Friday, June 5, 2026
News Navigation
Friday, June 5, 2026
News Navigation

Breaking

Friday, June 5, 2026
Home Latest News మళ్ళీ పరవళ్ళు తొక్కుతున్న కృష్ణమ్మ

మళ్ళీ పరవళ్ళు తొక్కుతున్న కృష్ణమ్మ

by Satya
మళ్ళీ పరవళ్ళు తొక్కుతున్న కృష్ణమ్మ

కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నది ఉరకలు వేస్తుంది. ముఖ్యంగా జూరాల ప్రాజెక్టు ఎగువ నుంచి భారీ వరద వచ్చి చేరుతుండటంతో అప్రమత్తమైన అధికారులు 36 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. కాగా ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు 2.63 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. 36 గేట్ల ద్వారా.. 2.61 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 318.51 మీటర్లు కాగా.. ప్రస్తుతం 317.63 టీఎంసీల నీటి మట్టం ఉండగా.. 9.65 టీఎంసీల పూర్తి స్థాయి నీటి నిల్వకు గాను.. 7.89 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అయితే ఎగువ నుంచి ప్రాజెక్టుకు వస్తున్న వరద పై గంట గంటకు సమీక్ష నిర్వహిస్తున్న అధికారులు గేట్లను పైకి ఎత్తడం, తగ్గించడం చేస్తున్నారు. మళ్ళీ పరవళ్ళు తొక్కుతున్న కృష్ణమ్మ . ముఖ్యంగా తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకు పోయినప్పటి నుంచి అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు వరదను అంచనా వేస్తూ.. దిగువన ఉన్న ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • కొత్తగూడెంలో మార్మోగిన ఆదివాసీ పోరుకేక.
    మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం కేంద్రంగా ఆదివాసీలు తమ గళాన్ని వినిపించారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి (ఏహెచ్‌పీఎస్) తుడుం దెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆదివాసీ పోరుకేక’ భారీ బహిరంగ సభకు రాష్ట్రంలోని వివిధ ఏజెన్సీ ప్రాంతాల నుండి వేలాది మంది ఆదివాసీలు…
  • ప్రశ్నించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌ రావు.
    తెలంగాణలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సభ పెడతానంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని విమర్శించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా, ఎక్కడైనా సభ పెట్టుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు.…
  • అమీర్‌పేట్‌ మైత్రీవనంలో అగ్నిప్రమాదం
    మైత్రీవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం కారణంగా మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. దీంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ సిబ్బంది మంటలను…
  • సచివాలయంలో తెలంగాణ ఉద్యమకారులపై కీలక భేటీ..!
    తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అసలైన ఉద్యమకారుల గుర్తింపు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు కేకే అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియపై విస్తృతంగా చర్చించారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యమకారులకు అన్యాయం జరిగిందన్న…
  • డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.
    ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. అమరావతిలో జరుగుతున్న కీలక కేబినెట్ సమావేశానికి హాజరైన పవన్ కళ్యాణ్, అస్వస్థత కారణంగా సమావేశం మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్న ఆయన నేరుగా మంగళగిరిలోని క్యాంప్…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

020415
Total views : 92876

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.