Sunday, July 26, 2026
News Navigation
Sunday, July 26, 2026
News Navigation

Breaking

Sunday, July 26, 2026
Home Andhra Pradesh రాయదుర్గంలో పోలీస్ మార్చ్ ఫాస్ట్…

రాయదుర్గంలో పోలీస్ మార్చ్ ఫాస్ట్…

by Prakash
Police March Fast

రాయదుర్గంలో పోలీస్ మార్చ్ ఫాస్ట్ (Police March Fast).

ఎన్నికల నిబంధనలో ఎవరు ఉల్లంఘించిన కఠిన చర్యలు.


రాయదుర్గం పట్టణంలో గురువారం కళ్యాణదుర్గం డిఎస్పి శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీస్ మార్చ్ ఫాస్ట్ (Police March Fast) కార్యక్రమాన్ని నిర్వహించారు. రాయదుర్గం శాంతినగర్ బాలగంగాధర్ తిలక్ పాఠశాల నుండి వినాయక సర్కిల్ మీదుగా తెరు బజారు నుండి మెయిన్ రోడ్డు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వరకు పోలీస్ మార్చ్ పాస్ట్ కవాత్ నిర్వహించారు. అనంతరం డిఎస్పి శ్రీనివాసులు మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు విధుల్లో భాగంగా గ్రామాల్లో పట్టణాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా నియోజకవర్గాల వ్యాప్తంగా పోలీస్ కవాత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించడం కోసం పోలీసులు తమ వంతు బాధ్యతగా శాంతితో వాతావరణం కల్పించేందుకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కును వినియోగించుకునే స్వయం ప్రతిపత్తి తో తమ ఓటు హక్కును తానే స్వతంత్రంగా వినియోగించుకునే విధంగా కావలసిన భద్రత మరియు శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని కల్పించేoదుకే పోలీస్ వ్యవస్థ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలిపారు. ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పికెటింగ్ 144 సెక్షన్ తోపాటు అల్లర్లు అరాచకాలు నిర్వహించే వారిపై గట్టి నిఘ ఏర్పాటు చేసి అలాంటివారిపై పోలీస్ లు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ …
మంగళగిరిలో కాపర్ వైర్ చోరీ ముఠాను అరెస్టు చేసిన పోలీసులు.
గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మాణంలో ఉన్న భవనాలను లక్ష్యంగా చేసుకుని విద్యుత్ వైర్లను చోరీ చేస్తున్న …
ఏలూరు జిల్లాలో మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్‌కు విస్తృత ఏర్పాట్లు.
ఏలూరు జిల్లాలో ఈ నెల 24న నిర్వహించనున్న మెగా పేరెంట్స్–టీచర్స్ మీట్‌కు జిల్లా యంత్రాంగం అన్ని …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: