Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home TelanganaKarimnagar ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం విడుదల చేయాలి..

ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం విడుదల చేయాలి..

by Rama
Ponnam Prabhakar

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకునేలా ప్రతి కుటుంబానికి దరఖాస్తు ఫారాలను ప్రభుత్వమే అందిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ప్రజా పాలన కార్యక్రమం పై నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ 28 వ తారీకు నుండి జనవరి 6 వరకు జరిగే ప్రజా పాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అప్పులు కాదు సంపద సృష్టించామని స్వేద పత్రం విడుదల చేసిన బిఆర్ఎస్ నాయకులు, ముందు కల్వకుంట్ల కుటుంబ ఆస్తులపై స్వేద పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్ దారులకు ప్రతి నెల ఒకటవ తేదీ నుండి ఐదో తేది లోపు జీతాలు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందని వెల్లడించారు. ప్రజాపాలన కార్యక్రమంలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా కాంగ్రెస్ కార్యకర్తలు పని చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులు సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: