అంగన్వాడీ కార్యకర్తలు తమ న్యాయమైన డిమాండ్ల కోసం చేస్తున్న సమ్మె 28వ రోజుకు చేరుకుంది.. 27 రోజులుగా ప్రొద్దుటూరు రెవెన్యూ కార్యాలయం ఎదుట నిరవధికంగా ఆందోళన చేస్తున్నప్పటికీ, ప్రభుత్వం స్పందించడం లేదని వినూత్న కార్యక్రమానికి అంగన్వాడీ కార్యకర్తలు పూనుకున్నారు. మోకాళ్లపై నిలబడి ప్రభుత్వం గోవిందా, జగన్ గోవిందా అంటూ నిరసించారు. ఏ రాజకీయ పార్టీ పూరి గొల్పుతే తాము ఆందోళన చేయడం లేదని, ఎన్నో సార్లు ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సమ్మెకు దిగామని అంగన్వాడీలు ఈ సందర్భంగా స్పష్టం చేశారు, ప్రభుత్వం తనకు తాను ఇంటికి వెళ్లడానికి యస్మా చట్టాన్ని తమపై ప్రయోగించిందని , ఇది బస్మాసుర హస్తం లాంటిదని అంగన్వాడీలు పేర్కొన్నారు. ప్రభుత్వం ఎవరి కోసం ఇలాంటి చట్టాలు తీసుకొచ్చిందని సిఐటియు నాయకులు సత్యనారాయణ ఆచారి ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా న్యాయమైన అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు
అంగన్వాడీ కార్యకర్తలు
మార్కాపురం లో అంగన్వాడి కార్యకర్తలు, ఆయాలు చేస్తున్న 9 వ రోజు సమ్మెలో అంగన్వాడి కార్యకర్తలకు వారి పిల్లలు సమ్మెలో పాల్గొని తల్లులకు సంఘీభావ తెలిపారు. తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. అనంతరం పట్టణంలో అంగన్వాడి కార్యకర్తలు, అయాలు జోలే పట్టి అన్నీ బజార్లలో భిక్షాటన చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి తమ ఆవేదన అర్థం చేసుకోవాలని కోరారు.
అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మె 7వ రోజు కు చేరింది. ప్రకాశం జిల్లా మార్కాపురం లో ఏడో రోజు సమ్మెలో అంగన్వాడీలు ఎర్ర చీరలు ధరించి పెద్ద ఎత్తున పట్టణంలో ర్యాలీ నిర్వహించి అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం ముట్టడించారు. పెద్ద ఎత్తున పాల్గొన్న అంగన్వాడీలను చూసి సబ్ కలెక్టర్ సేతు మాధవన్ కార్యాలయం నుండి బయటికి వెళ్లిపోయారు.ఈ సమ్మెలో ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్, సిఐటియు యూనియన్ల నాయకులు పాల్గొన్నారు. డివిజన్ పరిధిలోని 13 మండలాలకు చెందిన అంగన్వాడి కార్యకర్తలు, ఆయాలు
సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ అంగన్వాడి సెంటర్ల తాళాలు పగలగొట్టిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామన్నారు. అవసరమైతే సమస్యల సాధన కోసం త్వరలో రాజధానిని కూడ ముట్టడిస్తామని ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్ తెలిపారు.






Total views : 78633