Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Telangana ఒంటరిగానే పోటీ చేస్తామన్న కిషన్ రెడ్డి..!

ఒంటరిగానే పోటీ చేస్తామన్న కిషన్ రెడ్డి..!

by Satya
Kishan Reddy

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని బీఆర్ఎస్ సహా ఎవరితోనూ పొత్తు ఉండదని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో శక్తి వందన్ వర్క్ షాప్ నిర్వహించారు. కార్యక్రమానికి కిషన్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. భారతీయులు అంటే గతంలో విదేశాల్లో లెక్కచేయకపోయే వారని కానీ ఇప్పుడు భారత పాస్‌పోర్ట్ ఉంటేనే ప్రపంచవ్యాప్తంగా మంచి గౌరవం దక్కుతోందన్నారు. కానీ కేసీఆర్ కుటుంబం తమ పార్టీపై, పార్టీ నేతలపై అహంకారంతో ఇష్టారీతిన మాట్లాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఏ నాయకులు కూడా కేసీఆర్ కుటుంబం మాదిరి మాట్లాడరన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. తెలంగాణలో 32 జిల్లాలకు జాతీయ రహదారులను కేంద్రం అనుసంధానం చేసిందన్నారు. కేంద్రంలో ప్రజాస్వామ్య బద్ధంగా బీజేపీ పాలన చేస్తోందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రంపై భారం మోపిందని ఆరోపించారు. ఫిబ్రవరి చివరి వారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశముందన్నారు. గతంలో తెలంగాణలో ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు జరిగాయని ఇప్పుడు వారం అటు ఇటుగా ఉండవచ్చునని… అందరు సిద్ధంగా ఉండాలని కేడర్‌కు పిలుపునిచ్చారు.

Advertisements

You may also like

Our Visitor

039697
Total views : 199354

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: