Tuesday, April 28, 2026
News Navigation
Tuesday, April 28, 2026
News Navigation

Breaking

Tuesday, April 28, 2026
Home National సుప్రీంకోర్టు కుక్ కుమార్తెకు జస్టిస్ చంద్రచూడ్ సన్మానం..!

సుప్రీంకోర్టు కుక్ కుమార్తెకు జస్టిస్ చంద్రచూడ్ సన్మానం..!

by Satya
Justice Chandrachud felicitates daughter of supreme courts cook

సుప్రీంకోర్టు(Supreme Court):

సుప్రీంకోర్టులో కుక్‌గా ఉన్న అజయ్ కుమార్ కూతురు ప్రజ్ఞను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ సన్మానించారు. అమెరికాలో న్యాయశాస్త్రంలో మాస్టర్స్ చేసేందుకు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ స్కాలర్‌షిప్‌లు పొందిన ప్రజ్ఞను జడ్జిల లాంజ్‌లో స్టాండింగ్ ఓవేషన్‌తో అభినందించారు. తనంతట తానుగా ప్రజ్ఞ ఈ ఘనత సాధించిందని.. ఆమెకు కావాల్సినవన్నీ అందించేందుకు మేము అన్ని రకాలుగా సాయం చేస్తామని జస్టీస్ చంద్రచూడ్ అన్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

మళ్లీ ప్రజ్ఞ స్వదేశానికి తిరిగొచ్చి దేశసేవ చేయాలని ఆశిస్తున్నామని తెలిపారు. తను ఎంచుకున్న రంగంలో ఆమె అత్యున్నత శిఖరాలు అధిరోహిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. భారత రాజ్యాంగానికి సంబంధించి సుప్రీం న్యాయమూర్తులందరూ సంతకాలు చేసిన మూడు పుస్తకాలను ప్రజ్ఞకు బహూకరించారు. అనేక కష్టనష్టాలకోర్చి కూతురిని పెంచి పెద్ద చేసిన ప్రజ్ఞ తల్లిదండ్రులను కూడా శాలువా కప్పి సన్మానించారు.

ఇది చదవండి: మూడోసారి మోడీ ప్రధాని కావడం ఖాయం.. డీకే అరుణ


లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..
కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు ఏర్పాటుకానున్నాయి. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే …
బీజేపీలో చేరిన 24 గంటల్లో ఫాలోవర్ల తగ్గుదల..
ఆమ్ ఆద్మీ పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిన రాఘవ్ చడ్డాకు ఊహించని షాక్ తగిలింది. …
పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ..
పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పోలీసుల అనుమతి నిరాకరణతో …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

008649
Total views : 57045

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.