Wednesday, September 30, 2026
News Navigation
Wednesday, September 30, 2026
News Navigation

Breaking

Wednesday, September 30, 2026
Home Latest News అమెరికా ప్రతిపాదనను తోసిపుచ్చిన ఇరాన్‌ దూకుడు..

అమెరికా ప్రతిపాదనను తోసిపుచ్చిన ఇరాన్‌ దూకుడు..

by CVR NEWS

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.. ఇరాన్ పై ఇజ్రాయిల్ క్షిపణి దాడు ఉధృతం చేస్తోంది. ఇరాన్ కూడా గల్ఫ్ దేశాలు సహా అమెరికా స్థావరాలపై డ్రోన్లతో విరుచుకుపడుతోంది…ఇజ్రాయిల్ అణు కేంద్రం టార్గట్ గా డ్రోన్ దాడులను ముమ్మరం చేస్తోంది. ఇజ్రాయిల్ ప్రజలు భయాందోళనతో బంకర్లలోపలికి పరుగులు తీయడం యుద్ధ తీవ్రతకు అద్దంపడుతోంది..అంతేకాదు ప్రపంచంలో అత్యంత శక్తమంతమైన అమెరికా ఎఫ్ 35 జెట్లను కూడా ఇరాన్ డ్రోన్స్ టార్గెట్ చేయడంతో అమెరికా పునరాలోచనలో పడింది., కాల్పుల విరమణకు అమెరికా చేసిన ప్రతిపాదనను ఇరాన్‌ తోసిపుచ్చింది. తమ డిమాండ్లు నెరవేరినప్పుడు, తాము నిర్ణయించుకున్నప్పుడు మాత్రమే యుద్ధం ముగుస్తుందని స్పష్టం చేసింది. అప్పటివరకు పశ్చిమాసియాలో భారీ స్థాయిలో దాడులు కొనసాగిస్తామని ఖరాఖండిగా తేల్చి చెప్పింది. అమెరికా, ఇరాన్‌ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తోన్న పాకిస్థాన్‌.. కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇరాన్‌కు తెలిపిన అనంతరం… ఈమేరకు ప్రకటన వెలువడింది. ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు ఇరాన్‌పై 15వేల బాంబులు జారవిడిచినట్లు ఇజ్రాయెల్‌ వెల్లడించింది. గతేడాది జూన్‌లో చేసిన దాడులతో పోలిస్తే నాలుగు రెట్లు అధికమని పేర్కొంది. ఈ మేరకు ఇజ్రాయెల్‌ రక్షణమంత్రి కట్జ్‌, ఐడీఎఫ్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఇయాల్‌ జమీర్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. యుద్ధం మొదలైన తొలి రోజుల్లో అమెరికా, ఇజ్రాయెల్‌లు నిత్యం వెయ్యి బాంబులను జారవిడిచినట్లు చెప్పారు. ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో లెబనాన్‌లో ఇప్పటివరకు 1094 మంది ప్రాణాలు కోల్పోయినట్లు లెబనాన్‌ ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లోనే 22 మంది చనిపోయినట్లు పేర్కొంది. మృతుల్లో 121 మంది చిన్నారులు, 81 మంది మహిళలు ఉన్నట్లు తెలిపింది.
తాజాగా ఇరాన్‌కు మరో దెబ్బ తగిలింది. బందర్ అబ్బాస్ తీరప్రాంతంలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) నావికాదళ కమాండర్ అలీ రెజా తంగ్సిరి మరణించారు. ఈ మేరకు ఇజ్రాయెల్ అధికారిని ఉటంకిస్తూ ఆ దేశ మీడియా నివేదించింది. ఇరాన్‌తో యుద్ధానికి ఐదు రోజుల పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. చర్చల ఫలితాలను బట్టి తదుపరి నిర్ణయం ఉంటుందని మూడు రోజుల క్రితం ప్రకటించారు. అయితే ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం మాత్రం కొనసాగుతోంది.ఈ క్రమంలో హర్మూజ్ జలసంధికి సమీపంలోని బందర్ అబ్బాస్ ప్రాంతంలో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో అలీ రెజా మృతి చెందారని తెలుస్తోంది. అలీ రెజా తంగ్సిరి 2018 నుంచి నావికాదళ కమాండర్‌గా ఉంటున్నారు. ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేయడంలో ఈయనది కీలకపాత్రగా భావిస్తున్నారు.
ఇరాన్‌తో యుద్ధం ముగింపు కోసం ప్రయత్నాలు జరుగుతోన్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరికలు చేశారు. చర్చల విషయంలో ఇరాన్ వింతగా ప్రవర్తిస్తోందన్నారు. ఆ దేశం ఒప్పందం కోసం ప్రాధేయపడుతూనే.. బయటకు మాత్రం అంగీకరించడం లేదన్నారు . అమెరికా ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని, ఘర్షణల ముగించేందుకు చర్చలు జరిపే ఉద్దేశం లేదని ఆ దేశ విదేశాంగమంత్రి స్పష్టం చేశారు.ఇరాన్ యుద్ధం విషయంలో నాటో దేశాల నుంచి ఎలాంటి మద్దతు లభించకపోవడంపై ట్రంప్ మరోసారి తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ఇప్పటికే మిలిటరీ పరంగా తీవ్రంగా నష్టపోయిన ఇరాన్ విషయంలో అమెరికాకు నాటో దేశాలు ఏమాత్రం సహకరించడం లేదు. నాటో నుంచి ఎలాంటి అవసరం లేదు. కానీ, ఇలాంటి ముఖ్యమైన సమయంలో వారు ప్రవర్తించిన తీరును ఎప్పటికీ మర్చిపోబోమని మరో పోస్టు చేశారు ప్రెసిడెంట్ ట్రంప్.
అమెరికా యుద్ధవిమానాలు, యుద్ధనౌకలు, సైనిక స్థావరాల గురించి ఇరాన్‌ కు రష్యా ‘రియల్‌ టైమ్‌ ఇంటెలిజెన్స్‌’ సహకారం అందిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి.. ఆ సమాచారాన్ని ఇరాన్‌కు రష్యా చేరవేస్తోందని వాటి సారాంశం. ఇక తాజా కథనాలపై రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ ప్రతినిధి స్పందించారు. ‘‘ప్రస్తుతం చాలా నకిలీ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇరాన్ నాయకత్వంతో శాంతికోసం మా సంప్రదింపులు కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. ఇరాన్‌లోని బుషెహర్‌ న్యూక్లియర్‌ పవర్ ప్లాంట్‌ నుంచి తన ఉద్యోగులను రష్యా వెనక్కి రప్పించింది. ఈ ప్లాంట్‌పై క్షిపణి పడిన నేపథ్యంలో 163 మంది సిబ్బందిని అక్కడినుంచి తరలించింది. ఈ ప్లాంట్‌ను నిర్మించింది రష్యానే. మిగతా యూనిట్ల నిర్మాణం కోసం అక్కడ కొందరు సిబ్బంది పనిచేస్తున్నారు. అయితే యుద్ధం ప్రారంభమైన దగ్గరినుంచి అక్కడ కార్యకలాపాలను నిలిపివేసింది

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: