Sunday, April 26, 2026
News Navigation
Sunday, April 26, 2026
News Navigation

Breaking

Sunday, April 26, 2026
Home Andhra Pradesh వివాహితను చిత్రహింసలకు గురి చేస్తున్న సైకో భర్త..

వివాహితను చిత్రహింసలకు గురి చేస్తున్న సైకో భర్త..

by Rama
marital women

కుప్పం మండల పరిధిలోని వసనాడుకు చెందిన శివ శంకర్ కు ముల్లూరు కృష్ణాపురంకు చెందిన హిమబిందుకు 13-10- 2016 న వివాహమయ్యింది. కాగా పెళ్ళైన 6 నెలల నుండి హిమబిందు ను తన భర్త శివ శంకర్ వేధింపులకు గురి చేస్తున్నాడని హిమంబిందు వాపోయింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తనకు పిల్లలు పుట్టలేదనే నెపంతో తన భర్త శివ శంకర్ కుటుంబీకులు తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. శివశంకర్ కుటుంబీకులు తనపై దాడి చేసి వేధింపులకు గురి చేస్తున్నారని కన్నీటి పర్యంతమైంది. తనకు తెలియకుండా గత ఆరు నెలలకు ముందు బీహార్ కు చెందిన మైనర్ బాలికను శివశంకర్ పెళ్లి చేసుకున్నారని, గత వారం ముందు మైనర్ బాలికను ఇంటికి తీసుకొచ్చారని పేర్కొంది. రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నావు అని నిలదీయడంతో, తనను కొట్టి తనను చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆరోపించింది. ముల్లురు కృష్ణాపురం గ్రామంలో అర్ధరాత్రి సమయంలో కారులో తీసుకొచ్చి పడేశారని హిమబిందు వాపోయారు. సంబంధిత అధికారులు స్పందించి శివశంకర్ పై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని హిమబిందు కోరారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: తిరుపతిలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.


కోత సీజన్‌లో డీజిల్ కొరత.. రైతుల ఆందోళన..
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వేలాది …
విశాఖ జిల్లాలో మోటారు సైకిళ్ల దొంగ అరెస్టు..
విశాఖ జిల్లాలో మోటారు సైకిళ్లను చోరీ చేస్తున్న పాత ముద్దాయి శ్రీనుతో పాటు మరో మైనర్ …
నేడు ముంబైలో సీఎం చంద్రబాబు పర్యటన ..
ఏపీ సీఎం చంద్రబాబు మరో అరుదైన జాతీయస్థాయి గౌరవాన్ని అందుకోబోతున్నారు. 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

008281
Total views : 54238

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.