Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Telangana రికార్డు సృష్టించిన తెలంగాణ బీసీ కులగణన సర్వే

రికార్డు సృష్టించిన తెలంగాణ బీసీ కులగణన సర్వే

by Rama
రికార్డు సృష్టించిన తెలంగాణ బీసీ కులగణన సర్వే

తెలంగాణాలో పెద్ద ఎత్తున బీసీ కులగణన సర్వే నవంబర్ 6వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ సర్వే ద్వారా ఇప్పటివరకు 16 రోజుల్లో ఒక కోటి కుటుంబాల గణనను పూర్తి చేసింది. అతి తక్కువ సమయంలోనే కోటి కుటుంబాల వివరాలను సేకరించి కొత్త తెలంగాణ బీసీ కులగణన సర్వే రికార్డు నెలకొల్పింది. దేశానికే ఆదర్శంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వే రాష్ట్రం మొత్తం విజయవంతంగా సాగుతోంది. ప్రజలందరూ సర్వేలో పాల్గొంటున్నారు . మొత్తం 33 జిల్లాల్లో శుక్రవారం నాటికి దాదాపు ఎనిమిది జిల్లాల్లో సర్వే పూర్తయింది. ములుగు, జనగాం జిల్లాల్లో వందకు వంద శాతం పూర్తి కాగా నల్గొండ, మెదక్ , యాదాద్రి భువనగిరి, జగిత్యాల, గద్వాల సర్వే పూర్తయింది. కామారెడ్డి మంచిర్యాల, అసిఫాబాద్, నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాల్లో 98 శాతం సర్వే జరిగింది.

మొదట ప్రజల్లో ఎన్నో అనుమానాలు ఉన్నప్పటికీ పాటు, భవిష్యత్తులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల అభివృద్ధికి ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునివ్వటంతో అన్ని వర్గాల్లో సర్వేపై సానుకూలత చూపించారు . దాదాపు లక్ష మందికిపైగా ఉద్యోగులు ఈ సర్వే లో పాల్గొన్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు.. లోకేశ్ నిరసన.
    తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అరెస్టు జరిగి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిరసన తెలిపారు. ‘నిజం గెలిచింది’ అనే నినాదంతో ఉండవల్లిలోని తన నివాసంలో 53 కొవ్వొత్తులు వెలిగించి నాటి…
  • సంక్షేమంపై మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదు: కొండపల్లి.
    సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదని రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమలు, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు. ఎన్నికల హామీ మేరకు…
  • భూమికి సంపూర్ణ భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యం.
    సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అనే మూడు మూల మంత్రాలతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సచివాలయానికే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉంటూ వారి జీవితాల్లో వెలుగులు నింపడమే అసలైన సుపరిపాలన అని అన్నారు.…
  • ఆయుష్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ తీపికబురు.
    తెలంగాణలో ఆయుష్ వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆయుర్వేద, హోమియోపతి, యునాని, నాచురోపతి విభాగాల్లోని హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థుల స్టైఫండ్‌లను అల్లోపతి వైద్య విద్యార్థులతో సమానంగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో…
  • తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.
    తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, ఈ విజయాన్ని ఏ శక్తీ ఆపలేదని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే బీజేపీ అధిష్ఠానం దృష్టి పూర్తిగా తెలంగాణపైనే…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: