Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra Pradesh శ్రీశైలం జలాశయంలో అడుగంటుతున్న నీటిమట్టం…

శ్రీశైలం జలాశయంలో అడుగంటుతున్న నీటిమట్టం…

by Prakash
Srisailam Reservoir

శ్రీశైలం జలాశయం (Srisailam Reservoir)లో అడుగంటుతున్న నీటిమట్టం తీవ్ర నీటి ఎద్దటిని ఎదుర్కొన్న తెలుగు రాష్ట్రాలు…

నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయం (Srisailam Reservoir)లో నీటిమట్టం నిలువలు రోజురోజుకు అడుగంటుతున్నాయి. ఈ సంవత్సరం పెద్దగా వర్షాభావ ప్రభావం లేకపోవడంతో ఫలితంగా కృష్ణ నది ఎగువ భాగం నుండి దిగు భాగానికి నీటి ప్రవాహం లేకపోవడంతో తీవ్ర నీటి ఎద్దటిని ఎదుర్కొంటున్నారు. తెలుగు రాష్ట్ర ప్రజలు సాగు మరియు త్రాగునీటి అవసరాలకు ప్రధాన జలవనరుగా ఉన్న శ్రీశైలం రిజర్వాయర్లలో నీటి నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. నీటి మట్టం పూర్తిస్థాయిలో అడుగంటింది.ఎగువ నుంచి వచ్చి చేరే వరద జలాల ఉధృతి నిలిచిపోయింది. బుధవారం రాత్రి వరకు ఉన్న అధికారిక సమాచారం శ్రీశైలం రిజర్వాయర్​ నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీ- ఎంసీలు కాగా.. రిజర్వాయర్‌ లో బుధవారం రాత్రికి కేవలం 35.027 టీ- ఎంసీల నీరు మాత్రమే ఉంది అలాగే శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885.56 కాగా ప్రస్తుతం 811.36 అడుగులుగా కనిష్ట స్థాయిలో ఉంది. ఇప్పటికే నిల్వ ఉన్న నీటిని అవసరాల మేరకు ఆలస్యంగా మొదలైన రబీ పంటలకు వదులుతుండటంతో సాగర్‌, పులి చింతల్లోని నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

నీటి అవసరాలు ఎక్కువగా ఉండే పంటల సాగు వీలైనంత తొందరగా పూర్తయితే వేసవి అవసరాలను అధిగమించవచ్చని అధికారులు భావిస్తున్నారు. దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజ్‌లో మాత్రం సామర్థ్యం మేరకు పూర్తిస్థాయి నీటి నిల్వలు ఉన్నాయి. ప్రకాశం బ్యారేజ్‌ సామర్థ్యం కేవలం 3.07 టీ- ఎంసీలు. అయినా పూర్తిస్థాయిలో నిల్వలున్నాయి. నాగార్జున సాగర్‌ సామర్థ్యం 312 టీ- ఎంసీలకు గాను 250 టీ- ఎంసీలు, పులి చింతలలో 45.77 టీ- ఎంసీలకు గాను 30.5 టీ-ఎంసీల నిల్వలున్నాయి. శ్రీశైలంలో నీటి సంవత్సరం ప్రారంభమైన గత ఏడాది జూన్‌ నుంచి ఎగువ నుంచి వరద నీరు చెప్పుకోదగిన స్థాయిలో నీరు రాకపోవడం ఇందుకు కారణం. 2021-22లో 1,118 టీ- ఎంసీల వరద నీరు వచ్చి చేరగా.. కృష్ణా బేసిన్‌ లోని అన్ని ప్రాంతాల్లోని భారీ, మధ్య, చిన్నతరహా రిజర్వాయర్లకు నీటిని వదిలారు. భారీ వర్షాల రూపంలో సాధారణ స్థాయి కన్నా అధికంగా నమోదయిన వర్షపాతం వల్ల 5,614.73 టీ- ఎంసీల నీరు గత ఏడాది జూన్‌ నుంచి అందుబాటు లోకి రావటం మరింత కలిసొచ్చింది.

నాగార్జున సాగర్‌, పులిచింతలతో పాటు- పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, ఇతర దిగువ ప్రాంతాల్లోని రిజర్వాయర్లకు కూడా నీటిని చేరవేశారు. 252 టీ-ఎంసీలను వినియోగించి శ్రీశైలం కుడిగట్టు- విద్యుత్‌ కేంద్రం ద్వారా జల విద్యుదుత్పత్తి చేయగలిగారు. ఆ రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఇలా…. రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్ల నీటి సామర్థ్యం 647.01 టీ- ఎంసీలు కాగా.. నీటి నిల్వలు 65.79 శాతానికి తగ్గుముఖం పట్టాయి. కృష్ణా బేసిన్‌లోని రిజర్వాయర్ల సామర్థ్యం 589.67 టీ- ఎంసీలు కాగా నీటి నిల్వలు 350.04 టీ- ఎంసీలు. 60.21 శాతానికి చేరుకున్నాయి. పెన్నా బేసిన్‌ రిజర్వాయర్ల సామర్థ్యం 239.59 టీ-ఎంసీలు కాగా 185.15 టీ- ఎంసీలు.. 77.28 శాతానికి నీటి నిల్వలు తగ్గు ముఖం పట్టాయి. రాష్ట్రంలో భారీ రిజర్వాయర్ల నీటి సామర్థ్యం 865.64 టీ- ఎంసీలు కాగా.. 564.81 టీ-ఎంసీలు.. 65.26 శాతానికీ, మధ్య తరహా రిజర్వాయర్ల సామర్థ్యం 115.09 టీ- ఎంసీలు కాగా 80.74 టీ- ఎంసీలు.. 70.15 శాతానికి నిల్వలు చేరుకున్నాయి.

ఇది చదవండి : శ్రీకాళహస్తి టిడిపి అభ్యర్థి ప్రకటన తర్వాత శ్రీకాళహస్తిలో గందరగోళం…

రాష్ట్రంలోని 38385 మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంకుల్లో 146.33 టీ- ఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి వరద నీటి ఉధృతి కనీస స్థాయికి పడిపోతూ ఉండటం, రిజర్వాయర్లలో నీటిని ఇంకా రబీ కోసం విడుదల చేస్తున్న నేపథ్యంలో రానున్న మరో 15 రోజుల్లో రిజర్వాయర్లలో నీటి మట్టం మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు- అంచనా వేస్తున్నారు. జలవరం శాఖ అధికారులు ఏది ఏమైనాప్పటికీ కృష్ణా నదిలో నీటి ప్రవాహం లేకపోవడం వర్షాలు పడకపోవడం ఫలితంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎండాకాలం మొదలు నుంచే తీవ్ర నీటి ఎద్దటిని ఎదుర్కొనే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!
విశాఖ జిల్లా మాడుగులలో వంట గ్యాస్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. డిజిటల్ భారత్ పేరుతో బుకింగ్ …
నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.
నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలో పెట్రోల్, డీజల్ నిక్షేపాల అన్వేషణ కలకలం రేపుతోంది. మండలంలోని పలు …
రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో కన్నప్రేమను కాలరాసిన అత్యంత అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

014285
Total views : 79733

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.