ములుగు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనకు అధికారులు సన్నాహాలు వేగవంతం చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితులు, మేడారం అభివృద్ధి పనులు, సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి సీతక్క జిల్లా కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితులు, త్వరలో జరగనున్న ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు.మేడారం అభివృద్ధి పనులు, పెండింగ్‌లో ఉన్న పనులను వచ్చే 10 రోజుల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం, ములుగు జిల్లాల్లో పర్యటించి సమ్మక్క-సారలమ్మలను దర్శించుకోనున్నారు. అనంతరం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. 6 వేల కోట్ల రూపాయలకు పైగా విలువైన పంచాయతీరాజ్ శాఖ అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రారంభించనున్నారని, ఎర్రిఘట్టమ్మ సమీపంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.అదే విధంగా ములుగు కలెక్టరేట్ నూతన భవనం, మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, కేంద్ర విద్యాలయంతో పాటు పలు అభివృద్ధి పనులకు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నట్లు మంత్రి తెలిపారు.ముఖ్యమంత్రి పర్యటన తేదీని త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు.
Latest News
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన నిందితుడిగా ఉన్న సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణ ఇవాళ నాంపల్లి కోర్టులో జరిగింది. ప్రస్తుతం షూటింగ్ కోసం ముంబైలో ఉన్న కారణంగా, అల్లు అర్జున్ ఈ విచారణకు కోర్టు అనుమతితో వర్చువల్ గా హాజరయ్యారు. గత వాయిదా సమయంలో వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరగా, న్యాయస్థానం నేడు ఆయనను వర్చువల్‌గా విచారణలో పాల్గొనేందుకు అనుమతించింది. ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌కు సంబంధించి కీలక ప్రక్రియ ఇవాళ పూర్తయింది. ఈ కేసులో అల్లు అర్జున్‌తో పాటు మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చింది. కోర్టు విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ (PP) నిందితులందరికీ దాదాపు 500 పేజీల భారీ ఛార్జిషీట్ కాపీలను అధికారికంగా అందజేశారు.
ఛార్జీషీట్ కాపీల పంపిణీ అనంతరం న్యాయస్థానం కేసు తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. 2024 డిసెంబర్ 4న ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్లో ‘పుష్ప – 2’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హీరో అల్లు అర్జున్ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఆ సమయంలో జరిగిన ఘోర తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్ సహా 23 మందిపై ఛార్జీషీట్ దాఖలు చేశారు.
పలువురు ప్రయాణికులతో కూడిన ఒక సీప్లేన్ న్యూయార్క్ నగరంలోని ఈస్ట్ రివర్‌లో కూలిపోయింది. మాన్హాటన్లోని FDR డ్రైవ్ వద్ద ఉన్న మెరీనా సమీపంలో నీటిలో ఒక విమానం కూలిపోయిందన్న సమాచారం మేరకు తాము స్పందించినట్లు న్యూయార్క్ సిటీ ఫైర్ డిపార్ట్ మెంట్ తెలిపింది. FDNY బృందాలు కనీసం ఎనిమిది మందిని విమానం నుండి బయటకు తీశాయని, వారిలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని, అయితే వారిలో కనీసం ఒకరు వైద్య సహాయాన్ని నిరాకరించారని NYPD తెలిపింది.
విశాఖపట్నం బీచ్‌లను మరింత పరిశుభ్రంగా మార్చి పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతో జీవీఎంసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బీచ్‌ల ఇసుకలో చెత్త పేరుకుపోకుండా యంత్రాలతో శుభ్రపరిచే కార్యక్రమాన్ని మరో ఐదేళ్లపాటు కొనసాగించనున్నారు. ఆర్కే బీచ్, కోస్టల్ బ్యాటరీ, పెదజాలారిపేట, అప్పూఘర్ వంటి తీర ప్రాంతాల్లో పర్యాటకులు వదిలే ప్లాస్టిక్ వ్యర్థాలు, ఆహార ప్యాకెట్లు, బాటిళ్లు ఇసుకలో కలిసిపోతుండటంతో పర్యావరణ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ సమస్యను తగ్గించేందుకు ఇప్పటికే యంత్రాలను ఉపయోగిస్తున్నారు. వాటి విజయవంతమైన పనితీరు కారణంగా దీర్ఘకాలిక నిర్వహణకు టెండర్లు పిలవడం జరిగింది. ఈ చర్యతో విశాఖ బీచ్‌లు మరింత శుభ్రంగా మారి పర్యాటకులకు ఆకర్షణీయంగా మారుతాయని అధికారులు భావిస్తున్నారు.
గత కొన్నేళ్లుగా విశాఖ బీచ్‌లలో పర్యాటకుల రద్దీ పెరగడంతో పాటు చెత్త సమస్య కూడా తీవ్రమైంది. పానీపూరీ, మురీమిక్చర్, ఐస్‌క్రీమ్, నూడిల్స్ వంటి ఆహార పదార్థాల వినియోగం అనంతరం వ్యర్థాలను ఇసుకలో పడేయడం వల్ల బీచ్ అందం దెబ్బతింటోంది. వాటర్ బాటిళ్లు, కూల్‌డ్రింక్ సీసాలు కూడా ఇసుక తిన్నెల్లోనే పడేయడంతో పర్యావరణ సమతుల్యతపై ప్రభావం పడుతోంది. ఈ పరిస్థితిని నియంత్రించేందుకు జీవీఎంసీ యంత్రాలతో ఇసుక శుభ్రపరిచే విధానాన్ని ప్రారంభించింది. రెండు యంత్రాలు పగటిపూట, ఒక యంత్రం రాత్రిపూట పనిచేస్తూ చెత్తను వేరు చేస్తున్నాయి. ఇప్పుడు వాటి నిర్వహణ కొనసాగింపుకు ఐదేళ్ల టెండర్లు పిలవడం ద్వారా దీర్ఘకాలిక పరిష్కారం తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు.
విశాఖ తీర ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో జీవీఎంసీ మరింత పెద్ద ప్రణాళికలను అమలు చేస్తోంది. కోస్టల్ బ్యాటరీ నుంచి ఆర్కే బీచ్ వరకు, అలాగే పెదజాలారిపేట నుంచి అప్పూఘర్ వరకు వివిధ సమయాల్లో యంత్రాలతో ఇసుక శుభ్రత కార్యక్రమం కొనసాగనుంది. ఈ పనులకు దాదాపు రూ.1.8 కోట్లు, రూ.1.46 కోట్లు వ్యయంతో టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్లు ఐదేళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు చేపట్టనున్నారు. బీచ్‌లలో చెత్త సమస్యను పూర్తిగా తగ్గించి పర్యాటకులకు శుభ్రమైన వాతావరణం కల్పించడమే ప్రధాన లక్ష్యం. ఈ చర్యలతో విశాఖ బీచ్‌లు మరింత ఆకర్షణీయంగా మారి పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా సంస్థ తన ఉద్యోగులు ఉపయోగిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌పై కొత్త పరిమితులు విధించింది. ప్రతి ఉద్యోగి వారానికి గరిష్టంగా 200 డాలర్లు అంటే సుమారు 19 వేల రూపాయలు మాత్రమే AI టూల్స్ వినియోగానికి ఖర్చు చేయాలని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం జూలై 6 నుంచి అమల్లోకి రానుంది. అధికంగా AI టోకెన్లు వినియోగించడంతో కంపెనీ ఖర్చులు భారీగా పెరగడంతో ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. గతంలో AI వినియోగాన్ని ప్రోత్సహించిన టెస్లా ఇప్పుడు నిర్వహణ వ్యయాలను నియంత్రించేందుకు కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. దీనిపై అంతర్గత మెమోను ఉద్యోగులకు పంపించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.
టెస్లా సంస్థ గతంలో ఓపెన్ఏఐ, ఆంథ్రోపిక్, ఎక్స్ఏఐ, కర్సర్ వంటి అనేక AI టూల్స్‌ను ఒకే ప్లాట్ఫామ్లో అనుసంధానిస్తూ ఉద్యోగులను విస్తృతంగా ఉపయోగించేందుకు ప్రోత్సహించింది. అయితే, అనూహ్యంగా వినియోగం పెరగడంతో ఖర్చులు గణనీయంగా పెరిగినట్లు కంపెనీ గుర్తించింది. దీనితో AI టోకెన్ వినియోగాన్ని నియంత్రించేందుకు డ్యాష్‌బోర్డ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. ఉద్యోగులు ఎంతమేర వినియోగిస్తున్నారో పర్యవేక్షించేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతోంది. ఆశించిన ఫలితాలు వచ్చినప్పటికీ, ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు సంస్థ విధానంలో మార్పులు చేసింది. ఇదే తరహాలో ఉబర్, అమెజాన్, మెటా వంటి సంస్థలు కూడా ఇప్పటికే ఖర్చు నియంత్రణ చర్యలు తీసుకున్నాయి.
కొత్త విధానంలో ఎలాన్ మస్క్‌కు చెందిన xAI ఉత్పత్తుల బీటా వెర్షన్లు, అలాగే కర్సర్ కంపోజర్ మోడల్‌కు టెస్లా మినహాయింపు ఇచ్చింది. అంటే ఈ టూల్స్ వినియోగంపై పరిమితి వర్తించదు. అయితే, అంతర్గతంగా అభివృద్ధి చేసిన AI మోడళ్ల కంటే కూడా ఉద్యోగులు ఆంథ్రోపిక్‌కు చెందిన క్లాడ్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని సమాచారం. ఇది కంపెనీకి అంతర్గతంగా సవాల్‌గా మారింది. AI వినియోగాన్ని ప్రోత్సహించిన అదే సంస్థ ఇప్పుడు ఖర్చుల కారణంగా నియంత్రణలు విధించడం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్తులో AI వినియోగ విధానాలు మరింత కఠినంగా మారే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
నేటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ప్రారంభం కానుంది. తొలి విడతలో జూలై 6 నుంచి 8 వరకు ఇండోనేషియాలో పర్యటించి ఆ దేశ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు.ఆ తర్వాత జూలై 8 నుంచి 10 వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్న ప్రధాని.. వాణిజ్యం, రక్షణ, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించేందుకు చర్చలు జరపనున్నారు.చివరి దశలో జూలై 10 నుంచి 11 వరకు న్యూజిలాండ్‌లో పర్యటించి.. ఇరు దేశాల మధ్య ఆర్థిక, విద్య, పెట్టుబడుల సంబంధాల బలోపేతంపై దృష్టి సారించనున్నారు.ఈ మూడు దేశాల పర్యటన ద్వారా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, వాణిజ్య, పెట్టుబడి అవకాశాలను విస్తరించడమే ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో భారత రాయబారి గౌరంగలాల్ దాస్‌తో మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఏపీలో కొరియా పెట్టుబడులను ఆకర్షించే అంశంపై విస్తృతంగా చర్చించారు.ఇండియా సెమీకండక్టర్ మిషన్, ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీ 4.0కు అనుగుణంగా శాంసంగ్, ఎల్జీ, ఎస్కె తదితర కొరియా ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ దిగ్గజాలను ఏపీకి తీసుకురావడంలో సహకరించాలని రాయబారిని మంత్రి కోరారు. శ్రీసిటీ, నాయుడుపేట, కొప్పర్తి, విశాఖపట్నంలో రెడీ-టు-యూజ్ పారిశ్రామిక క్లస్టర్లు సిద్ధంగా ఉన్నాయని వివరించారు.
ఐఐటీ తిరుపతి, ఐఐఐటీ శ్రీసిటీ, ఆంధ్ర విశ్వవిద్యాలయాలతో కలిసి కొరియా అనుసంధాన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ప్రతిపాదించారు. అలాగే, కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ భారత్ పర్యటన సందర్భంగా ప్రతిపాదించిన “కొరియా ఎన్క్లేవ్”కు కార్యరూపం దాల్చేలా శ్రీసిటీలో కొరియా ఎంఎస్ఎంఈల కోసం ప్లగ్-అండ్-ప్లే టౌన్షిప్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉందని తెలిపారు.అనంతపురంలోని కియా–హ్యుందాయ్ మోబిస్ ఆటో-ఈవీ క్లస్టర్ విస్తరణ, ఏపీ తీరంలో హెచ్డీ హ్యుందాయ్ తరహా గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్ ఏర్పాటు, బ్యాటరీలు, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల స్థాపన అవకాశాలపై కూడా సమావేశంలో చర్చించారు.
ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. గత కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలతో నగరం అతలాకుతలమవుతోంది. ప్రధాన రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు ప్రాంతాల్లో చెట్లు, ఇళ్లు కూలిపోతున్నాయి. భారీ వర్షాలకు ముంబై మాన్‌ఖుర్ద్‌లోని జనతానగర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. 4 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మృతుల కుటుంబాలకు 4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వం.
ఐతే రానున్న 5 రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తాయని ముంబైకి రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. దీంతో ఇవాళ ముంబైలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణశాఖ హెచ్చరికలతో..విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే ముంబైలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయని స్పష్టం చేసింది. ఇక ముంబైలో 24 గంటల్లో 200 మిల్లీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో వీధులన్నీ జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. చాలా చోట్ల చెట్లు కూలడంతో కొందరు మృత్యువాత పడ్డారు. విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పలు విమానాలు రద్దు చేశారు, మరికొన్ని దారి మళ్లించారు. ముంబైకి రెడ్ అలర్ట్ ప్రకటించడంతో అత్యవసరం ఉంటే తప్ప ప్రజలు ఇళ్లనుంచి బయటికి రావొద్దని హెచ్చరించారు అధికారులు. అలలు ఎగిసిపడే అవకాశం ఉందని, తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. థానే, నవీ ముంబై, పాల్ఘర్ వంటి సమీప ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఆయన తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకున్నారు. అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ముంబైలో ఈ వేడుక నిరాడంబరంగా జరిగింది. ఇది ఆమిర్ ఖాన్‌కు మూడో వివాహం. ఈ వేడుకలో ఆమిర్ ఖాన్, గౌరీ స్ప్రాట్ క్రీమ్, లేత గోధుమ రంగు సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. వివాహ పత్రాలపై ఆమిర్ సంతకం చేస్తున్న ఫోటోను ఆయన ప్రతినిధి విడుదల చేశారు. ఈ పెళ్లికి ఆమిర్ మొదటి భార్య పిల్లలు జునైద్ ఖాన్, ఇరా ఖాన్‌తో పాటు, రెండో భార్య కుమారుడు ఆజాద్ రావు ఖాన్ కూడా హాజరయ్యారు. నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నా, దర్శకుడు అశుతోష్ గోవారికర్, నటుడు వీర్ దాస్, రాజకీయ నాయకుడు రాజ్ థాకరే వంటి ప్రముఖులు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ ఏడాది మార్చిలో తన 60వ పుట్టినరోజున గౌరీతో పెళ్లి విషయాన్ని ఆమిర్ ఖాన్ అధికారికంగా ప్రకటించారు. జులై 5న ఇంట్లోనే చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకుంటున్నామని… ఇరు కుటుంబాలు, కొద్దిమంది స్నేహితులు మాత్రమే హాజరవుతారు అని ఆయన అప్పుడు తెలిపారు. ఆమిర్ ఖాన్ 1986లో రీనా దత్తాను వివాహం చేసుకుని, 2002లో విడిపోయారు. ఆ తర్వాత 2005లో కిరణ్ రావును పెళ్లి చేసుకుని, 2021లో విడాకులు తీసుకున్నారు. ఇక గౌరీ స్ప్రాట్ ఫ్యాషన్ రంగంలో పనిచేశారు. గతంలో ఆమెకు వివాహమై ఒక కుమారుడు ఉన్నాడు. గౌరీ, తాను 25 ఏళ్లుగా స్నేహితులమని, ఇటీవలే ప్రేమలో పడ్డామని అమీర్ కొంతకాలం కిందట వెల్లడించారు.
సోనీ లివ్ లో క్రేజీ ప్రాజెక్ట్‌తో కొత్త హిస్టరీని క్రియేట్ చేయబోతోన్నస్టార్ హీరోయిన్ సమంత.
సమంత ప్రస్తుతం బ్లాక్ బస్టర్ హిట్‌తో దూసుకుపోతున్నారు. ఈక్రమంలో సమంత మరో అద్భుతమైన అవకాశాన్ని దక్కించుకున్నారు. క్రియేటివ్ కంటెంట్ కోసం సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంటూ క్రేజీ ప్రాజెక్ట్‌ల్లో సమంత భాగమవుతున్నారు. అతి పెద్ద ఓటీటీ మాధ్యమాల్లో ఒకటైన సోనీ లివ్ తమిళంలో ఓ కొత్త ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేస్తోంది. అందులో సమంత ప్రధాన పాత్రలో మెప్పించనుండటం విశేషం. ఈ మేరకు సోనీ లివ్ తమిళ్ క్రేజీ అనౌన్స్మెంట్ చేసింది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాల్ని నిర్మాతలు వివరాలను గోప్యంగా ఉంచారు.
ఒక వైపు సినిమాలు, మరోవైపు వ్యాపారాలు అంటూ సమంత విజయవంతంగా దూసుకెళ్తున్నారు. ఎప్పుడూ కొత్తగా ఆలోచించడం, పాత్ బ్రేకింగ్ నిర్ణయాల్ని తీసుకోవడం సమంతకు అలవాటే. ఈ క్రమంలోనే సమంత ఈ కొత్త ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పారు. తమిళ్లో సోనీ లివ్‌లో సమంత చేయబోతోన్న ప్రాజెక్ట్ మీద ఇప్పటికే అంచనాలు పెరిగాయి. ఈ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఈ ప్రాజెక్ట్ గురించి చాలా తక్కువ వివరాలు వెల్లడించినప్పటికీ ప్రేక్షకులు, అభిమానులు మాత్రం దీని గురించి చర్చించుకుంటున్నారు.
ఈ కొత్త ప్రాజెక్ట్ గురించి సమంత తన సోషల్ మీడియాలో విషయాన్ని పోస్ట్ చేస్తూ.. ‘మార్పును స్వీకరించడం, ప్రయాణాన్ని నమ్మడం, కొత్త ఆరంభాలకు స్వాగతం పలకడం వంటి విషయాలను ఈ ఏడాది నాకు గుర్తు చేసింది. సోనీ లివ్ తమిళ్‌తో కలిసి ఈ కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మేం ఎంతో ఆసక్తికరమైన ఒక విషయంపై వర్క్ చేస్తున్నాం. త్వరలోనే దానిని మీ అందరితో పంచుకోవడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని అన్నారు.
సోనీ లివ్ తమిళ్‌తో కలిసి సమంత చేస్తున్న ఈ ప్రాజెక్ట్ గురించి రాబోయే రోజుల్లో మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది.






Total views : 194813