీ చక్రాన్ని ప్రతిష్టించారంటారు. 14వ శతాబ్ధంలో బహమనీ సుల్తాన్ ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. అయితే, ఈ దాడిలో ఆలయం దెబ్బతిన్నా, జోగులాంబ అమ్మవారు, ఆమె శక్తి రూపాలైన చండీ, ముండీలను సమీపంలోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దాచిపెట్టారు. అప్పటినుంచి 2005 వరకూ అమ్మవారు ఇదే ఆలయంలో కొలువై పూజలు అందుకున్నారు. 2005లో కొత్త ఆలయాన్ని నిర్మించి అమ్మవారని పునప్రతిష్టించారు. ఆలయ స్థల పురాణం శివుని భార్య సతీదేవి తన తండ్రి దక్షుడు చేపట్టిన యజ్ఞానికి వెళ్లి అక్కడ అవమానాల పాలవుతుంది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె అక్కడే ప్రాణత్యాగం చేస్తుంది. విషయం తెలుసుకున్న శివుడు వెంటనే ఆ ప్రదేశానికి చేరుకుని.. భార్య మీదున్న ప్రేమతో ఆమె మృతదేహాన్ని తన భుజాన ధరించి లోకసంచారం చేస్తుంటాడు. అదే సమయంలో శివుని వరప్రసాదంతో మృత్యువును జయించానన్న అహంకారంతో తారకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పట్టి పీడిస్తుంటాడు. శివవీర్య సముద్భవంతో జన్మించి, కన్యకల పాలచేత పెంచబడ్డ వాడివల్ల తప్ప మరెవరి చేతిలోనూ మరణం సంభవించదన్న వరం తారకాసురుడుది. ఇటు చూస్తే సతీ వియోగంతో శివుడు అనంత బాధలో ఉంటాడు. పార్వతీదేవిని శివుడు పెళ్లాడితే వారికి పుట్టబోయే కుమారస్వామి వల్లే, తారకాసురుడు చనిపోతాడని దేవతలకు తెలియడంతో వారు శివుడిని అందుకు ఒప్పిస్తారు. కానీ, మొదటి వివాహ బంధం నుంచి శివుడు విముక్తి కావాల్సి ఉంటుందని పరాశక్తి చెబుతుంది. దీంతో విష్ణుమూర్తి తన విష్ణు చక్రంతో సతీదేవి మృతదేహాన్ని ఖండిస్తాడు. మొత్తం పద్దెనిమి భాగాల్లో ఊర్థ్వ దంతం పడిన చోటు ఆలంపూర్. ఇక్కడే అమ్మవారు జోగులాంబగా అవతరించారు.
నవగ్రహ దోషాలు ఉంటే అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగవు. అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. అందుకే జాతకంలో నవగ్రహదోషాలు ఉంటే. వాటికి పరిహారం చేయించుకోవడం చాలా అవసరం. మరి ఏ గ్రహదోషం ఉంటే ఏ పరిహారం చేయాలనే విషయాలు ఇప్పుడు చూద్దాం. నవగ్రహాల్లో మొదటిది రవి ( సూర్యుడు ). జాతకంలో రవి బలహీనంగా ఉంటే అనారోగ్యం, అధికారుల నుంచి వేధింపులు, అనారోగ్య సమస్యలు, ఆత్మ విశ్వాసం లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఇటువంటి వారు భానుడి అనుగ్రహం కోసం ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి. గోధుమ పిండి, గోధుమ రొట్టె, కాషాయ వస్త్రాలు, రాగి, రాగి జావ, మిరియాలు దానం చేయాలి. జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే మనస్సు నిలకడగా ఉండదు. మానసిక వ్యాధులు వెంటాడతాయి. రాత్రిళ్లు నిద్ర పట్టదు. భయం, అనుమానం, స్త్రీలతో విరోధం ఉంటాయి. స్త్రీలకు గర్భాశయ సమస్యలు ఎదురవుతాయి. చంద్రుడి అనుగ్రహం కోసం బియ్యం, పాలు, మజ్జిగ దానం చేయాలి. శివునికి ఆవుపాలతో అభిషేకం జరిపించాలి. పార్వతీదేవి అష్టోత్తరం పారాయణం చేయాలి. వివాహానికి, సంతానానికి ప్రధానమైన గ్రహం కుజుడు. కుజ దోషం ఉంటే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ప్రమాదాల బారిన పడుతుంటారు. అన్నదమ్ములతో విబేధాలు తలెత్తుతుంటాయి. కుజ దోషం నుంచి బయటపడేందుకు కంది పప్పు, మిరపకాయలు, పచ్చి ఖర్జూర, బెల్లం, ఎరుపు వస్త్రాలు, వ్యవసాయ పనిముట్లు దానం చేయాలి.సుబ్రహ్మణ్యస్వామి, ఆంజనేయ స్వామిని పూజించాలి. జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటే నరాల బలహీనత, జ్ఞాపకశక్తి లేకపోవడం, వ్యాపారాల్లో నష్టాలు ఎదురవుతాయి. బుధుడి అనుగ్రహం పొందేందుకు విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి. వేంకటేశ్వరస్వామి, విఘ్నేశ్వరుడిని ప్రార్థించాలి. ఆయా క్షేత్రాలను దర్శించుకోవాలి. వీటితోపాటు పెసరపప్పు, ఆకుకూరలు, కూరగాయలు, ఆకుపచ్చ వస్త్రాలు, విద్యార్థులకు విద్యా సంబంధమైన వస్తువులు దానం చేయాలి. ఆవుకు పచ్చగడ్డి వేయాలి. గ్రహాలు అన్నింటిలో పెద్దది గురు గ్రహం. జాతకంలో గురు గ్రహ దోషం ఉంటే సుఖ సంతోషాలు కరవవుతాయి. ఎన్ని పూజలు, వ్రతాలు చేసిన ఫలితాలు ఉండవు, గురు గ్రహ దోష నివారణకు గురుచరిత్ర పారాయణం చేయాలి. గురువులను గౌరవంచాలి. దైవ క్షేత్రాలను దర్శించుకోవాలి. శనగలు, గుగ్గిళ్లు, తియ్యటి పానీయాలు, పసుపు రంగు వస్త్రాలు దానం చేయాలి. జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే స్త్రీలు అనారోగ్యానికి గురవుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండదు. పెళ్లి కూడా ఆలస్యమవుతుంది. శుక్ర అనుగ్రహం కోసం లక్ష్మీదేవిని పూజించాలి. పర్సులో వెండి నాణెం ఉంచుకోవాలి. స్త్రీలకు సంబంధించిన వస్తువులు దానం చేయాలి. శని గ్రహ దోష నివారణకు ఆంజనేయ స్వామిని ఆరాధించాలి. నీలం ఆకుపచ్చ దుస్తులకు దూరంగా ఉండటం వల్ల కూడా దోష పరిహారం జరుగుతుంది. నుదుటిపై పసుపు పెట్టడం వల్ల గురు బలం పెరుగుతుంది. నువ్వులు, వంట నూనె, నీలి రంగు దుస్తులు దానం చేయాలి. రాహుగ్రహ దోష నివారణకు కనకదుర్గ అమ్మవారిని పూజించాలి. మినప సున్నుండలు, ఇడ్లీలు, మినప గారెలు, పొగ రంగు వస్త్రాలు దానం చేయాలి. నానబెట్టిన మినుములు ఆవుకు పెట్టాలి. జాతకంలో కేతువు బలహీనంగా ఉన్నప్పుడు మానసిక బలహీనతలు, అతి భక్తి, జీవితం మీద విరక్తి, ఒంటరిగా ఉండాలనే భావనలు పెరుగుతాయి. కేతు గ్రహ దోషం నుంచి బయటపడేందుకు పశుపక్ష్యాదులకు ఆహారం పెట్టాలి. తెలుపు రంగు కంబళి దానం చేయాలి. ఆలయాలకు విరాళాలు ఇవ్వాలి.
అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ముందు జరిగే కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. నేటి నుంచి 11 రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఆయన ఆడియో మెసేజ్ ను పోస్ట్ చేశారు. తన జీవితంలో తొలిసారి ఎంతో భావోద్వేగానికి గురవుతున్నానని ప్రధాని చెప్పారు. తొలిసారి ఒక ప్రత్యేకమైన అనుభూతిని పొందుతున్నానని తెలిపారు. శ్రీరాముడి విగ్రహం ప్రాణప్రతిష్టను వీక్షించడం ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. మన గ్రంథాలు చెపుతున్నట్టు భగవంతుడి యజ్ఞం కోసం, ఆరాధన కోసం మనలో ఉన్న దివ్య చైతన్యాన్ని మేల్కొల్పాలి. దీని కోసం మనం పాటించాల్సిన కఠినమైన నియమాలను మన గ్రంథాలు తెలియజేస్తున్నాయి. నాకు సాధువులు సూచించిన ప్రవర్తనా సూత్రాల ప్రకారం ఈరోజు నుంచి 11 రోజుల పాటు ప్రత్యేక ఆచారాన్ని ప్రారంభిస్తున్నానని మోదీ చెప్పారు. ఎన్నో తరాలు కలలుగన్న సమయం ఆసన్నమయిందని మోదీ అన్నారు. ఆ భగవంతుడే తనను భారతీయుల ప్రతినిధిగా చేశాడని చెప్పారు. తాను ఒక సాధనం మాత్రమేనని, ఇది ఒక పెద్ద బాధ్యత అని అన్నారు. ప్రజలందరి ఆశీస్సులు తనకు కావాలని చెప్పారు.
Read Also..
మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని జగన్నాథ ఆలయంలో ఘనంగా లక్ష్మీ నరసింహ స్వామి సుదర్శన హోమం నిర్వహించారు. ఈ ఆలయానికి 600 సంవత్సరాల ఘన చరిత్ర ఉంది. భారత దేశంలో జగన్నాథ ఆలయం రెండవ “పూరి” జగన్నాథ ఆలయంగా పేరుగాంచింది. సుభద్ర బలభద్ర సమేత శ్రీ జగన్నాథ ఆలయంలో స్వామి వారికి వేదమంత్రోచ్ఛరణల మధ్య, భాజా భజంత్రీలతో లక్ష్మీ నరసింహ స్వామి హోమం నిర్వహించడం ఆనవాయితిగా వస్తుంది. భక్తులు ఈ హోమానికి అధిక సంఖ్యలో విచ్చేసి భక్తి, శ్రద్దలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు వితరణ చేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
యూపీలోని అయోధ్యలో ఈ నెల 22న రామ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరగనుండగా.. ఇంటెలిజెన్స్ బ్యూరో కీలక హెచ్చరిక జారీ చేసింది. అయోధ్యలో ఓ ఉగ్రవాది ఉన్నాడని, పలు ప్రాంతాలతో పాటు రాజకీయ నేతలు, అధికారులపై దాడి చేసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో యోగి సర్కార్ అప్రమత్తమైంది. భద్రతను కట్టుదిట్టం చేసింది. 10,715 అర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ కెమెరాలతో పాటు యాంటీ డ్రోన్ టెక్నాలజీని సిద్ధం చేసింది.
నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో మకర సంక్రాంతి పుణ్యకాలన్ని పురస్కరించుకొని నేటి నుండి 12 నుంచి 18 వరకు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని దేవస్థానం ఈవో పెద్ది రాజు తెలిపారు. పంచాహ్నిక దీక్షతో 7 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఈనెల 18న ముగుస్తాయని ఆలయ సాంప్రదాయాన్ని అనుసరించి మల్లికార్జునస్వామికి ఏటా రెండు సార్లు అనగా సంక్రాంతికి, శివరాత్రికి దేవస్థానం బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు ఉదయం 8.30 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశంతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. అదేరోజు సాయంత్రం 5 గంటలకు అంకురార్పణ అగ్ని ప్రతిష్టాపన 7 గంటలకు ధ్వజారోహణ సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజపటం ఆవిష్కరిస్తామని అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాల భాగంగానే శ్రీస్వామి అమ్మవార్లకు ప్రతిరోజు విశేష పూజలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన రెండోరోజు నుంచి అనగా ఈ నెల 13 నుండి శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రతిరోజు సాయంత్రం విశేషపూజలు, వాహనసేవలు నిర్వహిస్తామని ఈనెల 15 వ తేదీ మకర సంక్రాంతి పురష్కరించుకొని శ్రీస్వామి అమ్మవారికి బ్రహ్మోత్సవ కళ్యాణం, అలాగే మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల భాగంగా చిన్న పిల్లలకు భోగి పండ్లు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తునట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా 12 నుంచి 18 వరకు ప్రత్యక్ష, పరోక్ష సేవలైన రుద్రహోమం, చండీ హోమం, మృత్యుంజయహోమం, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కళ్యాణం, శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణం, ఏకాంత సేవలు తాత్కాలిక నిలుపుదల చేస్తామని ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు.
Read Also..
నంద్యాల జిల్లా, నేటి నుండి ఈ నెల 12 నుండి 18 వరకు శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు పంచాహ్నిక దీక్షలతో 7 రోజులు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు. శ్రీ స్వామి వారి యగశాల ప్రవేశంతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్న ఆలయ ఈవో పెద్దిరాజు, అర్చకులు బ్రహ్మోత్సవాలలో భాగంగా సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ సాయంత్రం ధ్వజారోహణం, ధ్వజపటం ఆవిష్కరణ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈనెల 18 వరకు రుద్ర,చండీహోమం, కళ్యాణం, ఏకాంతసేవ నిలుపుదల.
హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి కళ్యాణ మహోత్సవం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య వైభవోపేతంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సమర్పించారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించి, ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరభద్ర స్వామి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ వారి వారి రంగాలలో అభివృద్ధి చెందాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారి కళ్యాణాన్ని తిలకించారు.