ప్రజల రక్షణ కోసమే శివసేన, జనసేన ఉన్నాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. బల్లార్పూర్లో నిర్వహించిన బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ 5వ స్థానంలో ఉందని, మూడో స్థానానికి చేరుకునే ప్రయత్నంలో ఉన్నామని తెలిపారు. భారత దేశం బలమైన దేశమని, బలహీనమైనది కాదన్నారు. భారత్‌లో ఉగ్రవాదులను ప్రధాని మోడీ తరిమికొట్టారని తెలిపారు. ఓట్ల కోసం కాదని, మహారాష్ట్ర అభివృద్ది కోసం ప్రచారానికి వచ్చానని తెలిపారు. సనాతనం ధర్మంతో పాటు భాష, యాస, మాండలికాలను కాపాడుకోవాలని చెప్పారు. శివసేన, జనసేన ప్రజల రక్షణ కోసం ఏర్పాటైన సేనలని చెప్పారు. ప్రజలు ఎన్డీఏ కూటమిని గెలిపించి మహారాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- CVR NEWS LIVEAdvertisements
- కడప లో వైసీపీకి షాక్టీడీపీ కి క్యూ కడుతున్న వైసీపీ శ్రేణులు… పులివెందులలో మరోమారు వైసీపీకి షాక్ ఇచ్చిన క్యాడర్.. వేంపల్లిలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు… చక్రాయపేట,వేంపల్లి మండలాల్లో బలం ఉన్న వైసీపీ నేత దేవర్ల చంద్రశేఖర్ రెడ్డితో పాటు…
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి