అన్నమయ్య జిల్లా.. పీలేరు.. అట్టహాసంగా పీలేరు టిడిపి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి.. కుటుంబ సభ్యులతో కలిసి పీలేరు లోని ఎమ్మార్వో కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి దాఖలు చేసారు. ఇక సాయంత్రం నాలుగు గంటలకు దాదాపు 5వేల మంది కార్యకర్తలు, అనుచరులు అన్న రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీతో ఒక్కసారి పీలేరు పట్నం దద్దరిల్లింది. నల్లారి సోదరులు (Nallari Brothers) (కిరణ్ కుమార్ రెడ్డి, కిషోర్ కుమార్ రెడ్డి) బ్యాండ్ మేళాలు, భాజా భజంత్రీలు, బాణా సంచాలు నడుమ అట్టహాసంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో పీలేరు పట్టణానికి చెందిన మండలాధ్యక్షులు జడ్పిటిసిలు టిడిపి జనసేన బిజెపికి సంబంధించిన ముఖ్య నేతలు అందరూ పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రి మూసివేత
- ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాం
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి