Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra Pradesh ఏపీలో భారీగా డీఎస్పీల బదిలీ

ఏపీలో భారీగా డీఎస్పీల బదిలీ

by Rama
ఏపీలో భారీగా డీఎస్పీల బదిలీ

ఏపీలో కూటమి సర్కార్ భారీగా డీఎస్పీలను బదిలీ చేసింది. ఒకే ఉత్తర్వులో 96 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ద్వారకా తిరుమల రావు ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వంలో వైసీపీ నేతల అంటకాగారన్న అభియోగాలు ఉన్న డీఎస్పీలకు చంద్రబాబు సర్కార్ షాక్ ఇచ్చింది. వారికి ఎక్కడా పోస్టింగ్ లు ఇవ్వలేదు. బదిలీ అయిన 96 మంది డీఎస్పీల్లో దాదాపు 57 మందిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఏపీలో భారీగా డీఎస్పీల బదిలీ.వివాద రహితంగా వ్యవహరించిన వారిని డీఎస్పీలుగా, ఇతర విభాగాల అధికారులుగా ప్రభుత్వం నియమించింది. బదిలీ అయిన వారిలో విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్, సీఐడీతో పాటు ఇతర విభాగాల అధికారులు ఉన్నారు.
వైసీపీ హయాంలో లూప్ లైన్ లో, అప్రాధాన్యత విభాగాల్లో కొనసాగుతూ వచ్చిన డీఎస్పీలకు ఈ సర్కార్ లో కీలక పోస్టింగ్ లు, సబ్ డివిజన్ లను కేటాయించవచ్చనే టాక్ నడుస్తొంది. ఎన్నికలకు ముందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహించిన యువగళం పాదయాత్రలో .. టీడీపీ నాయకులు, కార్యకర్తలను వేధించిన అధికారుల పేర్లు రెడ్ బుక్ లో రాస్తున్నానని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం జరుగుతున్న బదిలీలు చూస్తుంటే కూటమి నేతల ఫీడ్ బ్యాక్ ఆధారంగానే జరుగుతున్నాయనే భావనను వ్యక్తం చేస్తున్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • దేశీయ స్టాక్‌ మార్కెట్లపై పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం..
    అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, ఇంధన ధరల మంటల కారణంగా గత వారం దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. గత వారం రోజుల్లో సెన్సెక్స్ 2.70 శాతం, నిఫ్టీ 2.20 శాతం మేర పతనమయ్యాయి. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్…
  • తమిళ ఫిల్మిండస్ట్రీలో విషాదం..
    ప్రముఖ తమిళ సినీ నిర్మాత, దర్శకుడు, నటుడు కె. రాజన్ ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నైలోని అడయార్ నదిపై ఉన్న తిరు-వి-కా వంతెన పైనుంచి దూకి ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించే వ్యక్తిగా పేరున్న రాజన్ ఆకస్మిక మరణం…
  • ప్రధాని మోడీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం ద‌క్కింది.
    ప్రధాని మోడీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం ద‌క్కింది. స్వీడన్ దేశపు అత్యున్నత పురస్కారంతో ఆయ‌న‌ను స‌త్కరించారు. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్, కమాండర్ గ్రాండ్ క్రాస్సతో మోడీని సత్కరించింది స్వీడన్ ప్రభుత్వం. ఒక ప్రభుత్వ అధినేతకు స్వీడన్ అందించే…
  • ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ??
    ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు జరగనున్న సరస్వతి నది అంత్య పుష్కరాల‌కు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పుష్కరాలకు హాజరు కావాల్సిందిగా దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నేతృత్వంలో…
  • తెలంగాణ ఎజెన్సీ ప్రాంతాల్లో మొదలైన తునికాకు సేకరణ .
    గిరిజనులకు వ్యవసాయం తర్వాత రెండో జీవనాధారమైన తునికాకు సేకరణ ప్రక్రియ మొదలైంది. అడవుల్లో లభించే ఈ ఆకులను సేకరించి గిరిజనులు ఆదాయం పొందుతారు. ముఖ్యంగా ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లోని అడవుల్లో తునికాకు విస్తృతంగా లభిస్తుంది. బీడీలు తయారు చేయడానికి…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

014358
Total views : 80004

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.