తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారి ఉపేందర్ రెడ్డికి నామినేషన్ పత్రాలు అందజేశారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధ ర్ బాబు నేతృత్వంలో వారిద్దరూ నామినేషన్లు వేశారు. సీఎం రేపంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి రాజ్యసభ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి మూడో సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేసారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న అభిషేక్ మను సింఘ్వీ పేరును కాంగ్రెస్ అధినాయకత్వం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. రెండోస్థానంపై రాత్రి క్లారిటీ వచ్చింది. చర్చలు, సం ప్రదింపుల తర్వాత వేం సరేందర్రెడ్డి పేరుసు ఖరారు చేశారు. ఈయనకు రాజ్యసభ అభ్యర్థి త్వం ఖరారు చేయాలని ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డి గట్టిగా కోరడం, అందరితో సన్నిహిత సంబంధాలుండే నరేందర్‌రెడ్డి పేరుపై ఎవరి నుంచీ అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో అధిష్ఠానం కూడా చివరకు సీఎం మాటకే ప్రాధాన్యం ఇచ్చింది. ఇందులో మొదటి స్థానాని కి అభిషేక్ సింఘ్వీ ఎన్నికకు ఎలాంటి సమస్య లేదు. రెండో స్థానానికి అవసరమైన మెజార్టీ కాంగ్రెస్‌కు లేదు. ఎంఐంఎంపై ఆధారపడాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ తరఫున ఎవరూ పోటీ లేకుంటే ఎన్నిక ఏకగ్రీవమవుతుంది.
తెలంగాణ
తెలంగాణ – ఛత్తీస్ గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో ఈ రోజు ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసు బలగాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలిలో 3 తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ములుగు జిల్లా కర్రిగుట్టలు – ఛత్తీస్ గఢ్ లోని కాంకేర్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది. ఈ కాల్పులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, సోమవారం బీజాపూర్‌లో జరిగిన ఎన్ కౌంటర్లో 13 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.
దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబర్ 7న ఉదయం ఏడు గంటల నుంచి నవంబర్ 30 సాయంత్రం ఆరున్నర గంటల వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం, ప్రచారం చేయడం, ప్రచురించడం వంటివి చేయరాదని ఈసీ పేర్కొంది.
నిబంధనలు ఉల్లంఘించిన వారికి చట్ట ప్రకారం రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, నవంబర్ 7న తొలి దశ పోలింగ్, నవంబర్ 17న రెండో దశ పోలింగ్ నిర్వహించనున్నారు. మిజోరాంలో నవంబర్ 7న, మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న, రాజస్థాన్‌లో నవంబర్ 25న, తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి.
ఖమ్మం వాకర్స్ అసోసియేన్ సీనియర్ సిటిజన్స్ కోరుకునే విధంగా ఖమ్మం జిల్లాలను అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం పట్టణ పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో తుమ్మల నాగేశ్వర రావు పాల్గొన్నారు. ఈ సందర్భగా తుమ్మల మాట్లాడుతూ. మనం ఆరోగ్యంగా ఉంటూ సమాజం ఆరోగ్యంగా ఉండేలా పాటుపడాలని.. కలుషిత రాజకీయాలను దూరం చేసి మానసికంగా దృఢంగా ఉండేలా అడుగులు వేయాలని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా లో పాలేరు నుంచి పాపికొండల వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం దక్కిందని. నవంబర్ 30 న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలని తుమ్మల కోరారు. బీఆర్ఎస్ పాలనలో ఖమ్మంలో అభివృద్ధి శూన్యమని.. జిల్లాలో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీల నాయకులు తమ తమ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు.
తెలంగాణాలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. తెలంగాణలో మార్పు కోసం భారత చైతన్య యువజన పార్టీ పేరుతో తెలంగాణలో చిన్నా భిన్నమైన ప్రజల జీవితాలలో వెలుగును నింపడానికి తెలంగాణలో భారత చైతన్య యువజన పార్టీ వచ్చిందని ఆ పార్టీ అధ్యక్షుడు బోడ రామచంద్ర యాదవ్ చెప్పారు. రాబోవు ఎన్నికలలో బరిలోకి దిగుతామని ,తెలంగాణ ప్రజలు స్పష్టంగా రాజకీయ మార్పును కోరుకుంటున్నారని అన్నారు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్న బి.ఆర్.ఎస్ పార్టీ అడుగు అడుగున అవినీతికి పాల్పడుతూ ప్రజల జీవితంతో చెలగాటం ఆడుతొందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే రాబోవు కాలంలో తెలంగాణలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా తాము పనిచేస్తామని భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడ రామచంద్ర యాదవ్ తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం తమ పార్టీకి చెరుకు రైతును గుర్తుగా కేటాయించారని, రానున్న నాలుగైదు రోజుల్లో తమ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించనున్నట్లు తెలిపారు.




Total views : 74521