Monday, September 14, 2026
News Navigation
Monday, September 14, 2026
News Navigation

Breaking

Monday, September 14, 2026
Home Film ఏప్రిల్ 19న విడుదలవుతున్న ‘శశివదనే’..

ఏప్రిల్ 19న విడుదలవుతున్న ‘శశివదనే’..

by Prakash
Sashivadane


ఏప్రిల్ 19న విడుదలవుతోన్న గ్రామీణ ప్రేమ కథా చిత్రం ‘శశివదనే’(Sashivadane).. నైజాంలో సినిమాను రిలీజ్ చేస్తోన్న మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ఎల్‌ఎల్‌పి

‘పలాస 1978’ ఫేం రక్షిత్, అట్లూరి కోమలీ ప్రసాద్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘శశివదనే’ (Sashivadane). గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్.స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మిస్తున్నారు. గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వ‌హించారు. ఏప్రిల్ 19న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు.

విడుదలైన టీజర్, సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్…

ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ‘శశివదనే’ సినిమా నైజాం ఏరియా పంపిణీ హక్కులను ప్రముఖ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ఎల్‌ఎల్‌పి సంస్థ దక్కించుకుంది. రీసెంట్ టైమ్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన మైత్రీ సంస్థ ఇప్పుడు ‘శశివదనే’ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయనుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

శరవణన్ వాసుదేవన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. శ్రీ సాయికుమార్ దారా సినిమాటోగ్రాఫర్‌గా, ఎడిటర్‌గా గ్యారీ బి.హెచ్ వర్క్ చేస్తున్నారు.

ఇది చదవండి : ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఫ్యామిలీ స్టార్ రూపొందించి సకుటంబ ప్రేక్షకుల్ని థియేటర్స్…

నటీనటులు:

రక్షిత్ అట్లూరి, కోమలీ, శ్రీమన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ, రంగస్థలం మహేష్ తదితరులు

సాంకేతిక వర్గం:

సమర్పణ – గౌరీ నాయుడు, బ్యానర్స్ – ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్.స్టూడియోస్, నిర్మాతలు – అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల, రచన-దర్శకత్వం – సాయి మోహన్ ఉబ్బర, సినిమాటోగ్రాఫర్ – శ్రీసాయి కుమార్ దారా, సంగీతం – శరవణ వాసుదేవన్, బ్యాగ్రౌండ్ స్కోర్ – అనుదీప్ దేవ్, ఎడిటర్- గ్యారీ బి.హెచ్, కొరియోగ్రాఫర్ – జేడీ, సి.ఇ.ఒ – ఆశిష్ పేరి, పి.ఆర్.ఒ – సురేంద్ర నాయుడు – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా).

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..
‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌లో …
ప్యారడైజ్ నా కెరీర్‌లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా.
ప్యారడైజ్ నా కెరీర్‌లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా. సెప్టెంబర్ 24న వస్తున్నాం. ఫస్ట్ నుంచి …
ఘనంగా ఇరుముడి బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్..
ఘనంగా ఇరుముడి బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్.. నాకు రెస్పెక్ట్ తెచ్చిపెట్టిన సినిమా అంటూ రవితేజ ఎమోషనల్ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: