ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో పర్యటించి భూ వివాదంలో ఆత్మహత్యకు పాల్పడిన బోజెడ్ల ప్రభాకర్ రావు కుటుంబాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. అనంతరం జరిగిన సభలో హరీశ్ మాట్లాడు తూ ‘ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఇంటింటికి బాండ్ పేపర్ ఇచ్చి అమలు చేశారా? మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. కల్యాణలక్ష్మి కింద ఆరు లక్షల తులాల బంగారం బాకీ పడింది. భద్రాద్రి రామయ్య సాక్షిగా సీఎం చెప్పిన రైతులకు రెండు లక్షల రుణమాఫీ పూర్తిగా కాలేదు. ఇచ్చిన మాటలు తప్పి ప్రజలకు అన్యాయం చేస్తున్నాడు అని అన్నారు . యాదాద్రి లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకుని ఈ ముఖ్యమంత్రికి మంచి బుద్ధి ప్రసాదించమని కోరుకున్న. సీఎం ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అక్రమంగా మా కార్యకర్తలపై పోలీసులు కేసు పెడితే.. వడ్డీతో సహా చెల్లిస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చాక ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించడం లేదు చేసేది గోరంత .. చెప్పుకునేది కొండంత .. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి గ్యారెంటీలు అమలు చేసేలా పనిచేపిస్తం’ అని అన్నారు
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- కొత్తగూడెంలో మార్మోగిన ఆదివాసీ పోరుకేక.మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం కేంద్రంగా ఆదివాసీలు తమ గళాన్ని వినిపించారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి (ఏహెచ్‌పీఎస్) తుడుం దెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆదివాసీ పోరుకేక’ భారీ బహిరంగ సభకు రాష్ట్రంలోని వివిధ ఏజెన్సీ ప్రాంతాల నుండి వేలాది మంది ఆదివాసీలు…
- ప్రశ్నించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్ రావు.తెలంగాణలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సభ పెడతానంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని విమర్శించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా, ఎక్కడైనా సభ పెట్టుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు.…
- అమీర్‌పేట్ మైత్రీవనంలో అగ్నిప్రమాదంమైత్రీవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం కారణంగా మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. దీంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ సిబ్బంది మంటలను…
- సచివాలయంలో తెలంగాణ ఉద్యమకారులపై కీలక భేటీ..!తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అసలైన ఉద్యమకారుల గుర్తింపు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు కేకే అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియపై విస్తృతంగా చర్చించారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యమకారులకు అన్యాయం జరిగిందన్న…
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. అమరావతిలో జరుగుతున్న కీలక కేబినెట్ సమావేశానికి హాజరైన పవన్ కళ్యాణ్, అస్వస్థత కారణంగా సమావేశం మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్న ఆయన నేరుగా మంగళగిరిలోని క్యాంప్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 92412