Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Political టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసీ నోటీసులు

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసీ నోటీసులు

by Rama
Chandrababu

ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఎమ్మిగనూరు, బాపట్ల, మార్కాపురం సభల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనాను కలిసి వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన ఎన్నికల సంఘం నేడు చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. చంద్రబాబు ప్రసంగాలపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు.

చంద్రబాబు ప్రజాగళం పేరిట ఎన్నికల ప్రచార యాత్ర సాగిస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 31న ఆయన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, ప్రకాశం జిల్లా మార్కాపురం, బాపట్ల జిల్లా కేంద్రంలో ప్రజాగళం సభలకు హాజరయ్యారు.

ఇది చదవండి: హ‌సీన్ దిల్‌రుబ‌ సినిమా తరహాలో.. మరిదితో కాపురం చేసిన వదిన..


వైసీపీకి గుడ్‌బై చెప్పిన చిన్న శ్రీను.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మేనల్లుడు, …
టీడీపీ శ్రేణులకు లోకేశ్ కీలక సందేశం.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి …
ఇవాళ కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. ‘మీ భూమి–మీ హక్కు’ …

Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: