Saturday, September 12, 2026
News Navigation
Saturday, September 12, 2026
News Navigation

Breaking

Saturday, September 12, 2026
Home National ప్రధాని పర్యటన వేళ రాజస్థాన్‌లో భారీ అగ్ని ప్రమాదం..

ప్రధాని పర్యటన వేళ రాజస్థాన్‌లో భారీ అగ్ని ప్రమాదం..

by CVR NEWS

రాజస్థాన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పచ్‌పద్రలో ఉన్న HPCL రిఫైనరీలో ఈ ప్రమాదం జరిగింది. మరికొద్ది గంటల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రిఫైనరీని ప్రారంభించాల్సి ఉండగా, ఈ ప్రమాదం జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. రిఫైనరీలోని ఒక యూనిట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో భారీగా నల్లటి పొగ ఆకాశాన్ని కమ్మేసింది. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన అధికారులు ప్లాంట్లోని కార్మికులను సురక్షితంగా బయటకు తరలించారు. 20 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపుచేశారు. మంటల తీవ్రత దృష్ట్యా కోట్ల రూపాయల విలువైన యంత్రసామగ్రి కాలిపోయినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది.

రేపు ప్రధాని మోదీ 79వేల450 కోట్ల మెగా ప్రాజెక్టును జాతికి అంకితం చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో SPG భద్రతా బలగాలు ఇప్పటికే అక్కడ విధుల్లో ఉన్నారు. పకడ్బందీ భద్రత ఉన్నప్పటికీ, ప్రారంభోత్సవానికి ఒకరోజు ముందు ఇలాంటి ప్రమాదం జరగడంతో సాంకేతిక కారణాలు లేదా భద్రతా లోపాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: