Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Andhra Pradesh శ్రీశైలం పురవీధులలో మల్లన్న రథోత్సవం…

శ్రీశైలం పురవీధులలో మల్లన్న రథోత్సవం…

by Prakash
Mallanna Rathotsavam in the streets of Srisailam

శ్రీశైలంలో తొమ్మిదవ రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంభరాన్నంటాయి. అశేష జనవాహిని మద్య శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. శ్రీస్వామి అమ్మవార్ల రథోత్సవం కన్నులారా చూసేందుకు వేలాది మంది భక్తులు హరహర మహాదేవ శంభోశంకర అంటూ శివనామ స్మరణతో శ్రీశైలం పురవీధులు మారుమ్రోగాయి ఓంకార నాదంతో ఓం నమఃశివాయ అంటూ రథోత్సవం ముందు భక్తి పరవశంతో భక్తులు పులకించి పోయారు. ముందుగా శ్రీ భ్రమరాంబా మల్లికార్జునస్వామి ఉత్సవమూర్తులకు ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం పల్లకిలో వైభవంగా శ్రీస్వామి అమ్మవార్లు గంగాధర మండపం వద్ద ఉన్న రధాశాల వద్దకు తరలిరాగా ఉత్సవమూర్తులకు అర్చకులు వేదపండితులు ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం రథానికి రధంగా పూజలు, రధంగా హోమం, రధంగా దేవత బలిసమర్పణ తదితర పూజలు నిర్వహించి శ్రీస్వామి అమ్మవార్లు రధోత్సవానికి సిద్ధమయ్యారు. అశేష జనవాహిని మద్య రథోత్సవం కధలగానే వేలాదిమంది భక్తులు ఓం నమః శివాయ నినాదించటంతో శ్రీశైల క్షేత్రం పులకించి పోయింది అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ఖర్జూరాలు, అరటిపండ్లను రధంపైకి విసిరి భక్తులు కరతాళ ధ్వనులతో సంబరాలు చేశారు. ఈ రథోత్సవం కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి, ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఆలయ ఈవో పెద్దిరాజు, ట్రస్ట్ సభ్యులు పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు.

Advertisements

You may also like

Our Visitor

009371
Total views : 62086

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.