Sunday, July 12, 2026
News Navigation
Sunday, July 12, 2026
News Navigation

Breaking

Sunday, July 12, 2026
Home Latest News హైదరాబాద్ లో పవర్ కట్స్ ..!

హైదరాబాద్ లో పవర్ కట్స్ ..!

by Prakash
Power cuts in Hyderabad

హైదరాబాద్‌లో విద్యుత్ కోతలకు TSSPDCL సిద్ధమవుతోంది. సంక్రాంతి తర్వాత విద్యుత్ కోతలు ఉండే అవకాశం ఉందని ఆ సంస్థ ఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ తెలిపారు. వార్షిక నిర్వహణ పనుల్లో భాగంగానే ఈ కోతలని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నామని, జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో పవర్ కట్స్ ఉంటాయని పేర్కొన్నారు. సమ్మర్ రబీ సీజన్‌లో ఉండే విద్యుత్ డిమాండ్‌కు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో రోజుకు రెండు గంటల కోతలు అవసరం పడొచ్చని వివరించారు. సంక్రాంతి తర్వాత కోతలు ఉంటాయని స్పష్టం చేశారు. అయితే, నిర్వహణ పనులు జరిగే ప్రాంతాల్లో మాత్రమే పవర్ కట్స్ ఉంటాయని పేర్కొన్నారు. మెయింటెనెన్స్ పనుల్లో భాగంగా విద్యుత్ తీగలపైకి పెరిగిన చెట్లకొమ్మలు తొలగించడం, విద్యుత్ లైన్లను సరిచూసుకోవడం, అవసరమైతే కొత్తవాటిని వేయడం వంటివి ఉంటాయని ముషారఫ్ తెలిపారు. పవర్ కట్స్ ఉంటాయని చెప్పినంత మాత్రం రోజువారీ ఉండవని, ఒక్కో ఫీడర్‌లో ఒక్కో రోజు మాత్రమే ఉంటాయని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 3 వేల ఫీడర్లు ఉన్నాయని, ఆయా ఫీడర్ల పరిధిలో రెండు గంటల కోతలు ఉంటాయని తెలిపారు. సమ్మర్ డిమాండ్‌ను తట్టుకునేందుకు ప్రతి సంవత్సరం నవంబర్-జనవరి మధ్య వార్షిక నిర్వహణ పనులు ఉంటాయని, కానీ ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఇవి ఆలస్యమైనట్టు ఫారూఖీ వివరించారు.

Advertisements

You may also like

Our Visitor

039781
Total views : 200817

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: