Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Andhra Pradesh కందుకూరు వెంకటేశ్వర స్వామి దేవాలయ భూములపై పొలిటికల్‌ రచ్చ

కందుకూరు వెంకటేశ్వర స్వామి దేవాలయ భూములపై పొలిటికల్‌ రచ్చ

by CVR NEWS

ప్రభుత్వ భూముు ఎక్కడున్నా.. కబ్జాదారుల కళ్లు వాలిపోతున్నాయి. నయాన్నో, భయాన్నో వాటిని కాజేసేందుకు కుట్రలు మొదలవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పులిమామిడిలో ఇలాగే దేవాలయ భూములపై రాజకీయ నేతల కన్ను పడింది. లీజు రూపంలో వాటిని కబళించేందుకు యత్నాలు ప్రారంభమయ్యాయి. గ్రామంలోని చీకటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి పెద్ద ఎత్తున మాన్యాలున్నాయి. మొత్తం 8 సర్వే నంబర్లలో కలిపి 239 ఎకరాల భూములున్నాయి. ఎంతో చదునుగా, అనువుగా ఉన్న ఈ భూములపై కొందరు రాజకీయ నాయకుల కన్ను పడింది. వెంటనే అభివృద్ధి పేరుతో వాటిని లీజుకు తీసుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. నల్గొండకు చెందిన మేకల కావేరి భూముల లీజు కోరుతూ… దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు విజ్ఞప్తి చేశారు. ఈ దరఖాస్తును ఆమె ఎండోమెంట్‌ కమిషనర్‌కు ఫార్వర్డ్‌ చేసినట్లు తెలుస్తోంది. మంత్రి నుంచే ఆదేశాలు వచ్చాయంటూ అధికారులు హడావుడి చేయడం.. ఈ క్రమంలో విషయం బయటకు పొక్కడంతో…. ఆలయం చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. భూములను ఎవరికీ లీజు ఇవ్వొద్దంటూ ఆందోళనకు దిగారు. ఆలయ భూముల్లోనే వంట వార్పు చేపట్టారు. అభివృద్ధి పేరుతో భూముల కబళించే కుట్ర జరుగుతోందని… గ్రామస్తులు ఆరోపిస్తున్నారు…

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: